Krishna Mukunda Murari Today Episode: ముకుందను పుట్టింటికి పంపిస్తే కృష్ణ, మురారిలా కాపురం చక్కబడుతుందని అనుకుంటుంది రేవతి. ఇందుకోసం ముకుంద ఫాదర్ శ్రీనివాస్‌ను కలుస్తుంది. భవానీ ఇంటికి రాకముందే ఆదర్శ్‌తో ముకుందకు విడాకులు ఇప్పిస్తే మంచిదని అతడితో చెబుతుంది. కానీ ఆమె ఆలోచనలను శ్రీనివాస్ గ్రహిస్తాడు. నా కూతురు జీవితం బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే మీ కొడుకు కోడలు కాపురం బాగుండాలని ఈ నిర్ణయానికి వచ్చారా అంటూ రేవతితో అంటాడు.
అతడి మాటలు విని రేవతి షాక్ అవుతుంది. ముకుంద, మురారిల ప్రేమ విషయం, కృష్ణ, మురారిల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తనకు ముందే తెలుసునని రేవతితో అంటాడు అంటాడు. ఆదర్శ్‌తో ముకుంద పెళ్లి మురారినే దగ్గరుండి జరిపించాడనే నిజాన్ని రేవతితో చెబుతాడు శ్రీనివాస్. తాము అప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఇప్పుడు ముగ్గురు జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని బాధపడతాడు శ్రీనివాస్.
తన కొడుకు మురారి తప్పు చేశాడని రేవతి కూడా అంగీకరిస్తుంది. ఈ సమస్యలో మురారితో పాటు ముకుంద తప్పు కూడా ఉందని రేవతితో అంటాడు శ్రీనివాస్. ముకుందను తిరిగి తన ఇంటికి పంపిస్తానని మురారి తనకు మాటిచ్చిన విషయాన్ని రేవతితో చెబుతాడు శ్రీనివాస్ ఈ సమస్యను పరిష్కరించడంతో తాను మురారికి సాయపడతానని శ్రీనివాస్‌కు మాటిస్తుంది రేవతి.
మురారి ప్రేమ తనకు దక్కకపోవడంతో బాధలో మునిగిపోతుంది కృష్ణ. మందు తాగితే బాధలు మర్చిపోవచ్చని మధుకర్ చెప్పిన మాటలు నమ్ముతుంది. మందు వాసనను పీల్చుతుంది. దాంతో మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కృష్ణ ప్రవర్తనను చూసి రేవతి కంగారు పడుతుంది. కృష్ణకు మందు తాగించిన మధుకర్ చెంపపై గట్టిగా ఒక్కటి ఇస్తుంది. కృష్ణ మత్తును వదలగొడుతుంది. బాధను మర్చిపోవడానికే మందు తాగానని రేవతితో చెబుతుంది కృష్ణ. కోడలి మాటలకు రేవతి ఆలోచనలతో పడుతుంది. కృష్ణ మనసులో ఉన్న భాద ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటుంది
కిచెన్‌లో వంట చేస్తోన్న రేవతి దగ్గరకు కృష్ణ వస్తుంది. మామయ్య మీద కోపం వస్తే ఏం చేస్తారని రేవతిని అడుగుతుంది. మాట్లాడటం మానేస్తానని రేవతి సమాధానం ఇస్తుంది. అప్పుడు భర్త తనను బుజ్జగిస్తాడు. బతిమిలాడుతాడని అంటుంది రేవతి. కృష్ణ మాటలతో రేవతి అనుమానం మరింత బలపడుతుంది.
మురారిపైన కోపం వచ్చిందా? ఏ విషయంలోనైనా ఇబ్బంది పెడుతున్నాడా అంటూ నిజం చెప్పమని కోడలిని అడుగుతుంది. అత్తయ్య మాటలకు కృష్ణ తడబడుతంది. మురారిని ప్రేమించిన విషయాన్ని అత్తయ్యతో కృష్ణ చెప్పిందా? కృష్ణ మాటలకు రేవతి ఎలా స్పందించింది? మురారి, కృష్ణలను కలపడానికి ఆమె ఏం చేసిందన్నది నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో చూడాల్సిందే.