Central Bank Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ లో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాలు, దరఖాస్తులకు డిసెంబర్ 3 లాస్ట్ తేదీ
Central Bank Recruitment 2024 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank) రెగ్యులర్ ప్రాతిపదికన 253 పోస్టులను భర్తీ చేయడానికి అప్లికేషన్లు ఆహ్వానించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా, ఎంపికైన అభ్యర్థులు 2 ఏళ్ల పదవీ కాలానికి ప్రొబేషన్ ఉంటుంది. అభ్యర్థుల పనితీరును బట్టి ప్రొబేషన్ మరో ఏడాది పొడిగించవచ్చు. సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల వివరాలు
- స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు- 253
- జనరల్ -105
- ఎస్సీ- 37
- ఎస్టీ- 18
- ఓబీసీ- 68
- ఈడబ్ల్యూఎస్- 25
వయో పరిమితి, జీతం, అర్హతలు
స్కేల్-1 పోస్టులకు 23-27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. స్కేల్-II పోస్టులక 27- 33 ఏళ్లు, స్కేల్-III పోస్టులకు 30- 38 ఏళ్లు, స్కేల్-IV పోస్టులకు 34- 40 ఏళ్లు వయస్సు ఉండాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ప్రావీణ్యత ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణతతో పాటి వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. పోస్టులను బట్టి పే స్కేల్ రూ.48 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంది. ఎంపికైన వారికి హైదరాబాద్, ముంబయి, నవీ ముంబయిలలో పోస్టింగ్ ఇస్తారు.
అభ్యర్థులను ఆన్‌లైన్ ఎగ్జామ్, సినారియో బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.850 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175గా నిర్ణయించారు.
ముఖ్య తేదీలు
- దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం - నవంబర్ 18
- రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- డిసెంబర్ 03
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ- డిసెంబర్ 14
- ఇంటర్వ్యూ తేదీలు- వచ్చే ఏడాది జనవరిలో
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు విధానం
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల దరఖాస్తుకు https://ibpsonline.ibps.in/cbimoct24/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.
- న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని, అనంతరం లాగిన్ అవ్వాలి.
- దరఖాస్తులో వివరాలు సమర్పించి, రుసుము చెల్లించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
- చివరిగా వివరాలు సరిచూసుకుని “కంప్లీట్ రిజిస్ట్రేషన్” బటన్‌పై క్లిక్ చేయండి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
సంబంధిత కథనం