Allu Arjun Rashmika Dance: ముంబయిలో స్టేజ్‌పై స్టెప్‌లు వేసిన అల్లు అర్జున్, రష్మిక మంధాన.. ఇంతకీ ఏం పాటకో తెలుసా?-allu arjun rashmika mandanna dance to angaaron at pushpa 2 mumbai event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Rashmika Dance: ముంబయిలో స్టేజ్‌పై స్టెప్‌లు వేసిన అల్లు అర్జున్, రష్మిక మంధాన.. ఇంతకీ ఏం పాటకో తెలుసా?

Allu Arjun Rashmika Dance: ముంబయిలో స్టేజ్‌పై స్టెప్‌లు వేసిన అల్లు అర్జున్, రష్మిక మంధాన.. ఇంతకీ ఏం పాటకో తెలుసా?

Galeti Rajendra HT Telugu

Pushpa 2 Mumbai event: పుష్ప 2 సినిమా రిలీజ్‌కి ఇక ఆరు రోజులే సమయం ఉంది. దాంతో అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ముంబయిలో శుక్రవారం జరిగిన ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి స్టేజ్‌పై సరదాగా డ్యాన్స్ వేశారు.

అల్లు అర్జున్, రష్మిక మంధాన

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మంధాన ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. డిసెంబరు 5 ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్‌కి సిద్ధమవుతుండగా.. గత వారం నుంచి ప్రమోషన్స్‌లో టీమ్ వేగం పెంచింది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి లక్షల్లో అభిమానులు హాజరవగా.. సౌత్‌లోనూ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. శుక్రవారం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కి హాజరైన అల్లు అర్జున్, రష్మిక మంధాన.. ఒక సాంగ్‌కి సరదాగా డ్యాన్స్ చేసి అందర్నీ అలరించారు.

ముంబయిలో ప్రెస్‌మీట్

ముంబయిలో మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పిన అల్లు అర్జున్, రష్మిక మంధాన.. ఆఖర్లో ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ సాంగ్‌కి స్టెప్‌లు వేశారు. పుష్ప 2లోని ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 2021లో పుష్ప 1 రిలీజ్‌అవగా.. మూడేళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

12,000 స్క్రీన్స్‌లో రిలీజ్

డిసెంబరు 5న పుష్ప 2 మూవీని 12,000 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ప్రకటించారు. ఐమ్యాక్స్‌లోనూ ఎక్కువ స్క్రీన్స్‌లో పుష్ప 2ని వేయబోతున్నట్లు చెప్పిన ప్రొడ్యూసర్స్.. ఆరు భాషల్లో మూవీని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

170 రోజులు షూటింగ్‌లో రష్మిక

అల్లు అర్జున్ ఈ సీక్వెల్ కోసం మూడేళ్లకి పైగా సమయాన్ని వెచ్చించగా.. రష్మిక మంధాన దాదాపు 170 రోజులు సినిమా కోసం పనిచేసినట్లు నిర్మాతలు గుర్తు చేసుకున్నారు. ఇక సుకుమార్ అయితే.. ఇప్పటికీ బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతూనే ఉన్నారన్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు థమన్ కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

అంచనాలు పెంచేసిన ఐటెం సాంగ్

పుష్ప 2 మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. కిస్సిక్‌ అంటూ ఇటీవల విడుదలైన ఈ పాట కుర్రకారుని కట్టిపడేస్తోంది. పుష్ప 1లో సమంత ఊ అంటావా.. ఊఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ చేసి ట్రెండ్‌ను సెట్ చేసింది. దాంతో ఈ కిస్సిక్‌ పాట అంతకు మించి ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది.