EPFO alert : ఉద్యోగులకు త్వరలోనే గుడ్​ న్యూస్​! ఆ ఈపీఎఫ్​ లిమిట్​ ఎత్తివేత..!-govt may lift cap on epf contributions in key push for savings scheme ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Epfo Alert : ఉద్యోగులకు త్వరలోనే గుడ్​ న్యూస్​! ఆ ఈపీఎఫ్​ లిమిట్​ ఎత్తివేత..!

EPFO alert : ఉద్యోగులకు త్వరలోనే గుడ్​ న్యూస్​! ఆ ఈపీఎఫ్​ లిమిట్​ ఎత్తివేత..!

Sharath Chitturi HT Telugu
Nov 29, 2024 07:16 AM IST

EPFO alert : ఈపీఎఫ్​ఓ రూల్స్​లో భారీ సంస్కరణలకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఈపీఎఫ్​ కంట్రీబ్యూషన్​పై ఉన్న లిమిట్​ని ఎత్తివేయాలని చూస్తోందని తెలుస్తోంది.

ఉద్యోగులకు త్వరలోనే గుడ్​ న్యూస్​!
ఉద్యోగులకు త్వరలోనే గుడ్​ న్యూస్​!

ఈపీఎఫ్​లో త్వరలోనే భారీ స్థాయిలో సంస్కరణలను తీసుకొచ్చేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ఇందులో భాగంగా.. రిటైర్మెంట్​ కోసం ఉద్యోగులు కేటాయిస్తున్న నిధులపై ఇప్పటివరకు ఉన్న లిమిట్​ని ఎత్తి వేయాలని, తద్వారా అధిక డిడక్షన్స్​ చేసుకుని, పదవీ విరమణ నిధులను పెంచుకునే విధంగా కొత్త రూల్స్​ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఒక సీనియర్​ అధికారి తెలిపారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహించే కార్పస్​కి యజమాని, ఉద్యోగి.. ఇద్దరూ ఒక సదరు ఉద్యోగి మూల వేతనంలో 12% కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్లు దాదాపు 67 మిలియన్ల వేతన భారతీయులకు పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తాయి. తరచుగా కార్మిక వర్గానికి జీవితకాల పొదుపుగా ఈ కీలక కార్పస్ మారుతుంది.

ప్రావిడెంట్ ఫండ్​కి యజమాని మొత్తం కంట్రిబ్యూషన్​లో 8.33% ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్​కి, 3.67% ప్రావిడెంట్ ఫంఢ్​కి వెళ్తుంది. ఇది గరిష్టంగా రూ .15,000 వేతన పరిమితిపై చెల్లించడం జరుగుతుంది.

ఈపీఎఫ్ చట్టం ప్రకారం సెప్టెంబర్ 1, 2014 తర్వాత ఈ స్కీమ్​లో చేరే ఉద్యోగులు ఎక్కువ జీతం తీసుకుంటున్నప్పటికీ గరిష్టంగా రూ.15,000పై 8.33 శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలి.

మరో నిబంధన ప్రకారం 2014 సెప్టెంబర్ 1కి ముందు పెన్షన్ స్కీమ్​లో చేరిన ఉద్యోగులు ఆరు నెలల్లోగా అంటే 2015 ఫిబ్రవరి 28న ఈపీఎఫ్ఓలో కొత్త జాయింట్ ఆప్షన్ దాఖలు చేస్తే పెన్షన్ స్కీమ్​కి 8.33 శాతం కంట్రిబ్యూషన్ చేయొచ్చు.

ప్రస్తుతమున్న మొత్తం కంట్రిబ్యూషన్​లో ఎక్కువ నిధులను పెన్షన్ కాంపోనెంట్​లో నిక్షిప్తం చేసేలా ఈ పరిమితులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

“రిటైర్మెంట్​ సమయంలో వచ్చే లంప్​సమ్​ కాకుండా నెలవారీ పెన్షన్​ కోసం కేటయించే నిధులు పెరగాలని ఉద్యోగి భావిస్తే.. అది అతను లేదా ఆమె ఇష్టంపై ఉండాలి,” అని ఓ అధికారి వెల్లడించారు.

“ప్రస్తుతం ఉన్న రూ. 15వేల క్యాప్​ని పెంచాలి. ఈ కాలంలో రూ. 15వేలంటే నథింగ్​! ఇల చేస్త, ప్రావిడెంట్​ ఫండ్​- పెన్షన్​ స్కీమ్​కి వాటా పెరుగుతుంది,” అని సెంటర్​ ఫర్​ ఇండియన్​ ట్రేడ్​ యూనియన్స్​ జనరల్​ సెక్రటరీ టీఎన్​ కరుమలయన్​ తెలిపారు.

పెన్షన్ కాంపోనెంట్​ను ఈపీఎఫ్ఓ 1995 నవంబర్​లో ప్రవేశపెట్టింది. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు పెన్షన్ అందించే సామాజిక భద్రతా పథకం ఇది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ అధర్​ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ పొదుపు తప్పనిసరి.

మరోవైపు నవంబర్ 7 నాటికి ఈపీఎఫ్ఓ ఈ ఏడాది 4,300 మందిని నియమించుకున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 60 వేల అపాయింట్​మెంట్స్​తో పాటు మరో 5 వేల నియామకాలు జరుగుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం