Makar Sankranti: 2025 లో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఆరోజు నువ్వులు ఎందుకు తింటారు?-when is makar sankranti in 2025 note the date auspicious time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Makar Sankranti: 2025 లో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఆరోజు నువ్వులు ఎందుకు తింటారు?

Makar Sankranti: 2025 లో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఆరోజు నువ్వులు ఎందుకు తింటారు?

Gunti Soundarya HT Telugu
Nov 16, 2024 09:50 AM IST

Makar Sankranti: మరికొద్ది రోజుల్లో పాత సంవత్సరానికి ముగింపు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాము. కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ మకర సంక్రాంతి. 2025 లో సంక్రాంతి పండుగ ఏ తేదీ వచ్చిందో తెలుసుకుందాం.

2025 లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?
2025 లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?

హిందూ మతంలో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రంథాల ప్రకారం పన్నెండు రాశుల పర్యటనలో భాగంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ప్రాంతాలను బట్టి సర్కత్, లోహ్రా, తెహ్రీ, పొంగల్ మొదలైన పేర్లతో పిలుస్తారు.

కొత్త సంవత్సరం ప్రారంభంలో వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమతో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు నువ్వులు తినడం శ్రేయస్కరం. స్నానం, దానధర్మాలు కూడా ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజున ప్రజలు కూడా పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు.

మకర సంక్రాంతి రోజు దానం చేయడం కూడా శుభప్రదం. మకర సంక్రాంతి రోజున దానం చేయడం వల్ల చాలా రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శనిగ్రహాన్ని కలుస్తాడు. ఈ రోజున శుక్ర గ్రహం కూడా ఉదయిస్తుంది. ఈ రోజు నుండి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు మకర రాశిలో ఉదయించగానే సూర్యదేవుడు దిగివచ్చి దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రి మొదలవుతుంది. ఖర్మాలు ముగియడంతో మాఘమాసం ప్రారంభమవుతుంది. ఒక్క రోజు అటూ ఇటూ తేడాతో మకర సంక్రాంతి పండుగ తేదీ వస్తుంది. కొన్ని సార్లు జనవరి 15 వస్తే ఒక్కోసారి జనవరి 14న జరుపుకుంటారు. రానున్న కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చిందో చూద్దాం.

సంక్రాంతి ఎప్పుడంటే?

2025లో మకర సంక్రాంతి తేదీ - జనవరి 14, 2024, మంగళవారం

మకర సంక్రాంతి పుణ్యకాలం - 09:03 AM నుండి 05:46 PM వరకు

వ్యవధి - 08 గంటల 42 నిమిషాలు

మకర సంక్రాంతి మహా పుణ్య కాలం - 09:03 AM నుండి 10:48 AM వరకు

వ్యవధి - 01 గంట 45 నిమిషాలు

మకర సంక్రాంతి క్షణం - 09:03 AM

నువ్వులు తినడం శ్రేయస్కరం

సూర్యుడు మకర రాశిలో ఉండడం వల్ల పుణ్యకాలంలో స్నానం చేసి దానం చేసిన తర్వాత చురా పెరుగు, నువ్వులు తింటే శుభం కలుగుతుంది. శుభముహూర్తములో స్నానము చేసి, కంకణములు, నువ్వులు, మిఠాయిలు, కిచిడీ పదార్ధాలు, చలికాలంలో ఉపయోగించే దుప్పట్లు లేదా వస్త్రాలు దానం చేస్తారు. తర్వాత నువ్వుల హోమాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయి. వాతావరణంలో మార్పులు సంక్రాంతి నుంచి చిన్నగా ప్రారంభంఅవుతాయి. వాటిని శరీరం తట్టుకునేందుకు వీలుగా నువ్వులు తినడం మంచిదని సూచిస్తారు.

మకర సంక్రాంతి రోజున ఈపనులు చేయండి

నీరు, ఎర్రటి పూలు, పూలు, బట్టలు, గోధుమలు, అక్షతలు, తమలపాకులు మొదలైన వాటిని మకర సంక్రాంతి రోజున అర్ఘ్య సమయంలో సూర్య భగవానుడికి సమర్పిస్తారు. పూజ తర్వాత ప్రజలు పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి దానం చేస్తారు. మకర సంక్రాంతి రోజున కిచిడీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner