SBI Asha Scholarship 2024 : ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​తో లక్షల్లో ఆర్థిక సాయం- పూర్తి వివరాలు..-sbi asha scholarship 2024 for 10000 students check eligibility and other details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Asha Scholarship 2024 : ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​తో లక్షల్లో ఆర్థిక సాయం- పూర్తి వివరాలు..

SBI Asha Scholarship 2024 : ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​తో లక్షల్లో ఆర్థిక సాయం- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Sep 10, 2024 07:20 AM IST

SBI Asha Scholarship 2024 apply online : టాలెంటెడ్​ స్టూడెంట్స్​కి సువర్ణావకాశం! ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024 ఎడిషన్​ లాంచ్​ అయ్యింది. అర్హతం, డాక్యుమెంట్లు, అప్లికేషన్​ ప్రక్రియతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024 పూర్తి వివరాలు..
ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024 పూర్తి వివరాలు..

టాలెంటెడ్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్​! ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​ 3వ ఎడిషన్​ని ఎస్​బీఐ ఫౌండేషన్​ లాంచ్​ చేసింది. దేశవ్యాప్తంగా వెనకపడిన వర్గాలకు చెందిన 10వేల మంది టాలెంటెడ్​ స్టూడెంట్స్​కి సాయం చేసేందుకు రూపొందించినదే ఈ ప్రోగ్రామ్​. దీని ద్వారా విద్యార్థులకు రూ. 15వేల నుంచి రూ. 20లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. క్లాస్​ 6 నుంచి పోస్ట్​గ్రాడ్జ్యుయేషన్​ వరకు విద్యార్థులు ఈ ఆశా స్కాలర్​షిప్​కి అప్లై చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్​కి సంబంధించిన అర్హత, అప్లికేషన్​, చివరి తేదీతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024..

స్కూల్​ స్టూడెంట్స్​కి:-

అర్హత- అప్లై చేసుకునే వారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో క్లాస్​ 6 నుంచి క్లాస్​ 12 మధ్యలో ఉండాలి.

గత ఎకాడమిక్​ ఇయర్​లో కనీసం 75శాతం వచ్చి ఉండాలి.

స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3లక్షలు దాటకూడదు.

కేవలం భారతీయులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

ఇందులో 50శాతం స్లాట్​లు మహిళలకు కేటాయిస్తారు.

ఎస్​ఎస్​, ఎస్​టీ అప్లికేషన్లకు ప్రిఫరెన్స్​ ఉంటుంది.

ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 15వేల స్కాలర్​షిప్ లభిస్తుంది.

యూజీ విద్యార్థులకు:-

ఎస్​ఐఆర్​ఎఫ్​ టాప్​ 100 ర్యాంకింగ్స్​లో స్థానం పొందిన దేశంలోని కాలేజీలు, వర్సిటీల్లో చదువుకుంటున్న వారు ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​కి అర్హులు.

గత ఎకాడమిక్​ ఇయర్​లో కనీసం 75శాతం వచ్చి ఉండాలి.

స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6లక్షలు దాటకూడదు. ప్రిఫరెన్స్​ రూ. 3లక్షలు.

50శాతం స్లాట్​లు మహిళలకు కేటాయిస్తారు.

ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు ప్రిఫరెన్స్​ ఇస్తారు.

ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 50వేల స్కాలర్​షిప్ లభిస్తుంది.

పీజీ విద్యార్థులకు:-

ఎన్​ఐఆర్​ఎఫ్​ టాప్​ 100 ర్యాంకింగ్స్​లోని భారత వర్సిటీలు, కాలేజీల్లో చదువుకుంటున్న వారికి అర్హత ఉంటుంది.

గత ఎకాడమిక్​ ఇయర్​లో 75శాతం వచ్చి ఉండాలి.

స్థూల కుటుంబ ఆదాయం రూ. 6లక్షలు దాటకూడదు. ప్రిఫరెన్స్​ రూ. 3లక్షలు.

50శాతం స్లాట్​లు మహిళలకు కేటాయిస్తారు.

ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు ప్రిఫరెన్స్​ ఇస్తారు.

ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 70వేల స్కాలర్​షిప్ లభిస్తుంది.

ఐఐటీ విద్యార్థులకు:-

ఐఐటీల్లో యూజీ కోర్సు చేస్తున్న విద్యార్థులకు ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024కి అర్హత ఉంటుంది.

గత ఎకాడమిక్​ ఇయర్​లో 75శాతం వచ్చి ఉండాలి.

స్థూల కుటుంబ ఆదాయం రూ. 3లక్షలు దాటకూడదు.

50శాతం స్లాట్​లు మహిళలకు కేటాయిస్తారు.

ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు ప్రిఫరెన్స్​ ఇస్తారు.

ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 2లక్షల వరకు స్కాలర్​షిప్ లభిస్తుంది.

ఐఐఎం విద్యార్థులకు:-

ఐఐఎంలో ఎంబీఏ/ పీజీడీఎంఏ కోర్సు చేస్తున్న విద్యార్థులకు అర్హత ఉంటుంది.

గత ఎకాడమిక్​ ఇయర్​లో 75శాతం వచ్చి ఉండాలి.

స్థూల కుటుంబ ఆదాయం రూ. 6లక్షలు దాటకూడదు. ప్రిఫరెన్స్​ రూ. 3లక్షలు

50శాతం స్లాట్​లు మహిళలకు కేటాయిస్తారు.

ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు ప్రిఫరెన్స్​ ఇస్తారు.

ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.7.5లక్షల వరకు స్కాలర్​షిప్ లభిస్తుంది.

ఈ డాక్యుమెంట్లు అవసరం..

ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024 అప్లికేషన్​ కోసం..

గత ఎకాడమిక్​ ఇయర్​ మార్క్​షీట్​

ప్రభుత్వం విడుదల చేసిన ఐడీ ప్రూఫ్​ (ఆధార్​)

ప్రస్తుత విద్యా ఏడాది ఫీజ్​ రిసిప్ట్​

ప్రస్తుతం అడ్మిషన్​ ప్రూఫ్​

బ్యాంక్​ అకౌంట్​ వివరాలు

ఆదాయం ప్రూఫ్​

అప్లికెంట్​ ఫొటో

కులానికి సంబంధించిన సర్టిఫికెట్​ (వర్తిస్తే)

ఎలా అప్లై చేసుకోవాలి?

  • sbifashascholarship.org లోకి వెళ్లండి.
  • అప్లై ఆన్​లైన్​ బట్​ మీద క్లిక్​ చేయండి.
  • రిజిస్టర్డ్​ ఐడీతో Buddy4Study లో లాగిన్​ అవ్వండి.
  • రిజిస్ట్రేషన్​ జరగకపోతే మీ ఈమెయిల్​, మొబైల్​ నెంబర్​ ద్వారా రిజిస్టర్​ చేసుకోండి.
  • SBIF Asha Scholarship Program 2024 అప్లికేషన్​ ఫామ్​ని పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్​ని అప్​లోడ్​ చేయండి.
  • ప్రివ్యూ చేసి సబ్​మీట్​ చేయండి.

సెలక్షన్​ ప్రక్రియ:-

ఎకాడమిక్​ పర్ఫార్మెన్స్​, ఆర్థిక అవసరాలు, మెరిట్​ ఆధారంగా ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ 2024 సెలక్షన్​ ప్రక్రియ ఉంటుంది.

షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు టెలిఫోనిక్​ ఇంటర్వ్యూ ఉంటుంది. డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ఉంటుంది. వీటిల్లో ఎంపికైతే బ్యాంక్​ ఖాతాలోకి స్కాలర్​షిప్​ డబ్బులు పడతాయి.

ఆసక్తిగల విద్యార్థులు అక్టోబర్​ 1లోపు అప్లికేషన్​ ఫిల్​ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో మాస్టర్స్​ చదువుకోవాలని భావిస్తున్న ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు సైతం ఎస్​బీఐ ఆశా స్కాలర్​షిప్​ని ఫౌండేషన్​ ఇస్తోంది.

సంబంధిత కథనం