RRB exam dates 2024 : అలర్ట్​! ఈ ఆర్​ఆర్బీ పరీక్షల తేదీలు మళ్లీ మారాయి..-rrb exam dates 2024 revised again for rpf si je technician notice here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Exam Dates 2024 : అలర్ట్​! ఈ ఆర్​ఆర్బీ పరీక్షల తేదీలు మళ్లీ మారాయి..

RRB exam dates 2024 : అలర్ట్​! ఈ ఆర్​ఆర్బీ పరీక్షల తేదీలు మళ్లీ మారాయి..

Sharath Chitturi HT Telugu
Nov 22, 2024 08:55 AM IST

RRB exam dates 2024 : ఆర్పీఎఫ్ ఎస్ఐ, జేఈ, టెక్నీషియన్, ఇతరులకు ఆర్ఆర్బీ పరీక్ష తేదీలు మారాయి. అధికారిక నోటీసు, లేటెస్ట్​ ఎగ్జామ్​ డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అలర్ట్​! ఈ ఆర్​ఆర్బీ పరీక్షల తేదీలు మళ్లీ మారాయి..
అలర్ట్​! ఈ ఆర్​ఆర్బీ పరీక్షల తేదీలు మళ్లీ మారాయి..

వివిధ పరీక్షల తేదీలను మార్చుతూ.. సవరించిన డేట్స్​ని తాజాగా ప్రకటించింది రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు ఆర్ఆర్బీ. ఆర్పీఎఫ్ ఎస్ఐ, జేఈ, టెక్నీషియన్ తదితర పోస్టులకు పరీక్ష తేదీలు మారాయని అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్స్​లో అధికారిక ప్రకటన అందుబాటులో ఉంది.

సవరించిన తాత్కాలిక పరీక్ష షెడ్యూల్ ప్రకారం.. సీఈఎన్ ఆర్పీఎఫ్ 01/2024 ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష 2024 డిసెంబర్ 2, 3, 9, 12, 13, 2024 తేదీల్లో జరుగుతుంది. సీఈఎన్ 03/2024 జేఈ అండ్ అదర్స్ పరీక్షను 2024 డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో, సీఈఎన్ 02/2024 టెక్నీషియన్ (గ్రేడ్ 1) (గ్రేడ్ 3) పరీక్షను డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.

పరీక్ష తేదీలను సవరించడం ఇది రెండోసారి. అక్టోబర్​లో తొలిసారి పరీక్షల తేదీలను సవరించారు.

అన్ని ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లలో సంబంధిత సీఈఎన్​ల పరీక్ష తేదీకి 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ -తేదీ, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల ట్రావెల్ అథారిటీ డౌన్​లోడ్​ కోసం లింక్ లైవ్​ అవుతుంది. ఎగ్జామ్ సిటీ, డేట్ ఇన్ఫర్మేషన్ లింక్​లో పేర్కొన్న పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఈ-కాల్ లెటర్స్ డౌన్ లోడింగ్ ప్రారంభమవుతుంది.

రివైజ్​డ్​ డేట్​ నోటీస్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్ఆర్బి పరీక్ష తేదీలు 2024: నోటీసును ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి?

పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్​ని అనుసరించి నోటీసును డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

  • ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • ఆర్ఆర్బీ పరీక్ష తేదీలు 2024 లింక్​పై క్లిక్ చేయండి. సవరించిన నోటీస్​ హోమ్ పేజీలో లభిస్తుంది.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు పరీక్ష తేదీలను తనిఖీ చేయవచ్చు.
  • పేజీని డౌన్​లోడ్ చేసుకోండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీ తీసిపెట్టుకోండి.

“పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి ముందు అభ్యర్థుల ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ.. పరీక్ష కేంద్రంలో జరుగుతుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలో ప్రవేశం సజావుగా సాగేందుకు వీలుగా అభ్యర్థులు www.rrbapply.gov.in వద్ద తమ ధ్రువపత్రాలతో లాగిన్ అవ్వడం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మరోసారి తమ గుర్తింపును ధృవీకరించుకోవాలి,” అని సూచనలు వచ్చాయి.

ప్రభుత్వ రంగ సంస్థల్లో 6750 ఉద్యోగాలు..

నిరుద్యోగుల కోసం చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రైల్వేతోపాటుగా ఇతర రంగాల్లో వెకెన్సీలకు దరఖాస్తులు కోరుతున్నారు. 6750 పోస్టుల వరకు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం