Personal loan interest rates : పర్సనల్ లోన్‌పై వడ్డీ రేట్లు- ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయి?
Personal loan interest rates : పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? వివిధ బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్‌పై ఉన్న వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డబ్బు అవసరం ఉండి మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! పర్సనల్ లోన్ వడ్డీ రేటు అనేది ఒక్కో బ్యాంక్‌లో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం, దేశంలోని వివిధ ముఖ్యమైన బ్యాంకులు పర్సనల్ లోన్‌పై తీసుకుంటున్న వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పర్సనల్ లోన్‌పై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
ఎస్బీఐ: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి 12.60 శాతం నుంచి 14.60 శాతం, 11.45 శాతం నుంచి 11.95 శాతం మధ్య వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: అతిపెద్ద ప్రైవేట్ రుణదాత వ్యక్తిగత రుణాలపై 10.85 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. రుణంపై ప్రాసెసింగ్ ఛార్జీలు రూ .6,500 + దానిపై జీఎస్టీ కూడా ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ ఏడాదికి 10.85 నుంచి 16.25 శాతం వరకు వసూలు చేస్తుంది.
బ్యాంక్ | వడ్డీ రేటు (%) |
ఎస్బీఐ | 12.60 to 14.60 |
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ | 10.85 to 24 |
ఐసీఐసీఐ బ్యాంక్ | 10.85 to 16.25 |
ఫెడరల్ బ్యాంక్ | 11.49 to 14.49 |
కొటక్ మహీంద్రా బ్యాంక్ | 10.99 to 16.99 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 12.5 to 14.5 |
యాక్సిస్ బ్యాంక్ | 10.49 to 22.50 |
(మూలం: సంబంధిత బ్యాంకు వెబ్సైట్లు)
ఫెడరల్ బ్యాంక్: ప్రైవేట్ రుణదాత ఫెడరల్ బ్యాంక్ తన వ్యక్తిగత రుణాలపై 11.49 నుంచి 14.49 శాతం వరకు వసూలు చేస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది వ్యక్తిగత రుణాలపై 10.99 శాతం నుంచి 16.99 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ): పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఏడాదికి 12.5 నుంచి 14.50 శాతం మధ్య ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్: ఇది సంవత్సరానికి 10.49 నుంచి 22.50 శాతం వరకు వసూలు చేస్తుంది.
పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ లోన్ తీసుకోవాలా?
మార్కెట్లో చాలా రకాల లోన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ ముఖ్యమైనవి. మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? ఏది పిక్ చేసుకుంటే మనకి లాభం చేకూరుతుంది?
వడ్డీ రేట్లు:- సాధారణంగా గోల్డ్ లోన్ని తక్కువ వడ్డీ రేటుకు (9-10 శాతం) అందిస్తారు. కానీ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11 నుంచి 18 శాతం వరకు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చయండి.
సంబంధిత కథనం