Gunde Ninda Gudi Gantalu: బాలుపై దొంగతనం నింద - మీనా కళ్ల ముందే అవమానం - రవి ఇంటికి ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు నవంబర్ 29 ఎపిసోడ్‌లో బాలు అపార్ట్‌మెంట్ క్లీనర్‌గా పనిచేస్తున్నాడనే నిజం మీనాకు తెలిసిపోతుంది. ఓ కారులోని మొబైల్ పోవడంలో బాలునే దొంగతనం చేశాడని ఓనర్ నింద వేస్తాడు. భర్తకు జరిగిన అవమానం చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Gunde Ninda Gudi Gantalu: బాలు తనతో ప్రేమగా ఉన్నట్లు కల కంటుంది మీనా. ఆమె కలను బాలు డిస్ట్రబ్ చేస్తాడు. కల ఎప్పటికీ కలగానే ఉంటుంది. అది ఎప్పటికీ నిజం కాదని చెబుతాడు. నా పరిస్థితికి నలుగురు పిల్లలను కనే పొజిషన్‌లో లేదని అంటాడు.
బాలుకు కొత్త షర్ట్...
బాలు మొదటి రోజు డ్యూటీలో చేరుతుండటంతో అతడి కోసం కొత్త షర్ట్ ఇస్తుంది మీనా. క్లీనింగ్ చేస్తుండగా షర్ట్ చెడిపోతుందని బాలు అంటాడు. మీరు ఫారిన్ కారు నడుపుతానన్నారుగా...క్లీనింగ్ ఏంటి అని మీనా అంటుంది. ఫారిన్ కారు అయినా క్లీన్ చేయాల్సిందే కదా...అది నా డ్యూటీ అని మీనాతో బాలు అబద్ధం చెబుతాడు.
ఫారిన్ కారు ఏది...
ఇంటి బయట బాలు నడిపే కారు కనిపించడంతో మీ ఫారిన్ కారు ఏదని భర్తను మీనా ప్రశ్నిస్తుంది. నేను కొత్తగా డ్యూటీలో చేరాను కదా...నన్ను నమ్మి ఓనర్ కారు ఇవ్వాలంటే కొంత టైమ్ పడుతుందని బాలు సమాధానమిస్తాడు. డ్యూటీ టైమ్ అవుతుందని హడావిడి చేసి బయలుదేరుతాడు.
కామాక్షి కోడ్ భాష...
ప్రభావతికి కామాక్షి ఫోన్ చేస్తుంది. కోడ్ భాషలో మాట్లాడుతుంది. మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రంగా వార్నింగ్ ఇచ్చాడని అందుకే కోడ్ భాషలో మాట్లాడుతున్నానని అంటుంది. కామాక్షి కోడ్ భాష ప్రభావతికి అర్థం కాదు. రవిని మీ ఇంటిలో కలుపుకుపోయే ప్రయత్నం ఎంత వరకు వచ్చిందని ప్రభావతిని అడుగుతుంది కామాక్షి. నువ్వే ఒంటరిగా వెళ్లి రవి, శృతిని ఓ సారి కలవమని ప్రభావతికి సలహా ఇస్తుంది.
పరుశరాముడిలా బాలు...
రవి పేరు ఎత్తితే చాలు బాలు పరుశరాముడిలా విరుచుకుపడుతున్నాడని కామాక్షితో ప్రభావతి అంటుంది. సత్యాన్ని ఒప్పించగను గానీ...బాలును ఒప్పించడం ఎలాగో తెలియడం లేదని అంటుంది.
నువ్వు ఇలాగే భయపడితే శృతి ఆస్తి నీకు ఎప్పటికీ దక్కదని...ఒకవేళ రవి మావయ్య సురేంద్ర మారిపోయి కూతురిని, అల్లుడిని ఇల్లరికం తీసుకెళితే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదని కామాక్షి అనడంతో ప్రభావతి భయపడిపోతుంది. రవిని కలవడానికి ఈ రోజే వెళ్లాలని ఫిక్సవుతుంది. కామాక్షిని తన తోడు తీసుకెళ్లాలని అనుకుంటుంది.
నిజం తెలుసుకున్న మీనా...
బాలు అపార్ట్‌మెంట్ క్లీనర్ జాబ్‌లో చేరిన విషయం మీనాకు తెలిసిపోతుంది. అది నిజమో కాదో తెలుసుకునేందుకు బాలు పనిచేసే అపార్ట్‌మెంట్‌కు మీనా వస్తుంది. మీనా వచ్చే టైమ్‌కు బాలు కార్ క్లీన్ చేస్తూ కనిపిస్తుంటాడు. అది చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
తన కారు సరిగ్గా క్లీన్ చేయలేదని బాలును అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి తిడతాడు. కారు తుడవటం రాకుండా ఉద్యోగంలో ఎందుకు చేరుతారో ఏమిటోనని క్లాస్ ఇస్తాడు. నిజంగా నీకు పనిచేయడం వచ్చా...రాదా అని అంటాడు. తన కళ్ల ముందే బాలును ఆ వ్యక్తి నానా మాటలు అనడంతో మీనా సహించలేకపోతుంది.
మొబైల్ దొంగతనం...
ఓ వ్యక్తి కారులో పెట్టిన మొబైల్ మిస్సవుతుంది. బాలునే మొబైల్ దొంగతనం చేశాడని అనుమానిస్తాడు. బాలును చెక్ చేయాలని అంటాడు. తన ఒంటిపై చేయివస్తే ఊరుకునేది లేదని కారు ఓనర్‌కు బాలు వార్నింగ్ ఇస్తాడు. తాను దొంగతనం చేసే స్థాయికి దిగజారలేదని ఓనర్‌తో బాలు అంటాడు. ఇప్పటివరకు ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక్క దొంగతనం జరగలేదని, నువ్వు ఉద్యోగంలో చేరిన రెండో రోజే మొబైల్ పోయిందని కారు ఓనర్ బాలును దొంగతనం చేశావని నిందిస్తాడు.
కారు ఓనర్‌కు క్లాస్...
అప్పుడే ఓ వ్యక్తి కారు ఓనర్ మొబైల్ తీసుకొచ్చి ఇస్తాడు. గ్రౌండ్‌లో మర్చిపోయారని చెబుతాడు. కారు ఓనర్ వెళ్లబోతాడు. అతడిని బాలు ఆపుతాడు. ఇప్పటివరకు నన్ను దొంగలా చూసి...ఫోన్ దొరకగానే సెలైంట్‌గా వెళ్లిపోతారా...పనిచేసేవాళ్లంత దొంగలే అని అనుకుంటే ఎలా అని కారు ఓనర్‌కు క్లాస్ ఇస్తాడు. ఓనర్లు ఏమన్నా పనోళ్లు పడి ఉండాలా... వాళ్లకు మనసు ఉండదా...బాధపడరా..మిమ్మల్ని కూడా ఇలా ఎవరైనా దొంగలు అంటే ఆ బాధ మీకు తెలుస్తుంది. డబ్బుందనే అహంకారంతో ఏది పడితే అది వాగితే బాగుందని కారు ఓనర్‌తో బాలు అంటాడు. భర్తకు జరిగిన అవమానం సహించలేక కన్నీళ్లతో మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
బాలు టైమ్ బ్యాడ్....
కనీసం సారీ కూడా చెప్పకుండా కారు ఓనర్ వెళ్లిపోవడంతో బాలు బాధపడతాడు. నాకు వచ్చిన కోపానికి ...అంటూ మాటలు మధ్యలోనే ఆపేస్తాడు. నా టైమ్ బాగోలేదు...నాలా బాధ్యతలు ఉన్నాడో ఇలాంటి బాధలు భరించాల్సిందేనని తనపై సానుభూతి చూపిన వ్యక్తితో బాలు చెబుతాడు. శృతి హనీమూన్ ప్లాన్ చేస్తుంది. ఇద్దరం మన కుటుంబాలకు దూరమై బాధలో ఉన్నామని...ఈ టైమ్‌లో అలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోవద్దని రవి ఆమెను డిసపాయింట్ చేస్తాడు.
మనోజ్ కంగారు...
మనోజ్ జాబ్ గురించి రోహిణి తెగ బిల్డప్‌లు ఇస్తుంది. అవి చూసి మనోజ్ కంగారు పడతాడు.మీ ఆఫీస్‌లో చెప్పి కారు కొనుక్కోవచ్చు కదా అని మనోజ్‌కు సలహా ఇస్తాడు సత్యం. మనోజ్ మొహమాటపడుతున్నాడు. నువ్వే వెళ్లి కారు సంగతి చూడమని మనోజ్‌ను ఇరికించేస్తుంది ప్రభావతి. వారి మాటలు విని మనోజ్ భయపడతాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.