Karthika Deeapam Today November 29: నిజం చెప్పేసిన అనసూయ.. దీపే వారసురాలని దాసుకు క్లారిటీ.. జ్యోత్స్నకు కార్తీక్ షాక్
Karthika Deeapam 2 November 29 Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వారసురాలి గురించి తెలుసుకునేందుకు అనసూయ దగ్గరికి దాసు వెళతాడు. దీప గురించి అనసూయ నిజం చెప్పేస్తుంది. దీపతో పెళ్లి గురించి జ్యోత్స్నకు దిమ్మతిరిగే విషయం చెబుతాడు కార్తీక్. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 29) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్ చొక్కాకు గుండీ నువ్వే కుట్టాలని దీపతో చెప్పేస్తారు కాంచన, అనసూయ, శౌర్య. దీంతో గుండీ కుట్టేందుకు దీప వెళుతుంది. తమ ప్లాన్ వర్కౌట్ అయిందని ముగ్గురూ సంబపడతారు. ఇక మీదట కూడా ఇలాగే ఐకమత్యంతో ఉండాలని కాంచన అంటుంది. మీకేం పర్వాలేదు, ఆ తర్వాత అమ్మ చేతుల్లో నాకు దెబ్బలు పడతాయని శౌర్య చెప్పింది. అమ్మ బటన్ కుడుతుందా.. చుద్దామా అని అంటుంది. వారికి స్పేస్ ఇవ్వాలని కాంచన చెబుతుంది.
కలిసిన చూపులు
బటన్ కుట్టడానికి నన్ను పిలవొచ్చు కదా, కుట్టడానికి రాననుకున్నారా అని కార్తీక్‍తో దీప అంటుంది. రావనుకున్నానని దీప కార్తీక్ చెబుతాడు. ఈసారి పిలుస్తాలే అని కార్తీక్ అంటే.. ఈసారి ఊడదులే అని దీప చెబుతుంది. “అలా అని షర్ట్ చెప్పిందా. నీ మాటలు మనుషులే కాదు. షర్టులు కూడా వింటాాయన్న మాట” అని కార్తీక్ చెబుతాడు. ఆ తర్వాత కార్తీక్ చొక్కాకు గుండీ కుడుతుంది దీప. ఆ సమయంలో దీప వైపు ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతాడు కార్తీక్. ఆ తర్వాత దీప, కార్తీక్ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు.
థ్యాంక్స్ అని కార్తీక్ చెబితే.. బటన్ కుట్టినందుకు ఇలా చెబితే మీరు చేసిన దానికి రోజులో సగం థ్యాంక్స్ చెప్పేందుకే సరిపోతుందని దీప అంటుంది. ఇద్దరు బాధ్యత గల మనుషుల మధ్య ఏర్పడిన బంధం ఇది అని దీప చెబుతుంది. విలువ కట్టలేనంత విలువైన స్నేహం మనది అని అంటుంది. దీన్ని పది కాలాల పాటు నిందపడకుండా కాపాడుకుంటే జన్మసార్థకమైనట్టే అని చెబుతుంది. తమ బంధం పవిత్రంగా పది కాలాల పాటు నిలిచే ఉంటుందని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
దీపతో మాట్లాడిన దాసు
అనసూయతో మాట్లాడి.. దీపే వారసురాలు అయి ఉంటుందా అని తెలుసుకునేందుకు కార్తీక్ ఇంటికి వెళతాడు దాసు. కుబేర్ ఫొటోకు టేప్ వేసే పని పెట్టుకుంటుంది అనసూయ. ఇంతలోనే డోర్ బెల్ మోగగా.. ఎవరచ్చారో చూడాలని దీపకు చెబుతుంది. దీంతో దాసు కనపడగానే.. లోపలికి రండి బాబాయ్ అని దీప పిలుస్తుంది. దీపే వారసురాలా అని మనసులో అనుకుంటాడు దాసు. కాంచనను పిలుస్తానని దీప అంటే.. “నా కూతురు లాంటి దానివి. పైగా ఈ ఇంటి కోడలివి. నీ కోసం రాకూడదా” అని దాసు అంటాడు. ఎందుకు రాకూడదని దీప అంటుంది.
కావాలనే బ్యాగ్ మరిచిన దాసు
దీపను దాసు ప్రశంసిస్తాడు. తండ్రి పేరు అడుగుతాడు. కుబేరుడు.. అందరూ కుబేర్ అని పిలుస్తారని దీప చెబుతుంది. ఆ తర్వాత అనసూయ చేతుల్లో ఉన్న కుబేర్ ఫొటోను దాసు చూస్తాడు. “జ్యోత్స్న చెప్పింది కరెక్ట్.. దీప తండ్రి కుబేర్. కానీ మా అన్నయ్య కూతురు దీపనో కాదో తెలుసుకోవాలని కదా" అని అనుకుంటాడు. తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని దీపను దాసు అడుగుతాడు. లేరని దీప చెబుతుంది. దీపే వారసురాలని అనుకొని.. అయితే, కుబేర్‌కు కూతురు కూడా ఉండొచ్చు కదా అని డౌట్ పడతాడు. ఈ విషయాన్ని అనసూయను అడగాలని అనుకుంటాడు. అయితే, అనసూయతో మాట్లాడడం కుదరదు. దీంతో హడావుడిగా కావాలనే ఇంట్లో బ్యాగ్ వదిలేసి వెళతాడు.
దీపే ఆ పాప.. నిజం చెప్పిన అనసూయ
దాసు బ్యాగ్‍ను దీప చూస్తుంది. తాను బయటికి వెళ్లి ఇస్తానంటుంది. అయితే, తానే వెళతానని అనసూయ అంటుంది. అనసూయ రావడం చూసి తన ప్లాన్ ఫలించిందని దాసు అనుకుంటాడు. దాసును పిలిచి బ్యాగ్ ఇస్తుంటే అది కింద పడి.. దాంట్లో ఉన్న కుబేర్ డ్రాయింగ్ బయిటికి వస్తుంది. దీన్ని చూసి ఇది మా తమ్ముడి బొమ్మలా ఉందే అని అనసూయ అంటుంది. “ఇది మా తమ్ముడి బొమ్మే అని సంతోషిస్తుంది. ఇది మీ దగ్గర ఉందేంటి.. మా తమ్ముడు కుబేర్ మీకు తెలుసా” అని దాసును అనసూయ ప్రశ్నిస్తుంది. తెలుసునని దాసు అంటే.. ముందే చెప్పొచ్చు కదా అని అనసూయ అడుగుతుంది. ఎందుకు చెప్పలేదని అనసూయ ప్రశ్నిస్తే.. చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని, నేను నోరు విప్పడం మంచిది కాదని దాసు అంటాడు. చాలా అంటే ఏంటని అనసూయ అడుగుతుంది.
“కొన్నేళ్ల క్రితం ఓ బస్టాండ్‍లో కుబేర్‌కు ఓ పాప దొరికింది” అని దాసు చెబుతాడు. దీంతో అనసూయ షాక్ అవుతుంది. దీపను కుబేర్ పెంచిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఆ పాప అని దాసు ఏదో అనబోతుంటే.. “ఆ పాప దీప అని మీకు తెలుసా” అని అనసూయ అంటుంది. ఏంటమ్మా మళ్లీ అన్నావ్ అని దాసు అంటే.. “ఆ బస్టాండ్‍లో దొరికిన పాప దీప అని మీకు తెలుసా” అని మళ్లీ అంటుంది అనసూయ
వారసురాలు దొరికేసింది
వారసురాలు దొరికేసిందని మనసులో అనుకుంటాడు దాసు. “అమ్మా.. వారసురాలిని పట్టుకున్నా. దశరథ్, సుమిత్రల కూతురు దొరికేసింది” అని అనుకుంటాడు. దీపే వారసురాలనే క్లారిటీ తెచ్చుకుంటాడు. బస్టాండ్‍లో దొరికిన పాపే దీప అని మీకు తెలుసా అని మళ్లీ అనసూయ ప్రశ్నిస్తుంది. దీంతో తెలియదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావని దాసు అంటాడు. దీంతో అనసూయ కంగారు పడుతుంది.
అటుగా కారులో వెళుతున్న జ్యోత్స్న.. కుబేర్, అనసూయ మాట్లాడుకోవడం చూస్తుంది. డ్రాయింగ్ పట్టుకొని అనసూయ దగ్గరికి దాసు ఎందుకొచ్చాడని అనుమానిస్తుంది జ్యోత్స్న. దీప తనకు దొరికిందని ఎవరికీ చెప్పొద్దని కుబేర్ తీసుకున్న ఒట్టును జ్ఞాపకం చేసుకుంటుంది అనసూయ.
దీపకు చెప్పొద్దు
తాను చెప్పిన విషయాన్ని దీపకు చెప్పవద్దని దాసును అనసూయ అడుగుతుంది. దీపకు నిజం తెలియదని, కుబేర్ కూతురుననే అనుకుంటోందని చెబుతుంది. ఇప్పుడు కాదని తెలిస్తే తట్టుకోలేదని అంటుంది. తాను తొందరలో నోరు జారనని అంటుంది. నిజాలు బయటపడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆపలేమని దాసు అంటాడు.
నిజం దాచిన దాసు
దీప అసలైన అమ్మానాన్న ఎవరో ఎవరికీ తెలియదు కదా బాబు అని అనసూయ అంటే.. తనకు తెలుసు అని దాసు అంటాడు. ఎవరికీ అంటే.. ఆ దేవుడికి అంటూ ట్విస్ట్ ఇస్తాడు దాసు. అందరికీ న్యాయం చేస్తాడని అంటాడు. దీప అసలైన అమ్మానాన్న ఎవరో కుబేర్‌కు కూడా తెలిసి ఉండదని, ఇన్నేళ్ల తర్వాత ఎలా కనుగొంటావని అనసూయ ప్రశ్నిస్తుంది. దీప తల్లిదండ్రులు దశరథ్, సుమిత్ర అనే నిజాన్ని దాసు దాచేస్తాడు. తాను ఎలాగైనా కనుక్కుంటానని అనసూయతో అబద్ధం చెబుతాడు. దాసుకు, కుబేర్‌కు ఏదో సంబంధం ఉందని, అదేదో కనిపెట్టాలని కారులో వెళ్లిపోతుంది జ్యోత్స్న. దాసు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తొందరలో నోరు జారనని, తమ్ముడికి ఇచ్చిన మాట తప్పి తప్పు చేశానని అనసూయ బాధపడుతుంది.
దీపకు విడాకులిస్తావా.. జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్
చొక్కాకు దీప కుట్టిన గుండీని పట్టుకొని కారు డ్రైవ్ చేస్తూ మురిసిపోతుంటాడు కార్తీక్. తనపై ఉన్న ప్రేమను భయం ఆపేస్తుందని, ఆ భయాన్ని దాటి నువ్వు ముందుకు అడుగేశావంటే మన అందమైన ప్రయాణాన్ని ఎవరు అడ్డుకోలేరని కార్తీక్ అనుకుంటుంటాడు. అప్పుడే కార్తీక్ కారుకు.. తన కారును అడ్డుగా పెడుతుంది జ్యోత్స్న. దీంతో కోపం కారు దిగి ఒరేయ్ అని అరుస్తాడు కార్తీక్. ఆ తర్వాత జ్యోత్స్నను చూస్తాడు.
బ్రేక్ వేయడం ఆలస్యమై ఉంటే ఏం జరిగి ఉండేదో తెలుసా అని జ్యోత్స్నపై కార్తీక్ సీరియస్ అవుతాడు. యాక్సిడెంట్ అంటే సరదాగా ఉన్నట్టుందని అంటాడు. “సరదా కాదు బావ. అలవాటు. నువ్వు, నీ సతీమణి దీప కలిసి నా జీవితం అనే కారును ఎన్నోసార్లు యాక్సిడెంట్ చేశారు” అని జ్యోత్స్న అంటుంది. చాలాచార్లు ఏడ్చానని, అందుకే అలవాటు పడ్డానని అంటుంది.
అలవాటు పడు ఇలా.. కారుకు అడ్డం పకడు అని కార్తీక్ అంటాడు. తన దారికే అందరూ అడ్డం పడుతున్నారని జ్యోత్స్న అంటుంది. ఇదేంటని కార్తీక్ ప్రశ్నిస్తే.. ఇది వెంటపడడం అంటుంది. నువ్వంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ అని చెబుతుంది. తనకు పెళ్లయిందని కార్తీక్ అంటే. నాకు కాలేదని జ్యోత్స్న అంటుంది. అయితే మీ తాతయ్యను పెళ్లి చేయాలని అడుగు కార్తీక్ అంటే.. “ఏ.. నువ్వు దీపకు విడాకులు ఇస్తావా” అని జ్యోత్స్న చెబుతుంది. దీంతో జ్యోత్స్న అంటూ అరిచి ఫైర్ అవుతాడు కార్తీక్.
దీపంటే ఇష్టంతోనే పెళ్లి.. జ్యోత్స్నకు షాక్
“ఎందుకు బావా కోపం.. దీపకు విడాకులు కొత్త కాదు. నాకు ఇలా ఛీ అనిపించుకోవడం కొత్త కాదు. ఛీ అనిపించున్నా ఎందుకు వెంటపడుతున్నానంటే అది ప్రేమ” అని జ్యోత్స్న అంటుంది. పెళ్లయిన మగాడి వెంట పడడం ప్రేమ కాదని కార్తీక్ వారిస్తాడు.
మొగుడి వెనుక పెళ్లాం పడడం ప్రేమ కదా అని జ్యోత్స్న అంటుంది. తాను తాళి కట్టింది దీపకు, నీకు కాదని అని కార్తీక్ కోపంగా చెబుతాడు. ఆ తాళి తన మెడలో పడాలంటే ఏం చేయాలో చెప్పాలని అడుగుతుంది జ్యోత్స్న. నాకు నువ్వు కావాలని అంటుంది. అదెలో చెప్పాలో అర్థం కాకే ఇలా వెంట పడుతున్నానని అంటుంది. “కూతురి కోసం తల్లి మెడలో మూడు ముళ్లు వేసినంత మాత్రాన అది పెళ్లి అనుకోవడం నీ అమాయకత్వం బావ” అని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న షాకయ్యే విషయాన్ని కార్తీక్ చెబుతాడు. “హలో మిస్ హైదరాబాద్. గాల్లో మేడలు కట్టడం మానేసి, ప్రస్తుతంలోకి వస్తే నీకో నిజం చెబుతాను. శౌర్య కోసం తన మెడలో తాళి కట్టానని దీపతో చెప్పాను. కానీ అది నిజం కాదు. దీప అంటే ఇష్టం ఉంది కాబట్టే మెడలో తాళి కట్టాను. ఇది నీకు చెబుతున్నా” అని కార్తీక్ అంటాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీంతో.. కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ ముగిసింది.