తెలుగు న్యూస్ / ఫోటో /
AR Rahman Divorce: తల్లి సమక్షంలో పెళ్లి.. 29 ఏళ్లకు డివోర్స్.. ఏఆర్ రెహమాన్ సైరా బాను విడాకులకు అసలు కారణాలు ఇవే!
AR Rahman Marriage Photos And Divorce Reason: ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. 28 ఏళ్ల వయసులో తల్లి సమక్షంలో సైరా బానును పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్ 29 ఏళ్లకు విడాకులు ఇచ్చారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను డివోర్స్‌కు గల కారణాలపై ఓ లుక్కేద్దాం.
(1 / 6)
ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. ఈ విషయం సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ సైరా బాను పెళ్లి ఫొటోలు వైరల్ కాగా.. విడాకులకు గల కారణాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
(2 / 6)
ఏఆర్ రెహమాన్ విడాకుల నేపథ్యంలో సైరా బాను తరపు న్యాయవాది మాట్లాడుతూ.. "ఏఆర్ రెహమాన్‌ను పెళ్లాడి చాలా ఏళ్లు అవుతున్న సైరా బాను తన భర్త నుంచి విడిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది" అని తెలిపారు.
(3 / 6)
"తమ రిలేషన్ షిప్‌లో ఏదో ఒక సమస్య వల్ల ఏర్పడిన ఒత్తిడి కారణంగా సైరా బాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ దంపతుల మధ్య ఉన్న టెన్షన్, ఇబ్బందులు వారి మధ్య పూడ్చలేని గ్యాప్‌ను సృష్టించాయి" అని సైరా బాను తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
(4 / 6)
"దీన్ని ఇక దేనితోనూ ముడిపెట్టలేం.సైరాబాను బాధతో ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ సమయంలో తన విడాకుల నిర్ణయానికి, ఆమెకు వ్యక్తిగత ప్రైవసీ ఇవ్వాలి" అని న్యాయవాది వందనా షా తెలిపారు.
(5 / 6)
ఇదిలా ఉంటే, ఏఆర్ రెహమాన్ సైరా బాను విడాకుల విషయాన్ని దంపతుల కుమారుడు అమీన్ తన ఇన్‌స్టా స్టోరీ పేజీలో షేర్ చేశాడు. అలాగే, 'ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలి' అని రాసుకొచ్చారు.
(6 / 6)
కాగా ఈ జంట 1995లో ఎఆర్ రెహమాన్ తల్లి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బానుకు ఇద్దరు కుమార్తెలు ఖదీజా, రహీమా, ఒక కుమారుడు అమీన్ ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. “నా వయసు 29 ఏళ్లు. నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి నా కోసం అమ్మాయిని వెతకమని చెప్పాను. పెళ్లయ్యాక సైరా బయటకు వెళ్లలేక తీవ్ర మనస్తాపానికి గురయింది. అందరిలా షాపింగ్, ఇతర ప్రదేశాలకు నేను రాలేను అని చెప్పాను” అని తెలిపారు. వ్యక్తిగత, పని ఒత్తిడి కారణాల వల్ల ఏఆర్ రెహమాన్, సైరా బాను మధ్య గ్యాప్ ఏర్పడి విడాకులకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. .
ఇతర గ్యాలరీలు