Vijay Thalapathy: దళపతి విజయ్ కాపీ కొట్టిన డ్యాన్స్ స్టెప్స్.. ప్రభాస్, బన్నీ, తారక్ సినిమాలోవే! (వీడియో)
Thalapathy Vijay Copied Dance Steps: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన చేసిన చాలా వరకు సినిమాల్లో తెలుగు స్టార్ హీరోల డ్యాన్స్‌ను కాపీ కొట్టినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Thalapathy Vijay Copied Dance Steps: తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోను భారీగా అభిమానులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా అగ్ర హీరోగా చక్రం తిప్పుతూ వస్తున్నాడు విజయ్. ఇటీవలే లియో సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేసిన విజయ్ త్వరలో గోట్ (The Greatest Of All Time) మూవీతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే.
కాపీ కొట్టాడంటూ
ఇదిలా ఉంటే, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన విజయ్ తెలుగు స్టార్ హీరోల సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టాడని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంటుంది. సినిమాలను రీమేక్ చేయడమే కాకుండా తెలుగు స్టార్ హీరోలు వేసిన డ్యాన్స్ స్టెప్స్‌ను సైతం విజయ్ కాపీ కొట్టాడంటూ నెట్టింట్లో పలు వీడియోలు ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. మరి విజయ్ వేసిన తెలుగు హీరోల డ్యాన్స్ స్టెప్స్, అవి ఏ సినిమాల్లో ఉన్నాయో ఓసారి చూద్దాం.
ప్రభాస్-బొమ్మాళీ సాంగ్
ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో బొమ్మాళీ పాటలోని హుక్ స్టెప్‌ను విజయ్ కాపీ కొట్టాడని ట్రోలింగ్ జరుగుతుంటుంది. అనుష్క ప్యాంట్‌ను ప్రభాస్ పైకి కిందకు జరిపే స్టెప్‌ను సురా సినిమాలో తమన్నాతో విజయ్ చేశాడు. సేమ్ అదే మ్యూజిక్ కంపోజ్‌తో వచ్చే ఈ పాటలో బొమ్మాళీ సాంగ్ హుక్ స్టెప్ అచ్చం అలాగే ఉంటుంది.
అల్లు అర్జున్- మై లవ్ ఈజ్ గాన్
మళ్లీ అదే సురా సినిమాలో బిల్లా టైటిల్ సాంగ్‌ను వాడేశారు. అంతేకాకుండా ఆ పాటలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ నటించిన ఆర్య 2 మూవీలోని మై లవ్ ఈజ్ గాన్ పాటలోని ఐకానిక్ స్టెప్‌ను కాపీ కొట్టేశాడు విజయ్. బిల్లా టైటిల్ సాంగ్ తరహాలో వచ్చే ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ వేసిన ఫ్లోర్ మూమెంట్ వేస్తూ వెనక్కి వెళ్లే స్టెప్‌ను విజయ్ చేశాడు. హీరోకి ఎలివేషన్ ఇచ్చే బిల్లా టైటిల్ సాంగ్‌లో ఆర్య 2 స్టెప్ ఏంటంటూ నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్- నాచోరే, నాగమళ్లీ
ఇక విజయ్ నటించిన అళగియ తమిళ మగన్ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వేసిన ఫ్లోర్ మూమెంట్స్ స్టెప్‌ను విజయ్ కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. ఏటీఎమ్ అని పిలిచే ఈ సినిమాలో ఎల్లపుగళం అనే హీరో ఎంట్రీ పాటలో యమదొంగ సినిమాలోని నాచోరే, నాగమళ్లీ పాటలోని హుక్ స్టెప్‌ను విజయ్ చేశాడు. ఫ్లోర్‌పై కంటిన్యూగా ఎన్టీఆర్ చేసే ఈ డ్యాన్స్‌ను ఏదో స్టేడియంలో విజయ్ వేస్తాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా శ్రీయ సరన్ నటించింది.
షాహిద్ కపూర్- సారీ కే ఫాల్ సా
తెలుగు హీరోలు మాత్రమే కాకుండా హిందీ కథానాయకులు వేసిన స్టెప్స్ కూడా విజయ్ కాపీ కొట్టాడని అంటున్నారు. ఆర్.. రాజ్ కుమార్ సినిమాలో సారీ కే ఫాల్ సా పాటలో షాహిద్ కపూర్-సోనాక్షి సిన్హా వేసిన స్టెప్పులను విజయ్, సమంత కలిసి వేశారని చెబుతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి మూవీలో సెల్ఫీ పాటలో విజయ్, సమంత ఈ స్టెప్పు వేశారు. హీరో హీరోయిన్ ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని కిందకు చూస్తూ ఈ డ్యాన్స్ స్టెప్ వేస్తారు.
ఒక్కరే అయినప్పుడు
అయితే, విజయ్ కాపీ కొట్టిన డ్యాన్స్ స్టెప్స్ అంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పలువురు వివిధరకాలుగా స్పందిస్తున్నారు. ఇక డ్యాన్స్ అనేది కొరియోగ్రాఫర్ చేతుల్లో, సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ల చేతిలో ఉంటాయి. దానికి విజయ్ ఏం చేస్తాడని మరికొందరు వివరిస్తున్నారు. తెలుగు, తమిళం రెండింట్లో సేమ్ సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఉండి ఆ స్టెప్పులు వేయించారేమో అని విజయ్ తరఫున కొంతమంది నెటిజన్స్ వాదిస్తున్నారు.
టాపిక్