OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర.. ఆ రెండు బ్లాక్‌బస్టర్స్‌తోపాటు మరెన్నో.. ఫుల్ టైంపాస్-ott weekend movies web series to watch on netflix prime video hotstar aha video etv win zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర.. ఆ రెండు బ్లాక్‌బస్టర్స్‌తోపాటు మరెన్నో.. ఫుల్ టైంపాస్

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర.. ఆ రెండు బ్లాక్‌బస్టర్స్‌తోపాటు మరెన్నో.. ఫుల్ టైంపాస్

Hari Prasad S HT Telugu
Nov 29, 2024 11:19 AM IST

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర ఉండనుంది. అందులో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు మరెన్నో ఇతర భాషల మూవీస్, వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర.. ఆ రెండు బ్లాక్‌బస్టర్స్‌తోపాటు మరెన్నో.. ఫుల్ టైంపాస్
ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర.. ఆ రెండు బ్లాక్‌బస్టర్స్‌తోపాటు మరెన్నో.. ఫుల్ టైంపాస్

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ ఏం చూడాలా అని పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి వారం కంటే ఈసారి కాస్త ఎక్కువగానే తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేశాయి. ఇంకా వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ మూవీస్, వెబ్ సిరీస్ చూడొచ్చు.

ఓటీటీ వీకెండ్ వాచ్

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రతి వారం సరికొత్త మూవీస్, వెబ్ సిరీస్ తో అలరిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి తెలుగు సినిమా లవర్స్ కు మాత్రం కాస్త ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఏ ఓటీటీలో ఏం ఉన్నాయో ఒకసారి చూద్దాం.

వికటకవి వెబ్ సిరీస్ - జీ5

జీ5 ఓటీటీలోకి కొత్తగా వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ వికటకవి. నరేష్ అగస్త్య ఓ డిటెక్టివ్ పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఆకట్టుకుంటోంది. మంచి తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్‌ను చూడాలనుకునేవారికి వికటకవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

లక్కీ భాస్కర్ - నెట్‌ఫ్లిక్స్

దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా గురువారం (నవంబర్ 28) నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. కోట్లకు పడగలెత్తిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథే ఈ లక్కీ భాస్కర్.

సికందర్ కా ముకద్దర్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన మరో ఒరిజినల్ మూవీ సికందర్ కా ముకద్దర్. తమన్నాతోపాటు జిమ్మి షెర్గిల్ లాంటి వాళ్లు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. శుక్రవారం (నవంబర్ 29) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతోంది.

క - ఈటీవీ విన్

దీపావళి రోజే రిలీజై బ్లాక్ బస్టర్ అయిన మరో మూవీ క(KA). కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా కూడా గురువారం (నవంబర్ 28) నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి హిట్ కొట్టకపోతే సినిమాలే వదిలేస్తానని ఛాలెంజ్ చేసి మరీ వచ్చిన కిరణ్ అబ్బవరం చెప్పినట్లే సక్సెస్ సాధించాడు.

సందేహం - ఈటీవీ విన్

హెబ్బా పటేల్ నటించిన థ్రిల్లర్ మూవీ సందేహం. థియేటర్లలో రిలీజైన ఐదు నెలలకు ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ వీకెండ్ థ్రిల్ కావాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు.

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి - ఆహా వీడియో

ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ప్రియదర్శి నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన 9 నెలలకు ఓటీటీలోకి వచ్చింది. ఓ దోపిడీ, నలుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది.

నారదన్ - ఆహా వీడియో

రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి వచ్చిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్. టొవినో థామస్ నటించిన ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 29) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. టీఆర్పీల కోసం పాకులాడే జర్నలిస్టు పాత్రలో టొవినో నటించాడు.

బ్లడీ బెగ్గర్ - ప్రైమ్ వీడియో

బ్లడీ బెగ్గర్ ఓ డార్క్ కామెడీ తమిళ మూవీ. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓ బెగ్గర్ ధనవంతుడిగా ఎలా మారాడన్న స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీలోనూ ఈ మూవీ ఆసక్తి రేపుతోంది.

డైవోర్స్ కే లియే కుచ్ భీ కరేగా - జీ5 ఓటీటీ

జీ5 ఓటీటీలోకి వచ్చిన మరో కామెడీ వెబ్ సిరీస్ డైవోర్స్ కే లియే కుచ్ భీ కరేగా. అనుకుకోకుండా జరిగిన పెళ్లి, కొంచెం రొమాన్స్ తో సాగే ఈ విడాకుల స్టోరీ ప్రేక్షకులను అలరించడానికి శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది.

Whats_app_banner