Siddipet Crime: చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం, జైలుకు వెళ్లొచ్చిన తీరు మారని యువకులు-hardened criminals youth continue drug trade despite legal consequences ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Siddipet Crime: చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం, జైలుకు వెళ్లొచ్చిన తీరు మారని యువకులు

Siddipet Crime: చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం, జైలుకు వెళ్లొచ్చిన తీరు మారని యువకులు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 29, 2024 07:23 AM IST

Siddipet Crime: చెడు వ్యసనాలకు బానిసలై ముగ్గురు యువకులు సులువుగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు గంజాయి విక్రయిస్తూ ఒకసారి జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు.

సిద్దిపేటలో గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్‌
సిద్దిపేటలో గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్‌

Siddipet Crime: ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైనా వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మరల అదే వృత్తిని కొనసాగిస్తుండగా సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుండి 10 కిలోల గంజాయి, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు కలిసి .…

గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అమ్మదీపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అరికెల శేఖర్ (23), అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్(23), సుక్కసారి భాను ప్రసాద్(21) ముగ్గురు కలిసి చెడు అలవాట్లకు బానిసలై అధికంగా డబ్బులు సంపాదించడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముగ్గురు కలిసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా సిద్దిపేట కొండపాక మండలం సిరిసినగండ్లలో నివసిస్తున్నారు.

కూలీలకు, యువకులకు విక్రయిస్తూ

ఈ క్రమంలో ముగ్గురు కలిసి సిద్దిపేట పరిసర ప్రాంతాలలో ద్విచక్రవాహనాలను దొంగతనం చేశారు. అదే మోటార్ సైకిల్ పై భద్రాచలం జిల్లా సీలేరుకు వెళ్ళి వర్ధన్ వద్ద 2, 3 సార్లు గంజాయి తీసుకొచ్చి గజ్వేల్, అమ్మదీపూర్ చుట్టూపక్కల గ్రామాల కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు విక్రయించారని తెలిపారు. దీంతో వీరిని 8 నెలల క్రితం గంజాయి అమ్మడానికి వెళుచుండగా సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఇటీవలే బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చారని తెలిపారు.

జైలుకు వెళ్లొచ్చినా మారని తీరు

జైలుకు వెళ్లి వచ్చిన వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మరల అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో గత వారం రోజుల క్రితం శేఖర్, నరేష్ గంజాయి తీసుకుని రావడానికి సీలేరు వెళ్తున్నామని వారి స్నేహితుడు భాను ప్రకాష్‌ కు ఫోన్ చేశారు. కాగా భానుప్రకాష్ నాకు పని ఉందని, నాకు గంజాయి కావాలని రూ. 7000 శేఖర్ కు ఫోన్ పే ద్వారా పంపించాడు. ఈ క్రమంలో శేఖర్, నరేష్ ఇద్దరు కలిసి స్నేహితుడు బైకు తీసుకొని భద్రాచలం సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తి వద్ద రూ. 30,800 ఇచ్చి 20 కిలోల గంజాయి కొనుగోలు చేశారు.

అనంతరం మోటార్ సైకిల్ పై వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని భావించి శేఖర్ ఒక బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకొని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుండి ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారని అనుమానంతో ఊరు బయట గ్రామ శివారులో మల్లన్న సాగర్ కట్ట వద్ద గంజాయిని దాచి పెట్టాడు.

మరో ఇద్దరు పరారీలో .…

దీంతో గంజాయి కావాలని భాను ప్రసాద్ రాగానే అక్కడికి వెళ్లి అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయిని ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా శేఖర్, భానుప్రసాద్ అనే ఇద్దరిని పట్టుకొని విచారణ చేపట్టారు. నిందితుల వద్ద నుండి 10 కిలోల గంజాయి, 1 సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇద్దరిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు నరేష్, వర్ధన్ పరారీలో ఉన్నారని, త్వరలో ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ఏసిపి తెలిపారు.

Whats_app_banner