తెలుగు న్యూస్ / ఫోటో /
AP Cyclone Updates: తప్పిన తుఫాను ముప్పు, దక్షిణ కోస్తాకు వీడని వానగండం, రాయలసీమలో వర్షాలు
- AP Cyclone Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ముప్పు తప్పిన పలు జిల్లాలకు వర్ష సూచన చసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Cyclone Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ముప్పు తప్పిన పలు జిల్లాలకు వర్ష సూచన చసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా రూపాంతరం చెందలేదు. గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలికి 200 కి.మీ. నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
(2 / 7)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుం దని, సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడు తుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వాయవ్య, దిశగా కదులుతూ శనివారం ఉద నికల్లా కరైకల్ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.
(3 / 7)
వాయుగుండం తుఫానుగా మారకపోవడంతో దాని ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా తుఫాను ముప్పు మాత్రం తప్పింది.
(4 / 7)
వాయుగుండం ప్రభావంతో శుక్రవారం 29వ తేది వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు.
(5 / 7)
వాయుగుండం ప్రభా వంతో శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా. నెల్లూరు జిల్లాలో రించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాధ్ సూచిం చారు. మరోపక్క, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ డన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రభుత్వానికి నిరంతరం సంకేతాలి స్తోంది.
(6 / 7)
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిమీ వేగంతో కదులుతున్న తీవ్రవాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ, నాగపట్నానానికి 330 కి.మీ, పుదుచ్చేరికి 390 కి.మీ, చెన్నైకి 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతం ఇవాళ తీవ్ర వాయుగుండం గానే కొనసాగే అవకాశం రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది.(image source unsplash.com )
(7 / 7)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
ఇతర గ్యాలరీలు