(1 / 5)
కొరియన్ యాక్షన్ మూవీ ఏ కంపెనీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ వరల్డ్ నుంచి బయటకొచ్చి ఓ సాధారణ జీవితాన్ని గడపాలనుకున్న గ్యాంగ్‌స్టర్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అతడు ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆ గ్యాంగ్‌స్టర్ మనుషులే అతడిని చంపాలని ఎందుకు అనుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
(2 / 5)
స్పానిష్ ఫిల్మ్ గోయో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఓ మ్యూజియంలో పనిచేసే భిన్న మనస్తత్వాలు కలిగిన జంట ఎలా ప్రేమలో పడ్డారు? వారి ప్రేమకథ ఏ మలుపులు తిరిగిందన్నది దర్శకుడు ఈ సినిమాలో ఎమోషనల్‌గా చూపించాడు. ఈ స్పానిష్ మూవీ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను అందుకున్నది.
(3 / 5)
హాలీవుడ్ హారర్ మూవీ ది సీడింగ్ బుక్‌మై షో ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఎడారిలోని ఓ ట్రాప్‌లో యువకుడు ఎలా చిక్కుకున్నాడు? ఆ ట్రాప్ నుంచి బయటపడే క్రమంలో అతడు తెలుసుకున్న నిజాలేమిటన్నదే ది సీడింగ్ మూవీ కథ.
(4 / 5)
బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కొరియన్ మూవీ కాంక్రీట్‌యూటోపియా జూలై 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. భూకంపం కారణంగా సియోల్‌లో మొత్తం నేలమట్టం అవుతుంది. ఒకే ఒక బిల్డింగ్ మాత్రమే చెక్కుచెదరకుండా ఉంటుంది. అందులో తలదాచుకునేందుకు కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.
(5 / 5)
అమెరికన్ క్రైమ్ డ్రామా మూవీ హి వెంట్ దట్ వే జియో సినిమా ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ సీరియల్ కిల్లర్ కారణంగా ఓ యానిమల్ ట్రైలర్ ఎలా కష్టాలు పడ్డాడు? ఆ కిల్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడనే పాయింట్‌తో హి వెంట్ దట్ వే మూవీ రూపొందింది.
ఇతర గ్యాలరీలు