Andhra Pradesh News Live November 29, 2024: AP Crime News : ప్రేమ పేరుతో బాలిక‌పై లైంగిక దాడి - గర్భం దాల్చటంతో వెలుగులోకి అసలు విషయం!-today andhra pradesh news latest updates november 29 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 29, 2024: Ap Crime News : ప్రేమ పేరుతో బాలిక‌పై లైంగిక దాడి - గర్భం దాల్చటంతో వెలుగులోకి అసలు విషయం!

AP Crime News : ప్రేమ పేరుతో బాలిక‌పై లైంగిక దాడి - గర్భం దాల్చటంతో వెలుగులోకి అసలు విషయం!(istockphoto)

Andhra Pradesh News Live November 29, 2024: AP Crime News : ప్రేమ పేరుతో బాలిక‌పై లైంగిక దాడి - గర్భం దాల్చటంతో వెలుగులోకి అసలు విషయం!

04:53 PM ISTNov 29, 2024 10:23 PM HT Telugu Desk
  • Share on Facebook
04:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 29 Nov 202404:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : ప్రేమ పేరుతో బాలిక‌పై లైంగిక దాడి - గర్భం దాల్చటంతో వెలుగులోకి అసలు విషయం!

  • ప్రేమ పేరుతో ఓ బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు బాలికను లొంగదీసుకున్నాడు. అయితే సదరు బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం పెద్దలకు తెలియటంతో మైనర్లు అయినప్పటికీ పెళ్లి చేయాలనుకున్నారు. అధికారుల ఎంట్రీతో బాలికను చిల్డ్ర‌న్ హోంకు త‌ర‌లించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202412:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: South Central Railway : రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. తిరుప‌తికి ప్రత్యేక రైళ్లు.. వందేభార‌త్‌కు అద‌న‌పు కోచ్‌లు

  • South Central Railway : రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రద్దీకి తగ్గట్టు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202411:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Ration Dealer Recruitment : కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

  • AP Ration Dealer Recruitment 2024: కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబ‌ర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 49 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202410:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Heavy Rains : అలర్ట్.. అలర్ట్.. ఈ జిల్లాల్లో అతి తీవ్ర భారీ వర్షాలు, తస్మాత్ జాగ్రత్త!

  • AP Heavy Rains : ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రజలకు గండంగా మారింది. శుక్రవారం రాత్రి వరకు ఇది తుపానుగా బలపడనుంది. దీని ప్రభావంతో.. పలు జిల్లాల్లో తీవ్ర అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202409:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : కాకినాడలో అధికారులు స్మగ్లింగ్‌కు అండగా ఉంటున్నారు.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్

  • Pawan Kalyan : కోస్టల్ పోలీసింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్ట్ తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏది అంటూ ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి పవన్ చురకలు అంటించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. పోర్టులో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202406:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan vs Sharmila : అదానీ వల్ల లబ్ధి పొందలేదా జగన్‌మోహన్ రెడ్డి గారూ.. బైబిల్ మీద ప్రమాణం చేయండి : షర్మిల

  • Jagan vs Sharmila : అదానీ వ్యవహారం ఏపీలో రాజకీయ మంటలు రాజేస్తోంది. గురువారం జగన్ అదానీ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వగా.. తాజాగా జగన్ సోదరి షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ వల్ల లబ్ధి జరగలేదా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202405:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Postal Department : తపాలా శాఖ కీలక నిర్ణయం.. ఇంటివద్దకే డిజిటలైజేషన్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌

  • Postal Department : చాలామంది విశ్రాంత ఉద్యోగులు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు. బయటకు రాలేని స్థితిలో మరికొందరు ఉంటారు. అలాంటి వారికి తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ప్రతీ ఏడాది సమర్పించాల్సిన డిజిటలైజేషన్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌‌ను ఇంటివద్దకే పంపాలని నిర్ణయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202405:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sachivalayalu: సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన జరిగేనా, పౌరసేవలు తక్కువ, పనిఒత్తిడి ఎక్కువ

  • AP Sachivalayalu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు సమీపిస్తున్నా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల పనితీరును క్రమబద్దీకరించలేకపోయింది.  గత ప్రభుత్వం పథకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ, ఇతర శాఖల పనులు చేయడమే విధిగా మారింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202404:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP EAGLE Police: డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కు పాదం మోపేందుకు పోలీస్ శాఖలో కొత్తగా ఈగల్ ఏర్పాటు

  • AP EAGLE Police: ఏపీ పోలీస్‌ శాఖలో కొత్త దళం ఏర్పాటైంది. గంజాయి,మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ - ఈగల్‌ ఏర్పాటైంది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగ‌ల్‌ను ఏర్పాటు హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202404:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ‌.. పెళ్లికి నిరాక‌రించిన త‌ల్లిదండ్రులు.. కాలువలో దూకిన యువ‌తి!

  • Vijayawada : ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచ‌య‌మైన వ్య‌క్తిని యువ‌తి ప్రేమించింది. ఆ వ్య‌క్తితో పెళ్లికి త‌ల్లిదండ్రులు నిరాక‌రించారు. దీంతో యువ‌తి కాలువ‌లో దూకేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు న‌మోదు చేసి గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఒక సారి ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202401:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Siddipet Crime: చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం, జైలుకు వెళ్లొచ్చిన తీరు మారని యువకులు

  • Siddipet Crime: చెడు వ్యసనాలకు బానిసలై ముగ్గురు యువకులు సులువుగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు గంజాయి విక్రయిస్తూ ఒకసారి జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202412:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Secretariat Employees: ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల మందు పార్టీ, కేసు నమోదు, క్యాంటీన్‌ ఎన్నికల్లో ప్రలోభాలు

  • AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులు వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో జరుగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి,ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో  ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202412:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: ఏపీలో తగ్గిన మద్యం ధరలు, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 తగ్గించిన ప్రముఖ బ్రాండ్లు, మరింత తగ్గే అవకాశం

  • AP Liquor Prices Slashed: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వంలో  పాత ధరలనే అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర‌్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రముఖ బ్రాండ్లు మద్యం ధరల్ని తగ్దించుకున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి