AP Paddy Procurement: ఏపీ ధాన్యం సేకరణపై అప్డేట్‌, 24శాతం తేమ ఉన్నా ఎమ్మెస్పీ… వాతావరణ మార్పులతో వేగంగా కొనుగోలు…-update on ap paddy procurement decision to pay support price even if moisture content is 24 percent ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Paddy Procurement: ఏపీ ధాన్యం సేకరణపై అప్డేట్‌, 24శాతం తేమ ఉన్నా ఎమ్మెస్పీ… వాతావరణ మార్పులతో వేగంగా కొనుగోలు…

AP Paddy Procurement: ఏపీ ధాన్యం సేకరణపై అప్డేట్‌, 24శాతం తేమ ఉన్నా ఎమ్మెస్పీ… వాతావరణ మార్పులతో వేగంగా కొనుగోలు…

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 29, 2024 04:00 AM IST

AP Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రభుత్వం కీలక అప్టేట్ ఇచ్చింది. రైతులు ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని సూచించింది. గరిష్టంగా 24శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

ధాన్యం కొనుగోళ్లపై అప్డేట్
ధాన్యం కొనుగోళ్లపై అప్డేట్

AP Paddy Procurement: ఏపీలో ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలన్నారు. కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాలలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరబోసిన వరి రాశులను పరిశీలించి, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేసామన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ వేగంగా చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోకుండా ధాన్యం సేకరించి తరలిస్తున్నారు.

కృష్ణాజిల్లా పామర్రు నియోజవర్గం కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాలలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరబోసిన వరి రాశులను పరిశీలించి, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేసామన్నారు తక్కువ రేటుకు అమ్ముకోవద్దని ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.

తేమ శాతం లో కూడా సడలింపు చేశామని 24% శాతం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే ల ద్వారా అమ్ముకోవచ్చని రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్న నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని వెంటనే సరి చేస్తామని తెలియజేశారు . ధాన్యాన్ని దళారుల మాట విని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు..

తేమ శాతం లో కూడా సడలింపు చేశామని 24% శాతం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే ల ద్వారా అమ్ముకోవచ్చని రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్న నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని వెంటనే సరి చేస్తామని తెలియజేశారు .

ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీసం మద్దతు ధర లభిస్తుందని, శుక్రవారం సాయంత్రంలోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నాం.. రైతులెవరు ఆందోళన చందనవసరం లేదని చెప్పారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు. వాతావరణ మార్పులతో 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ... నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుందని, రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగమంతా రాత్రి పగళ్లూ కష్టపడుతుందన్నారు.

వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా.. ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ధాన్యం విక్రయాలపై..క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రైతులకు నమ్మకం కలిగించేలా.. ధాన్యం కొనుగోల్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో.. రైతుల ఖాతల్లో నగదు జమ చేస్తున్నామన్నారు.

24 తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని.. సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా.. బకాయి నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కల్పించామని, రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే.. కల్లాల వద్దకే గోనేసంచెలు.. రవాణా వాహనాలను పంపించేలా ఏర్పాటు చేశామన్నారు. రైతులెవరు దళాలను ప్రోత్సహించవద్దన్నారు.

Whats_app_banner