Brahmamudi November 29th Episode: రాజ్ బిర్యానీ బిల్డప్పులు తుస్ - కావ్య పార్టీలో చేరిన రాహుల్ - రుద్రాణి లబోదిబో
Brahmamudi November 29th Episode: బ్రహ్మముడి నవంబర్ 29 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కావ్య క్యారేజీ తీసుకొస్తుంది. రాజ్, రుద్రాణి మాత్రం కావ్య తెచ్చిన భోజనం తినరు. కావ్య మళ్లీ తన ఇంటికి రాకుండా చేయడానికి ఆమె తెచ్చిన భోజనానికి డబ్బులు ఇవ్వబోతాడు రాజ్.
Brahmamudi November 29th Episode: దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ కోసం క్యారేజీ తీసుకొస్తుంది కావ్య. ఈ ఇంటికి ఏం సంబంధం లేదని వెళ్లిపోయావు కదా...మళ్లీ ఎందుకొచ్చావని కావ్యను నిలదీస్తాడు రాజ్. కానీ సీతారామయ్య రాజ్‌కు షాకిస్తాడు. కావ్యతో సంబంధం తెంచుకున్నది నువ్వు...మేము కాదని అంటాడు. కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలే...మాకు మనవరాలేనని అంటాడు. తాతయ్య మాటలతో రాజ్ సెలైంట్ అయిపోతాడు.
వండి వార్చే ఆడదిక్కులేదు...
భోజనం తీసుకొచ్చి మంచిపనిచేశావని కావ్యతో ఇందిరాదేవి అంటుంది. ఈ ఇంట్లో ఇంతకాలం తిని కూర్చునేవాళ్లే తప్ప వండి వార్చే ఆడదిక్కు లేదని అర్థమైందని అంటుంది.
నువ్వు...అపర్ణ లేకపోయేసరికి నేను చేతులుకాల్చుకోవాల్సివచ్చిందని ఇందిరాదేవి అంటుంది. నేను ఉన్నానుగా...మీకు ఎందుకు శ్రమ అని కావ్య అంటుంది. కావ్య ప్రేమను నాటకం అని రాజ్ అపోహపడతాడు. ఓరి దీని ఓవర్‌యాక్షన్ అని మనసులో అనుకుంటాడు.
రాజ్ బిర్యానీ పార్టీ...
అందరిని డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలుస్తాడు రాజ్. కావ్య తెచ్చిన భోజనం అక్కరలేదని, మన కోసం తాను ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ చేశానని రాజ్ అంటాడు. బిర్యానీ పేరు వినగానే రుద్రాణి, రాహుల్ ఆనందపడతారు.
ఇక నుంచి రోజు ఇలాగే బిర్యానీ తెచ్చిపెట్టమని అంటాడు రాహుల్. నువ్వు తెస్తే ఈ తల్లీకొడుకులు తిని పెడతారు అంటూ స్వప్న సెటైర్లు వేస్తుంది. అందరికి వడ్డించిన తర్వాత రాజ్‌కు ప్లేట్ కనిపించదు. నీకు ప్లేట్ తేవడం మర్చిపోయానని రాజ్‌తో రుద్రాణి అంటుంది.
అత్త బ్రెయిన్‌లా చెత్తగా...
రాజ్ బిర్యానీ కంటే కావ్య తెచ్చిన పప్పు వాసన బాగుందని ప్రకాశం, స్వప్న అంటారు. అవన్నీ పట్టించుకోకుండా తినమని రాజ్ అందరికి ఆర్డర్ వేస్తాడు. కావ్య వంటను మెచ్చుకుంటుంది ఇందిరాదేవి. నీ చేతి వంట తిని చాలా రోజులైందని అంటుంది. రాజ్ తెచ్చిన బిర్యానీ టేస్ట్ మా అత్త బ్రెయిన్‌లా చెత్తగా ఉందని స్వప్న అంటుంది. బిర్యానీలో కారం ఎక్కువగా ఉండటంతో రుద్రాణితో పాటు మిగిలినవాళ్లు కూడా తినలేకపోతారు. చివరకు రాజ్ బిర్యానీ తినలేక కావ్య పార్టీలోకి చేరిపోతారు ప్రకాశం, సుభాష్. రాహుల్ కూడా పార్టీ మార్చేస్తాడు.
రుద్రాణి బిల్డప్పులు...
బిల్డప్పులు పక్కనపెట్టి మీరు కూడా తినమని రాజ్‌తో అంటుంది కావ్య. అవసరం లేదు మేము ఇదే తింటాం రాజ్, రుద్రాణి పట్టుపడతారు. బిర్యానీ కారం ఘాటు తట్టుకోలేక కేకలు పెడతారు. షుగర్ నోట్లో వేసుకోవడానికి కిచెన్‌లోకి పరుగులు పెడతారు. షుగర్ బదులు సాల్ట్‌నునోట్లు వేసుకుంటారు. వారి కష్టాలు చూసి కావ్య నవ్వుకుంటుంది.
రాజ్ సెటైర్లు...
కావ్య కిచెన్‌ను శుభ్రపరుస్తుంటుంది. వంట మనిషిగా ఎత్తిన అవసరం చాలు...పనిమనిషిగా కూడా మారి నానమ్మ తాతయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని రాజ్ అంటాడు. డిజైన్స్ వేయకుండానే వేసినట్లు నాటకం ఆడి సీఈవో సీట్ కొట్టేసే అన్నీ తెలివితేటలు నాకు లేవని కావ్య బదులిస్తుంది. నీ ఆటలు నేను ఉండగా సాగవని రాజ్ అంటాడు. మీరు ఉండగానే నా ఆటలు నేను ఆడుతూనే ఉంటానని కావ్య బదులిస్తుంది.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని కావ్యతో అంటాడు. నేను వెళదామనిఅనుకున్నాను...మీరు చెప్పిన తర్వాత వెళ్లకూడదని అనుకుంటున్నానని కావ్య అంటుంది. మీ మూర్ఖత్వం వల్ల అమ్మమ్మ, తాతయ్య భోజనానికి ఇబ్బంది పడుతున్నారని, వాళ్లకు డిన్నర్ వండి పెట్టే వెళ్లిపోతానని అంటుంది.
మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్లతోనే మాట్లాడుకొమ్మని రాజ్‌కు పంచ్ వేస్తుంది కావ్య. అపర్ణతోపాటు నానమ్మ, తాతయ్యల అండతోనే కావ్య రెచ్చిపోతుందని, తిరుగులేని అస్త్రంతో భార్యను దెబ్బకొట్టాలని ఫిక్సవుతాడు.
వంటలు బాగున్నాయి...
అపర్ణ ఫోన్ చేయడంలో కావ్య వంటలు బాగున్నాయని, చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నామని అంటుంది ఇందిరాదేవి. కావ్య కాపురం గురించి పట్టించుకోకుండా తృప్తిగా తింటూ హాయిగా ఉండండి...అవతలి వాళ్లు ఏమైపోయినా మీకు పర్వాలేదా అని ఇందిరాదేవిపై అపర్ణ కోప్పడుతుంది. కావ్యపై జాలి లేదా, ఆమె కాపురం గురించి పట్టించుకోరా అంటూ దులిపేస్తుంది.
రాజ్ మూర్ఖత్వం...
కావ్య కాబట్టే తన కాపురం అస్తవ్యస్తమైనా...కట్టుకున్నోడికి దూరంగా ఉన్నా...నా గురించి...మీ క్షేమం గురించి ఆలోచించి భోజనం తీసుకొచ్చిందని ఇందిరాదేవితో అంటుంది. కావ్య కాపురం సరిదిద్దేందుకు మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఇందిరాదేవి సమాధానమిస్తుంది. ఎంత చెప్పినా...ఏం చేసినా రాజ్ మూర్ఖత్వంలో ఏ మార్పు రావడం లేదని బదులిస్తుంది. కావ్యకు డిన్నర్ కోసం వంటల లిస్ట్ చెప్పాలని అపర్ణ మాట్లాడుతుండగానే ఇందిరాదేవి ఫోన్ కట్ చేస్తుంది. అసలు తప్పు మీది కాదు...కావ్యదేనని అపర్ణ కోపంతో రగిలిపోతుంది.
ఫుల్ మీల్స్‌కు డబ్బులు...
డిన్నర్ రెడీ చేసి కావ్య ఇంటికి బయలుదేరబోతుంది. తాతయ్య, అమ్మమ్మలకు అన్ని జాగ్రత్తలు చెబుతుంది. కావ్య వెళ్లబోతుండగా రాజ్ ఆమెను అడ్డుకుంటాడు. ఆగమని ఆర్డర్ వేస్తాడు. డ్రాప్ చేయడానికి కావ్యను ఆగమన్నావా అని స్వప్న అంటుంది. అంతలేదని రాజ్ ఆంటాడు.
జేబులో నుంచి డబ్బులు తీస్తాడు. మీరు తెచ్చిన ఫుల్ మీల్స్‌కు నేను ఇస్తున్న బిల్...టిప్పుతో సహా అంటూ డబ్బులు ఇవ్వబోతాడు. అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకవుతారు.
డబ్బు ఉందనే అహంకారం...
డబ్బు ఉందనే పొగరుతో నిలువెళ్ల అహంకారం నిండిపోయిందని మీకు తెలియడం లేదా అని రాజ్‌కు ధీటుగా బదులిస్తుంది కావ్య. ఇంతకుముందు కూడా ఇలాగే డబ్బు ఆశ చూపించి...మా ఇంటికి రా అన్నారు..ఎలా కనిపిస్తున్నాను మీకు..మీ తలతిక్క నిర్ణయాల వల్ల కన్నతల్లే మిమ్మల్ని అసహ్యించుకొని మా ఇంటికి వచ్చి ఉంటుంది రాజ్‌కు క్లాస్ ఇస్తుంది కావ్య.
రాజ్ ఆకలి కష్టాలు..
రాజ్ ఆకలికి తట్టుకోలేకపోతాడు. అందరూ నిద్రపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. కావ్య తెచ్చిన భోజనాన్ని ఎవరూ చూడకుండా గబగబా తినడం మొదలుపెడతాడు. ఇందిరాదేవి అతడిని చూస్తుంది. నీకు ఎందుకు ఈ ఖర్మ..కావ్య నీ కోసమే వంట చేసి తీసుకొచ్చిందని, కానీ మా కోసమే తెచ్చామని అబద్ధం ఆడిందని అంటుంది. ఒక్కసారి కావ్యను భార్యగా ఒప్పుకొని చూడమని సలహా ఇస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.