Sci fi Thriller OTT: తెలుగులోకి వచ్చిన కోలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ - మూడో వరల్డ్ వార్ వస్తే!
Sci fi Thriller OTT: ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హాప్ హాప్ తమిళ హీరోగా నటించిన తమిళ మూవీ కడైసి ఉతళ పోర్ తెలుగు లాస్ట్ వరల్డ్ వార్ పేరుతో రిలీజైంది. డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ హిప్ హాప్ తమిళనే కావడం గమనార్హం.
Sci fi Thriller OTT: లేటెస్ట్ తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ కడైసి ఉగళ పోర్ తెలుగులోకి వచ్చింది. లాస్ట్ వరల్డ్ వార్ పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాలో ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ హీరోగా నటించాడు. అతడే దర్శకత్వం వహిస్తూ స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. అనఘ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో నాజర్, నటరాజ సుబ్రమణియన్ ప్రధాన పాత్రలు పోషించారు.
డిజాస్టర్...
టీజర్స్, ట్రైలర్స్‌తో తమిళ ప్రేక్షకుల్లో అంచనాలకు రేకెత్తించిన కడైసి ఉళగ పోర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ పది కోట్ల కలెక్షన్స్ సాధించి హిప్ హాప్ తమిళకు నష్టాలను తెచ్చిపెట్టింది.
మూడో వరల్డ్ వార్ వస్తే...
ప్రయోగాత్మక కథాంశంతో హిప్ హాప్ ఆది లాస్ట్ వరల్డ్ వార్ మూవీని తెరకెక్కించాడు. 2028లో మూడో వరల్డ్ వార్ వస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ఈ సినిమా కథను రాసుకున్నాడు. హిప్ హాప్ ఆది యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా...కథ కన్ఫ్యూజింగ్‌గా సాగడం ఈ మూవీకి మైనస్‌గా మారింది.
రిపబ్లిక్ కూటమిపై పోరు...
చైనా, రష్యాతో పాటు మరికొన్ని దేశాలు ఐక్యరాజ్య సమితికి పోటీగా రిపబ్లిక్ పేరుతో కొత్త ఆర్గనైజేషన్‌ను ఏర్పాటుచేస్తాయి. రిపబ్లిక్ అండగా తమిళనాడు ముఖ్యమంత్రి జీఎన్ఆర్‌ను (నాజర్) పదవీ నుంచి దింపేయాలని నటరాజ్ (నటరాజ సుబ్రమణియన్) కుట్రలు పన్నుతాడు. ముఖ్యమంత్రి జీఎన్ఆర్‌కు తమిళ (హిప్ హాప్ తమిళ) తన గ్యాంగ్‌తో కలిసి అండగా నిలుస్తాడు.
నటరాజ్ తో పాటు రిపబ్లిక్ కుట్రలను తమిళ ఎలా ఎదుర్కొన్నాడు? ఇండియాను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి రిపబ్లిక్ ఎలాంటి ప్లాన్స్ వేసింది? సీఏం కూతురు కీర్తనతో తమిళకు ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమగా మారింది? రిపబ్లిక్ దేశాలతో జరిగిన మూడో ప్రపంచ యుద్ధంలో ఇండియా సైన్యం విజయం సాధించిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
పదకొండు పాటలు...
ఈ సినిమాకు హిప్ హాప్ తమిళనే మ్యూజిక్ అందించడం గమనార్హం. ఈ సినిమాలో మొత్తం పదకొండు పాటలు ఉండగా చాలా వాటికి హాప్ హాప్ తమిళనే రాశాడు.
ఏజెంట్ సినిమాకు మ్యూజిక్...
మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హిప్ హాప్ తమిళ ఆ తర్వాత హీరోగా మారాడు. తెలుగులో ధృవ, ఏ1 ఎక్స్‌ప్రెస్, అఖిల్ ఏజెంట్‌తో పాటు మరికొన్ని సినిమాలకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించాడు. కొన్నాళ్లుగా యాక్టింగ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నాడు.
ఈ ఏడాది కడైసి ఉళగ పోర్‌తో పాటు హీరోగా పీటీ సార్ మూవీ చేశాడు. పీటీ సార్ కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కడైసి ఉళగ పోర్ హీరోయిన్ అనఘ గతంలో తెలుగులో గుణ 369 సినిమా చేసింది. ఈ సినిమాలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించాడు.