Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..-stocks to buy today 29th november 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Nov 29, 2024 08:11 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1190 పాయింట్లు పడి 79,0430 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 361 పాయింట్లు కోల్పోయి 23,914 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 395 పాయింట్లు పడి 51,907 వద్దకు చేరింది.

నిఫ్టీ50 23900-23600 మధ్యలో ఉన్నంత వరకు బై-ఆన్​- డిప్స్​ స్ట్రాటజీని అప్లై చేయొచ్చని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 11,756.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8718.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

నవంబర్​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 41,590.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 38,760.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.31శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.38శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.6శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

కిర్లోస్కర్​ న్యుమాటిక్​ కంపెనీ లిమిటెడ్​- బై రూ. 1742.1, స్టాప్​ లాస్​ రూ. 1675, టార్గెట్​ రూ. 1875

కామ్స్​- బై రూ. 4893.35, స్టాప్​ లాస్​ రూ. 4750, టార్గెట్​ రూ. 5,222

కనరా బ్యాంక్​- బై రూ. 102, స్టాప్​ లాస్​ రూ. 97, టార్గెట్​ రూ. 108

పీవీఆర్​ ఐనాక్స్​- బై రూ. 1520, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1555

సిప్లా- బై రూ. 1493, స్టాప్​ లాస్​ రూ. 1475, టార్గెట్​ రూ. 1530

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కరూర్ వైశ్యా బ్యాంక్: రూ.238.38 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.255, స్టాప్ లాస్ రూ.230;

ఆస్టర్ డీఎం హెల్త్కేర్: రూ.488.70 వద్ద కొనండి, టార్గెట్ రూ.523, స్టాప్ లాస్ రూ.471;

జీఆర్ఎస్ఈ: రూ.1721.35 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1842, స్టాప్ లాస్ రూ.1661;

ఎస్జేవీఎన్: రూ.117.96 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.126, స్టాప్ లాస్ రూ.114;

భారత్ డైనమిక్స్: రూ.1170 వద్ద కొనండి, టార్గెట్ రూ.1252, స్టాప్ లాస్ రూ.1119.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం