Karthika Deepam November 21st Episode: నువ్వే సమస్య అంటూ దీపపై కార్తీక్ అసంతృప్తి.. జ్యోత్స్నకు శివన్నారాయణ వార్నింగ్-karthika deepam serial today november 21st episode karthik hides truth from deepa shivanarayana warning to jyotshna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 21st Episode: నువ్వే సమస్య అంటూ దీపపై కార్తీక్ అసంతృప్తి.. జ్యోత్స్నకు శివన్నారాయణ వార్నింగ్

Karthika Deepam November 21st Episode: నువ్వే సమస్య అంటూ దీపపై కార్తీక్ అసంతృప్తి.. జ్యోత్స్నకు శివన్నారాయణ వార్నింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 21, 2024 07:58 AM IST

Karthika Deepam 2 Today November 21st Episode: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య గురించి దీపకు కార్తీక్ నిజం చెప్పకుండా దాచేస్తాడు. కార్తీక్ పుట్టిన రోజుకు వెళ్లాలని జ్యోత్స్న ప్రయతిస్తుంది. ఈ విషయం శివన్నారాయణకు తెలియడంతో ఆగ్రహిస్తాడు. ఏం జరిగిందంటే..

Karthika Deepam November 21st Episode: నువ్వే సమస్య అంటూ దీపపై కార్తీక్ అసంతృప్తి.. జ్యోత్స్నకు శివన్నారాయణ వార్నింగ్
Karthika Deepam November 21st Episode: నువ్వే సమస్య అంటూ దీపపై కార్తీక్ అసంతృప్తి.. జ్యోత్స్నకు శివన్నారాయణ వార్నింగ్

కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కూతురు శౌర్యకు ఏ ఆరోగ్య సమస్య ఉందో తనకు నిజం చెప్పాలని తనపై ఒట్టు వేయించుకుంటుంది దీప. భయపడింది అంటూ కార్తీక్ సర్దిచెప్పినా దీప నమ్మదు. నరసింహ రాలేడని చెప్పినా శౌర్యకు భయం పోలేదని కార్తీక్ అంటాడు. ఏదో దాస్తున్నారని దీప అంటుంది. “శౌర్యకు ఏ సమస్య లేదని నాపై ఒట్టేసి నిజం చెప్పండి” అని కార్తీక్‍తో ఒట్టే వేయించుకుంటుంది దీప. అయినా డాక్టర్ చెప్పిన విషయాన్ని దీపకు చెప్పకుండా దాచేస్తాడు కార్తీక్.

నువ్వే సమస్య అంటూ అసంతృప్తి

శౌర్యకు సమస్య ఉందని దీపతో కార్తీక్ అంటాడు. దీంతో దీప కంగారు పడుతుంది. అయితే, వైద్యుడు చెప్పిన విషయం కాకుండా శౌర్యకు దీపనే సమస్య అని అంటాడు. “సమస్య ఉంది దీప. ఆ సమస్య ఏంటో కాదు నువ్వే. నీకు ముందే చెప్పా. ఎవరి గురించి ఆలోచించొద్దు. మన కూతురి గురించి ఆలోచించు అని. నేను చెప్పేది నువ్వు విన్నావా. దాని సంతోషం గురించి పట్టించుకున్నావా” అని దీపతో కార్తీక్ చెప్పాడు. తాను ఏం చేసినా శౌర్య గురించే అని దీప చెబుతుంది. తనకు అలా అనిపించడం లేదని, శౌర్యకు ట్యాబ్లెట్లు, సిరప్ ఇవ్వడం లేదని దీపపై కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మందులు మానేసిన విషయం తనకు చెప్పాల్సిందని అంటాడు. శౌర్య గురించే తాను బతుకుతున్నానని దీప అంటుంది. మరోసారి ఈ తప్పు చేయవద్దని, మన కూతురికి ఏమీ కాదని కార్తీక్ ధైర్యం చెబుతాడు. కార్తీక్ మాట నమ్ముతానని మనసులో దీప అనుకుంటుంది.

కార్తీక్ పుట్టిన రోజు.. అందుకే ఆ పేరు పెట్టా

శౌర్య పరిస్థితిపై అనసూయ కూడా దిగాలుగా ఉంటుంది. దీప వద్ద నిజం దాచి కార్తీక్ నలిగిపోతున్నాడని కాంచనతో అనసూయ అంటుంది. శౌర్య అంటే దీపకు ప్రాణం కంటే ఎక్కువని, నిజం తెలిస్తే దీప తమకు దక్కదని అంటుంది. శౌర్యను జాగ్రత్తగా చూసుకుందామని, అయితే కార్తీక్, దీపను ముందుగా మనం కలపాలని కాంచన చెబుతుంది. పేరుకే వాళ్లిద్దరూ భార్యభర్తలని, కానీ అలా ఉండడం లేదని అంటుంది. ఏం చేయాలో చెప్పాలని అనసూయ అడుగుతుంది.

రేపు కార్తీక పౌర్ణమి అని, తాను అమ్మగా పుట్టిన రోజు అని అనసూయతో కాంచన చెబుతుంది. తన కొడుకు కార్తీక్ పుట్టిన రోజు అని అంటుంది. కార్తీక పౌర్ణమి రోజు పుట్టినందుకు కొడుకుకు కార్తీక్ అని పేరు పెట్టానని కాంచన చెబుతుంది. కానీ కార్తీక్‍కు పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదని, అందుకే వేడుక వద్దని అంటుంది.

కార్తీక్ పుట్టిన రోజు గురించి కాంచన, అనసూయ మాట్లాడుకున్నది వింటుంది దీప. పాలు తెచ్చిన దీప ఈ విషయం విని ఉంటుందా అని అనసూయ అంటే వినే ఉంటుందని కాంచన అంటుంది. మొగుడి పుట్టిన రోజంటే దీపకు కూడా ఆనందమే కదా అని సంతోషిస్తుంది.

పుట్టిన రోజుకు వెళ్లానని జ్యోత్స్న ప్లాన్

బావ కార్తీక్ వద్దకు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతానని తన గ్రానీతో అంటుంది జ్యోత్స్న. ఇప్పటికే మీ తాత చాలా కోపంగా ఉన్నాడని, కార్తీక్‍కు దూరంగా ఉండాలని మీ అమ్మ చెప్పిందని జ్యోత్స్నతో ఆమె చెబుతుంది. తెలిస్తే మీ తాత ఊరుకోడని హెచ్చరిస్తుంది. తన బర్త్ డేకు వెళ్లకుండా తాను ఎలా ఉంటానని జ్యోత్స్న అంటుంది. పారిజాతంను అడగాలని జ్యోత్స్నకు గ్రానీ సలహా ఇస్తుంది. అయితే, గొడవను పెద్దది చేయొద్దని హెచ్చరిస్తుంది.

కార్తీక్ పుట్టిన రోజుకు వెళ్లి విషెస్ చెప్పి, కేక్ కట్ చేయిద్దామని తల్లి సుమిత్రిని జ్యోత్స్న అడుగుతుంది. తాను పెళ్లి గురించి మాట్లాడనని అంటుంది. బావ పుట్టిన రోజుకు మరదలిగా వెళ్లే హక్కులేదా అని అడుగుతుంది. ఎక్కడికీ వెళ్లేది లేదని జ్యోత్స్నపై దశరథ్ కోప్పడతాడు. వాళ్లని వద్దనుకున్నామని చెబుతాడు. ఆ ఇంటికి వెళ్లేందుకు ఏ బంధాలు మిగిలాయని హెచ్చరించాడు. బావ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా కుదర్లేదని, అతడు లండన్ నుంచి తిరిగి వచ్చాక వచ్చిన పుట్టిన రోజు ఇదేనని జ్యోత్స్న చెబుతుంది. ఇప్పుడు విష్ చేయకపోతే సంవత్సరం వరకు ఈ అవకాశం రాదని, దశరథ్‍ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, వెళ్లేందుకు వీల్లేదంటూ జ్యోత్స్నకు తేల్చిచెప్పేస్తాడు. బంధం తెగిపోయిందని, కార్తీక్‍ను మరిచిపోవాలని అంటాడు. దీంతో “అది ఎప్పటికీ జరగదు డాడీ” అని జ్యోత్స్న చెబుతుంది. సుమిత్రి కూడా జ్యోత్స్నకు సపోర్ట్ చేయగా.. దశరథ్ మరింత ఆగ్రహిస్తాడు.

కార్తీక్‍కు సర్‌ప్రైజ్.. ఇద్దరి చేతులు పలిపిన శౌర్య

కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా రూమ్ డేకరేట్ చేసిన సర్‌ప్రైజ్ చేస్తుంది దీప. శౌర్య, కాంచన ముందుగా కార్తీక్‍కు హ్యాపీ బర్త్ డే చెబుతారు. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ కౌగిలించుకుంటుందని శౌర్య. ఇవన్నీ అమ్మ చేసిందని శౌర్య చెబుతుంది. విషెస్ చెప్పాలని శౌర్య అంటే.. ఆ తర్వాత కార్తీక్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది దీప. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలని కార్తీక్. దీప చేతులు కలుపుతుందని శౌర్య. “పుట్టిన రోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు” అంటూ మరోసారి చెబుతుంది దీప. నాన్న పుట్టిన రోజున సెలెబ్రేట్ చేయాలని శౌర్య అంటే.. దేవాలయానికి వెళ్లి పూజలు చేద్దామని, దీపాలు వదులుదామని కాంచన అంటుంది. దీంతో భలేభలే అంటూ శౌర్య కూడా సంతోషపడుతుంది.

“అమ్మ నీ కోసం చాలా స్పెషల్స్ చేసింది నాన్న” అని కార్తీక్‍కు చెబుతుంది చిన్నారి శౌర్య. కొందరు ప్రేమను బయటికి చెప్పరని, ఇలా చూపిస్తారని కార్తీక్‍తో చెప్పి సంతోషిస్తుంది కాంచన. బెలూన్స్, డెకరేషన్ అమ్మే చేసిందని, విషెస్ చెప్పాలని కూడా చెప్పిందని శౌర్య చెబుతుంది. ఇదంతా అమ్మకు నీపై ఉన్న ఇష్టమని శౌర్య అంటుంది. అయితే ఇది ఇష్టం కాదని, అభిమానం అంటూ మనసులో అనుకుంటాడు కార్తీక్. ఎవరూ అందుకోలేనంత అభిమానాన్ని తనపై దీప పెంచుకుందని తనతో తాను చెప్పుకుంటాడు.

శివన్నారాయణ గట్టి వార్నింగ్

బావకు విషెస్ చెప్పేందుకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నానని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. మహా అయితే నాలుగు తిట్లు తిడతాడని, కార్తీక్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాలని పారిజాతం చెబుతుంది. ఇది విన్న శివన్నారాయణ తీవ్రంగా ఆగ్రహిస్తాడు. పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు.

“ఇందుకే కదా నిన్ను నా మనవరాలికి దూరంగా ఉండమనేది. ఎవడా కార్తీక్” అంటూ శివన్నారాయణ ఫైర్ అవుతాడు. కాంచన కొడుకు అంటూ పారిజాతం సమాధానం ఇస్తే.. కాంచనతోనే బంధం తెగిపోయిందంటే కొడుకు గురించి మాట్లాడతావేంటి అని శివన్నారాయణ కోప్పడతాడు. అనుకున్నంత తేలికగా బంధాలు తెగిపోవని జ్యోత్స్న అంటే సిగ్గులేదా అని అరుస్తాడు. “వ్రతం రోజున నేను మెట్టుదిగొచ్చినా మీరు ఒప్పుకోలేదని అన్నాను. ఈ విషయం తెలియదని మీ అత్త అంది. పెళ్లికి ఒప్పుకున్నానని ముందే తెలిసినా తాను దీప మెడలోనే తాళి కడతానని మీ బావే అన్నాడు. దాని అర్థమేంటి. నా మాటంటే లెక్కలేదని, నువ్వుంటే ఇష్టంలేదని” అని జ్యోత్స్నతో శివన్నారాయణ కోపంగా చెపుతాడు. వారి దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళతావని అంటాడు.

రెస్టారెంట్‍లో ఏం జరిగిందో గుర్తులేదా అంటూ.. కార్తీక్‍పై చేయి ఎత్తిదే దీప అడ్డుకున్న విషయాన్ని శివన్నారాయణ గుర్తు చేసుకుంటాడు. “పుట్టిన రోజులే చేసుకుంటారో.. వెళ్లి చేసుకుంటారో వాళ్లిష్టం. నువ్వు ఆ ఇంటికి గుమ్మం కూడా తొక్కేందుకు వీలు లేదు” అని తెగేసి చెబుతాడు. బయట కలవొచ్చా అని పారిజాతం అంతే మరింత కోప్పడతాడు.

“మనరాలు వెళ్లినా.. వెళ్లినట్టు తెలిసినా.. ఇక ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి అదే ఆఖరు రోజు అవుతుంది” అని పారిజాతంకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు శివన్నారాయణ. తాత ఆగమంటే ఆగుతానా అని జ్యోత్స్న అంటే.. నువ్వు ఆగకపోతే నేను పోతానే అని పారిజాతం అంటుంది. అల్లుడిని, కూతురిని, మనవడిని ఇప్పటికే గెంటేశాడని, ఇప్పుడు నిన్ను గెంటుతాడా అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది.

హగ్ చేసుకొని చెబుతా

బావకు విషెస్ ఎలా చెప్పాలని జ్యోత్స్న అంటుంది. ఫోన్ చేసి చెప్పాలని పారిజాతం ఐడియా ఇస్తుంది. అయితే, తాను నేరుగా వెళ్లి బావను హగ్ చేసుకొని చెబుతానని జ్యోత్స్న అంటుంది. ముద్దు పెట్టుకొని చెప్పవే అని పారిజాతం వెటకారం చేస్తే.. నాకు అభ్యంతం లేదని జ్యోత్స్న అంటుంది. మీ తాతకు పెట్టవే అని విసుక్కుంటుందని పారిజాతం. ముందు ఫోన్ చేసి విషెస్ చెప్పాలని పారిజాతం అంటుంది. దీంతో కార్తీక్‍కు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. దీంతో కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner