బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గేందుకు సహకరించే 5 రకాల డ్రింక్స్
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 29, 2023
Hindustan Times Telugu
డయాబెటిస్ ఉన్న వారు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా నిత్యం జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెళ్లను పెంచే బేవరేజెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన డ్రింక్స్ మాత్రమే తాగాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు మేలు చేసే 5 రకాల డ్రింక్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
చక్కెర వేయకుండా నిమ్మరసం తాగడం చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెళ్లను ఈ జ్యూస్ పెంచదు.
Photo: Pexels
పండ్ల జ్యూస్‍ల కంటే ఇంట్లో తయారు చేసుకునే కూరగాయల జ్యూస్ తాగడం చాలా మంచిది. కూరగాయల్లో నేచురల్ షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచగదు.
Photo: Pexels
ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అందుకే రోజులో తగిన మొత్తంలో నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ బయటికి వెళ్లి.. బ్లడ్ షుగర్ లెవెళ్లు నియంత్రణలో ఉండేలా చూసుకోవచ్చు.
Photo: Pexels
గ్లిసెమిక్ ఇండెక్స్, నేచుల్ షుగర్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల కొబ్బరి నీరు తాగడం కూడా చాలా మంచిది. కొబ్బరి నీరు పోషకాలను అందించటంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు సహకరించగలదు.
Photo: Pexels
మజ్జిగ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెళ్లతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.