రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అదనపు రద్దీ క్లియర్ చేయడానికి హిసార్ నుంచి తిరుపతికి రెండు వారంతపు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం- సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైళ్లకు అదనపు కోచ్‌లను తీసుకురానుంది.
1. హిసార్‌లో బయలుదేరే హిసార్- తిరుపతి వీక్లీ స్పెషల్ (04717) రైలు డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం హిసార్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఆదివారం తిరుపతి చేరుకుంటుంది.
2. తిరుపతిలో బయలుదేరే తిరుపతి- హిసార్ వీక్లీ స్ఫెషల్ (04718) రైలు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు నడుస్తుంది. ఈ రైలు ప్రతి సోమవారం తిరుపతిలో బయలుదేరుతోంది. మరుసటి రోజు మంగళవారం హిసార్ చేరుకుంది.
ఈ రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర రైల్వే స్టేషన్‌ల్లో ఆగుతాయి.
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే (20707) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లు జత చేయనున్నారు. ఈ రైళ్లు ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తున్నాయి. మరో 8 బోగీలు జత చేయనున్నారు. ఇకనుంచి 16 కోచ్‌లతో ఈ రైలు సేవలు అందించనుంది.
సికింద్రాబాద్- విశాఖ మధ్య నడిచే మరో వందేభారత్ రైలు (20833) ప్రస్తుతం 16 బోగీలతో సేవలు అందిస్తోంది. దీనికి మరో 4 జత చేయనున్నారు. దీంతో ఇక నుంచి 20 కోచ్‌లతో సేవలు అందించనుంది.
ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి వాల్తేర్ డివిజన్‌లోని విశాఖపట్నం- కిరండూల్ రైళ్లకు స్లీపర్, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను పెంచింది.
1. విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ ( 08551) రైలుకు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు. డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 26, 28, 30, జనవరి 1 తేదీల్లో ఒక థర్ట్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జత చేయనున్నారు.
2. కిరండూల్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ ( 08552) రైలుకు డిసెంబర్ 2 నుండి జనవరి 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ పెంచుతారు. 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, జనవరి 2 తేదీల్లో ఒక థర్ట్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జత చేస్తారు.
డిసెంబర్‌లో దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ డివిజన్‌లో భద్రతా పనులు జరుగుతున్నాయి. దీంతో రైళ్లు నంద్యాల - ధోనే - అనంతపురం సాధారణ రూట్‌కు బదులుగా నంద్యాల - యర్రగుంట్ల - గూటి - అనంతపురం మీదుగా మళ్లించనున్నారు.
1. పూరీ నుండి బయలుదేరే పూరీ - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (22883) రైలు డిసెంబర్ 6న మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ధోనే స్టాప్‌ను తొలగించారు.
2. యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరే యశ్వంత్‌పూర్ - పూరీ ఎక్స్‌ప్రెస్ (22884) రైలు డిసెంబర్ 7న మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ధోనే స్టాప్‌ను తొలగించారు.
3. హౌరా నుండి బయలుదేరే హౌరా - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (22831) రైలు డిసెంబర్ 4, 11 తేదీల్లో మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ధోనే, గూటీ స్టాప్‌లను తొలగించారు.
4. యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరే యశ్వంత్‌పూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్ (22832) రైలు డిసెంబర్ 6, 13 తేదీల్లో మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ధోనే, గూటీ స్టాప్‌లను తొలగించారు. ప్రజలు, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు చేసుకోవాలని గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు సూచించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)