Bigg Boss: బిగ్‌బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే - టికెట్ టూ ఫినాలే లాస్ట్ కంటెండ‌ర్‌గా నిఖిల్ - పృథ్వీకి అన్యాయం-bigg boss 8 telugu 13th week voting results avinash and prithvi likely to evicted this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: బిగ్‌బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే - టికెట్ టూ ఫినాలే లాస్ట్ కంటెండ‌ర్‌గా నిఖిల్ - పృథ్వీకి అన్యాయం

Bigg Boss: బిగ్‌బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే - టికెట్ టూ ఫినాలే లాస్ట్ కంటెండ‌ర్‌గా నిఖిల్ - పృథ్వీకి అన్యాయం

Nelki Naresh Kumar HT Telugu
Nov 29, 2024 06:06 AM IST

Bigg Boss: టికెట్ టూ ఫినాలే చివ‌రి కంటెండ‌ర్‌షిప్‌ను నిఖిల్ ద‌క్కించుకున్నాడు. కంటెండ‌ర్‌షిప్ కోసం జ‌రిగిన టాస్కుల్లో పృథ్వీనే అద‌ర‌గొట్టినా.. ల‌క్ మాత్రం నిఖిల్‌ను వ‌రించింది. మ‌రోవైపు ఈ వీక్ హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్న‌ట్లు పృథ్వీ, అవినాష్ పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్
బిగ్‌బాస్

బిగ్‌బాస్ ఫైన‌ల్‌లో అడుగుపె ట్ట‌నున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్‌బాస్ 8 తెలుగు మ‌రో ప‌ధ్నాలుగు రోజుల్లో ముగియ‌నుంది. ఈ లోపు హౌజ్‌లో ఎలాంటి మార్పులు జ‌రుగుతాయి...హౌజ్ నుంచి ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని అభిమానులు ఎదురుచూస్తోన్నారు.

నిఖిల్ వ‌ర్సెస్ గౌత‌మ్‌...

మ‌రోవైపు ఈ వారం నామినేష‌న్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఓటింగ్‌లో మ‌రోసారి నిఖిల్ టాప్‌లో నిలిచాడు. గ‌త కొన్నాళ్లుగా హౌజ్‌లో నిఖిల్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో గ‌ట్టెక్కుతూ వ‌స్తోన్నాడు. గౌత‌మ్ సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకున్నాడు.

ఇక ఓటింగ్‌లో న‌బీల్ మూడో స్థానానికి వ‌చ్చాడు. ప్రేర‌ణ ఫోర్త్ ప్లేస్‌లో నిల‌వ‌గా...విష్ణుప్రియ ఐదో స్థానాన్ని ద‌క్కించుకున్న‌ది.

విష్ణుప్రియ సేఫ్...

మ‌రోవైపు ఈ వీక్ డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. పృథ్వీ, అవినాష్‌, టేస్టీ తేజ డేంజ‌ర్ జోన్‌లోకి వ‌చ్చారు. ఈ ముగ్గురిలో ఇద్ద‌రు ఈ వీక్ హౌజ్ నుంచి బ‌య‌ట అడుగుపెట్ట‌బోతున్నారు. పృథ్వీ, అవినాష్ ఎలిమినేట్ అవుతార‌ని అంటున్నారు. విష్ణుప్రియ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనుకోకుండా ఓటింగ్‌లో టాప్ ఫైవ్‌లోకి దూసుకురావ‌డంతో ఆమె సేఫ్ అయిన‌ట్లు స‌మాచారం.

టాప్ ఫైవ్ వీళ్లే...

టాప్ ఫైవ్‌లో నిఖిల్‌, గౌత‌మ్ ఉండ‌టం ప‌క్కా. మిగిలిన మూడు స్థానాల కోసం గ‌ట్టి పోటీ నెల‌కొంది. న‌బీల్‌, ప్రేర‌ణ‌, విష్ణుప్రియ టాప్ ఫైవ్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

చివ‌రి కంటెండ‌ర్‌షిప్‌...

మ‌రోవైపు టికెట్ టూ ఫినాలే చివ‌రి కంటెండ‌ర్ షిప్ కోసం నిఖిల్‌, గౌత‌మ్, పృథ్వీ, ప్రేర‌ణ పోటీప‌డ్డారు. పోటాపోటీగా సాగిన గేమ్‌లో నిఖిల్ విన్న‌ర్‌గా నిలిచాడు. అత‌డికి పృథ్వీ చివ‌రి వ‌ర‌కు గ‌ట్టిపోటీ ఇచ్చాడు.

ఈ టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు నిర్వ‌హించేందుకు బిగ్‌బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్స్ పున‌ర్న‌వి భూపాలం, వితికా శేరు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ట్రూత్ అండ్ డేర్‌...

హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌తో ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడించారు పున‌ర్న‌వి, వితికా...ఈ గేమ్‌లో భాగంగా విష్ణుప్రియ అంటే ఇష్ట‌మా అని పృథ్వీని అడిగింది పున‌ర్న‌వి. ఫ్రెండ్‌గా ఇష్ట‌మంటూ పృథ్వీ స‌మాధాన‌మిచ్చాడు. హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత విష్ణుప్రియ‌తో ఇదే ఫ్రెండ్‌షిప్ కొన‌సాగిస్తావా అని అడిగిన ప్ర‌శ్న‌కు చెప్ప‌లేం అంటూ పృథ్వీ అన్నాడు. విష్ణుప్రియ మాత్రం పృథ్వీ త‌న‌కు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని స‌మాధాన‌మిచ్చింది.

న‌లుగురు కంటెస్టెంట్స్‌...

టికెట్ టు ఫినాలే కంటెండ‌ర్‌గా నిఖిల్‌, గౌత‌మ్‌ల‌ను సెలెక్ట్ చేశారు పున‌ర్న‌వి, వితికా. నిఖిల్‌, గౌత‌మ్‌ల‌ను కంటెండ‌ర్‌షిప్ కోసం మ‌రో ఇద్ద‌రి పేర్లు చెప్ప‌మ‌ని బిగ్‌బాస్ అన్నాడు. గౌత‌మ్‌..ప్రేర‌ణ పేరు చెప్ప‌గా...నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేశాడు.

పృథ్వీనే టాప్ కానీ...

ఈ న‌లుగురు కంటెస్టెంట్స్‌కు జారుతూ గెలువు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ స్లైడ్ డిస్క్ గేమ్‌లో నిఖిల్ విన్న‌ర్ అయ్యాడు. గేమ్‌లో నిఖిల్ కంటే పృథ్వీనే బాగా ఆడాడు. అత‌డి బాస్కెట్‌లోనే ఎక్కువ‌గా డిస్క్‌లు ఉన్నాయి. కానీ పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడంటూ సంచాల‌క్‌లు ప్ర‌క‌టించి అత‌డికి అన్యాయం చేశారు. నిఖిల్‌, పృథ్వీల‌కు స‌మానంగానే డిస్క్‌లు ఉన్నా కూడా...నిఖిల్‌నే విన్న‌ర్‌గా ప్ర‌క‌టించారు.

ప్రేర‌ణ హ‌ర్ట్‌...

ఆ త‌ర్వాత టాస్క్‌లో ప్రేర‌ణ‌ను బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి రేసు నుంచి త‌ప్పించారు సంచాల‌క్‌లు. వారి నిర్ణ‌యంపై ప్రేర‌ణ హ‌ర్ట్ అయ్యింది. నిఖిల్‌, పృథ్వీ, గౌత‌మ్‌ల‌కు బిగ్‌బాస్ ఐ టాస్క్ పెట్టాడు. ఇందులో నిఖిల్ విన్న‌ర్‌గా నిలిచి టికెట్ టూ ఫినాలే కంటెండ‌ర్‌షిప్ గెలుచుకున్నాడు. ఇప్ప‌టికే ఈ టికెట్ టూ ఫినాలే కంటెండ‌ర్‌ను రోహిణి, అవినాష్ సొంతం చేసుకున్నారు.

Whats_app_banner