Loan apps : లోన్​ యాప్స్​ నుంచి డబ్బులు తీసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? ట్రాప్​లో పడకండి..-planning to borrow from loan lending app make note of 6 key points ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Loan Apps : లోన్​ యాప్స్​ నుంచి డబ్బులు తీసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? ట్రాప్​లో పడకండి..

Loan apps : లోన్​ యాప్స్​ నుంచి డబ్బులు తీసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? ట్రాప్​లో పడకండి..

Sharath Chitturi HT Telugu
Nov 29, 2024 07:20 AM IST

Personal loan apps : పర్సనల్ లోన్ విషయానికి వస్తే బ్యాంకులు, పెద్ద ఎన్​బీఎఫ్​సీలు కొంత నమ్మదగినవే అయినా, లెండింగ్ యాప్స్ మాత్రం ఇంకా జనాలను ఆకట్టుకోలేదు. ఇక్కడ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల రంగంలోకి దిగే ముందు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి.

లోన్​ యాప్స్​తో జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి..
లోన్​ యాప్స్​తో జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి..

దేశంలో ఇప్పుడు ఎన్నో పర్సనల్​ లోన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇప్పుడు మన ముందు ఉన్నదంతా.. వీటిల్లో మంచిది, మనకు తక్కువ డబ్బు ఖర్చు అయ్యే ఆప్షన్​ని ఎంచుకోవడం! కానీ చాలా మంది ఇటీవలి కాలంలో ‘లోన్​ యాప్స్​’ ట్రాప్​లో పడిపోతున్నారు. ఈజీగా డబ్బులు అకౌంట్​లో పడుతుండటంతో.. ముందు, వెనక చూసుకోకుండా సదరు యాప్స్​ నుంచి లోన్స్​ తీసుకుంటున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది! సదరు ఫిన్​టెక్​ యాప్స్​ అధిక వడ్డీలు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాయి. కాబట్టి ఇందులోకి దిగే ముందే రుణాల సమీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశీయ చెల్లింపుల విషయానికి వస్తే, మొత్తం మోసాల విలువ 2022 అక్టోబర్​లో రూ .220 కోట్లు. ఇది ఇప్పుడు 2024 అక్టోబర్ నాటికి రూ .411 కోట్లకు పెరిగింది. ఇది రెండేళ్ల క్రితం కంటే దాదాపు రెట్టింపు అని ఆర్బీఐ డేటా వెల్లడించింది.

వాల్యూమ్ పరంగా చూస్తే, ఈ గణాంకాలు అక్టోబర్ 2022- అక్టోబర్ 2024లో వరుసగా 1.79 లక్షలు, 2.35 లక్షలుగా ఉన్నాయి.

మోసపూరిత లావాదేవీలు   
అక్టోబర్​ 2022  అక్టోబర్​ 2024
వాల్యూరూ 220 కోట్లురూ 411 కోట్లు
లావాదేవీల సంఖ్య1.79 లక్షలు2.35 లక్షలు

2022 అక్టోబర్​లో 59,533 లావాదేవీల్లో ఒకటి మోసపూరితంగా మారగా, ఇప్పుడు 87,724 లావాదేవీలు ఆ విధంగా ఉంటున్నాయి!

మోసాల ఉచ్చులో పడకుండా ఉండేందుకు ఫిన్​టెక్ యాప్స్​లో ఒకదానిలో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఇక్కడ కొన్ని కీలక విషయాలను తెలుసుకోండి..

ఈ 6 కీలక అంశాలను గుర్తుపెట్టుకోండి..

1. అధిక క్రెడిట్ స్కోర్: మొదట్లో మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండి, ఆర్థిక సంస్థ నుంచి రుణం పొందడం సులభమైతే బ్యాంకును ఎంచుకోండి. మీరు బ్యాంకు నుంచి పర్సనల్​ లోన్​ పొందలేనప్పుడు ఫిన్​టెక్ యాప్ నుంచి రుణం పొందడం సాధారణంగా మంచి ఆప్షన్​ అవుతుంది.

2. బ్యాక్​గ్రౌండ్​ చెక్: మీరు డాక్యుమెంట్స్​పై సంతకం చేసే ముందు, జాగ్రత్తగా ఉండండి! మీరు డబ్బును సేకరించాలనుకునే ఫిన్​టెక్ యాప్​ల వీలైనంత విస్తృతమైన బ్యాక్​గ్రౌండ్ చెక్​ చేయండి.

3. నమ్మశక్యం కాని విధంగా డీల్స్​: కొన్నిసార్లు, ఫిన్​టెక్​ యాప్స్​ తమ వినియోగదారులను వారి ప్లాట్ఫామ్స్​లో రుణాలు తీసుకునేలా ఆకర్షించడానికి పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తాయి. తక్షణ రుణాల నుంచి తక్కువ వడ్డీ రేట్లు, నో డాక్యుమెంట్స్​ వరకు.. వారు ఏదైనా చెప్పవచ్చు! కాని ఏదైనా ఆర్థిక సంస్థ టార్గెట్​ డబ్బు సంపాదించడం అని గుర్తుంచుకోవాలి. వారి వాగ్దానాలు ఎంత వరకు రియాలిటీలో ఉన్నాయమో మీరు చెక్​ చేసుకోవాలి.

4. ఆర్బీఐ గుర్తింపు: సంబంధిత యాప్ ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన బ్యాంకేనా? లేదా ఎన్​బీఎఫ్​సీలో రిజిస్టర్ అయిందా? అని చెక్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ లేదా యాపిల్ స్టోర్స్​లో యాప్ డౌన్​లోడ్​ చేసుకున్నా ఆర్బీఐ నిబంధనలు పాటించాల్సిందే!

ఏప్రిల్ 2021 నుంచి జూలై 2022 మధ్య గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 వరకు మోసపూరిత లోన్​ యాప్స్​ని తొలగించినట్టు భారత ప్రభుత్వం 2023 డిసెంబర్​లో పార్లమెంటుకు తెలిపింది.

5. రికమెండేషన్స్​ చెక్​ చేయండి : మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి యాప్స్​పై ఆధారపడే ముందు, సిఫార్సు కోసం చూడటం చాలా ముఖ్యం. వినియోగదారులు ఈ యాప్​ను ఎన్నిసార్లు డౌన్​లోడ్ చేసుకున్నారు? ప్లేస్టోర్​లో రివ్యూలు ఎలా ఉన్నాయో? రెడ్డిట్ వంటి సోషల్ ప్లాట్​ఫామ్​లలో సదరు యాప్స్​ గురించి ఏమంటున్నారా? అని చెక్ చేసుకోవాలి.

6. చిన్నగా ప్రారంభించండి: అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, మీకు ఇంకా నమ్మకం లేకపోతే, చిన్నగా ప్రారంభించండి. అంటే రూ.5 లక్షల కోసం యాప్స్​పై ఆధారపడే బదులు, మీరు చిన్న మొత్తాన్ని లోన్​గా తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. మీ అనుభవం మంచిగా మారితే, మీరు తరువాతి దశలో లోన్​ అమౌంట్​ పెంచవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం