Visakhapatnam Crime : బాలికలపై అసభ్యకర ప్రవర్తన - ఇద్దరు ఉపాధ్యాయులకు జైలు శిక్ష
బాలికలపై అసభ్యకర ప్రవర్తించిన కేసులో విశాఖపట్నం పొక్సో కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరు ఉపాధ్యాయులకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.25 వేలు జరిమానా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు 2019లో నమోదైంది.
ఇద్దరు విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. అలాగే రూ.25 వేలు జరిమానా కూడా పడింది. ఈ మేరకు విశాఖపట్నం పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పు ఇచ్చారు. నిందితులు చెల్లించే రూ.50 వేలు బాదితులకు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.
కేసు వివరాలు…
విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఆదర్శనగర్‌కు చెందిన గుడే వెంకటేశ్వరరావు, నక్కవానిపాలెనికి చెందిన సొండి సుందరరావు ఆనందపురం మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2019 ఆగస్టు 14న మూడో తరగతి, నాలుగో తరగతులకు చెందిన ఇద్దరు బాలికలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి పాఠశాలకు వెళ్లారు. అయితే తరగతి గదిలో వీరిద్దరూ కనిపించకపోవడంతో ఉపాధ్యాయురాలు వెతుక్కుంటూ మేడపై ఉన్న తరగతి గదులను పరిశీలించారు.
అయితే ఒక గదిలో నిందితులిద్దరూ బాలికలను వివస్త్రను చేసి వీడియోలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచారు. వీరిపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి జి.ఆనందిని నిందుతులకు ఏడాది పాటు జైలు శిక్ష, రూ.25 వేల చొప్పున జరిమానా విధించింది.
బాలికపై యువకుడు అత్యాచారం...పోక్సో కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లాలో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధించి, మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు పట్టణంలోని ఒక వీధులు చోటు చేసుకుంది. కొవ్వూరు టౌన్ సీఐ విశ్వం తెలిపిన వివరాల ప్రకారం….. కొవ్వూరు పట్టణానికి చెందిన బాలికను నాగరాజు అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి వద్ద దిగాలుగా, విచారంగా ఉండటం గమనించిన తల్లి ఎందుకు అలా ఉన్నావని ఆరా తీసింది. దీంతో మూడు రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన గురించి బాలిక తన తల్లికి చెప్పింది.
దీంతో బాలిక తల్లి బుధవారం కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. నాగరాజు అనే యువకుడు తన కుమార్తెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. గతంలో తాము ఇందిరమ్మ కాలనీలో ఉండే సమయంలో తమ ఇంటికి ఎదుట ఇంటిలో నాగరాజు ఉండేవాడని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొంది. మూడు రోజుల క్రితం తన కుమార్తెను అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అలాగే కాకినాడ జిల్లా గండేపల్లిమండలంలో ఒక గ్రామానికిచెందిన బాలికను అదే గ్రామానికి చెందిన వివాహితుడు ప్రేమపేరుతో మోసం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేకసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. నిందితుడిని కోర్టుకు తరలించినట్లు చెప్పారు. అనంతరం నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధధించినట్లు డీఎస్పీ శ్రీహరిరాజు పేర్కొన్నారు.