Yoga for Diabetes: షుగర్‌ను కంట్రోల్ చేయగల సులువైన యోగాసనాలు ఇవి.. ప్రతీ రోజు చేయండి
Yoga Poses for Diabetes: శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్‍లో ఉండేందుకు కొన్ని యోగాసనాలు సహకరిస్తాయి. రెగ్యులర్‌గా చేస్తే డయాబెటిస్ నియంత్రణ కోసం ఇవి ఉపయోగపడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
మధుమేహం ఉన్న వారు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉంచుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైనవి తింటుండాలి. శారీరక వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. కొన్ని యోగాసనాలు ఇందుకు సహకరిస్తాయి.
కొన్ని యోగసనాల్లో అంతర్గత కండరాలను తిప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ సెన్సివిటీ మెరుగై బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయగల సులువైన యోగాసనాలు ఏవో ఇక్కడ చూడండి.
వక్రాసనం
శరీరాన్ని తిప్పే వక్రాసనం.. డయాబెటిస్ ఉన్న వారు చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఓ చోట కాళ్లు చాపి కూర్చొని.. ఆ తర్వాత ఓ కాలిని మతడపెట్టి.. వెనక్కి చూసేలా నడుమును తిప్పాలి. ఇలా రెండు వైపుగా చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేయగలదు. శరీరంలోని అవయవాలకు మసాజ్‍లా ఉంటుంది. బరువు తగ్గేందుకు కూడా ఈ వక్రాసనం సహకరిస్తుంది. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండేందుకు కీలక అంశంగా ఉంటుంది.
సుప్త మత్స్యేద్రాసనం
క్లోమ, అంతఃస్రావ వ్యవస్థల పనితీరును సుప్త మత్స్యేద్రాసనం మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వల్ల పొత్తి కడుపుపై కూడా ఒత్తిడి పడుతుంది. దీనిద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సహకరిస్తుంది. ముందుగా ఓ చోట వెల్లకిలా పడుకొని ఓ మోకాలిని మడిచి.. దాన్ని చేతిలో పట్టుకొని నడుమును ఓ వైపుకు తిప్పాలి. రెండువైపులా ఇలా చేస్తుండాలి.
కపాలభాతి ప్రాణాయామం
కపాలభాతి ఆసనం క్లోమాన్ని ప్రేరేపించి.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్త మెరుగ్గా అయ్యేలా చేయగలదు. పద్మాసనం వేసినట్టు కూర్చొని.. శ్వాసపీల్చే సమయంలో పొత్తి కడుపును లోపలికి.. శ్వాసవదిలే సమయంలో పొత్తి కడుపును సాధారణ స్థితికి తెస్తూ కపాలభాతి ప్రాణాయామం చేయాలి. ఇది పొత్తి కడుపుపై ఒత్తిడిని తెస్తుంది.
సూర్య నమస్కారాలు
సూర్య నమస్కార ఆసనాలు పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి. ప్యాంక్రియాస్‍కు రక్త ప్రసరణను ఈ ఆసనాలు మెరుగుపరుస్తాయి. దీంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పతికి ఇది మేలు చేస్తుంది. సూర్య నమస్కారాల్లో 12 రకాలు ఉంటాయి. ఇవి చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. క్రమంగా సాధన చేస్తే సూర్య నమస్కారాలు అలవాటు అవుతాయి.
పాద హస్తాసనం
ప్యాంక్రియాస్, కిడ్నీలు, కాలేయం లాంటి అవయవాలను పాద హస్తాసనం ప్రేరేపిస్తుంది. ఈ అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. నిటారుగా నిలబడి అర చేతులతో పాదాలను పట్టుకోవడమే ఈ పాద హస్తాసనం.
టాపిక్