Allu Arjun: బేబి నిర్మాత ఇంట్లో విషాదం.. ఇంటికెళ్లి పరామర్శించిన అల్లు అర్జున్-allu arjun meets producer skn and condolence on his father death ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: బేబి నిర్మాత ఇంట్లో విషాదం.. ఇంటికెళ్లి పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun: బేబి నిర్మాత ఇంట్లో విషాదం.. ఇంటికెళ్లి పరామర్శించిన అల్లు అర్జున్

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2024 07:52 AM IST

Allu Arjun Meets SKN At Home: బేబి నిర్మాత ఎస్‌కెన్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి పరామర్శించాడు. ఇటీవల ఎస్‌కెఎన్ తన తండ్రిని కోల్పోయిన నేపథ్యంలో ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి సానుభూతి తెలిపాడు అల్లు అర్జున్. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.

బేబి నిర్మాత ఇంట్లో విషాదం.. ఇంటికెళ్లి పరామర్శించిన అల్లు అర్జున్
బేబి నిర్మాత ఇంట్లో విషాదం.. ఇంటికెళ్లి పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun Condolences To SKN: వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, క‌మ‌ర్షిషియ‌ల్ చిత్రాలు నిర్మిస్తూ, అభిరుచి గ‌ల నిర్మాత‌గా గుర్తింపు పొందిన నిర్మాత ఎస్‌కెఎన్‌. ఇటీవల ఆయ‌న త‌న తండ్రిని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ఎస్‌కెఎన్ అతని కుటుంబం అంతా తన తండ్రి మరణంతో బాధలోనే ఉన్నారు. కాగా మంగళవారం (జనవరి 23) ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని నిర్మాత ఎస్‌కెఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ఓదార్పునిచ్చాడు.

ఎస్‌కెఎన్ తండ్రి గారి చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొద‌టి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావానికి అమితమైన ఆరాధకుడు అయిన ఎస్‌‌కెఎన్‌, ఆయన్ని చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. తాజాగా బన్నీ తన ఇంటికి రావడం ఎస్‌‌కెఎన్‌కి చాలా ఓదార్పునిచ్చింది. "ఇలాంటి క‌ష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి మృతికి ఆయన వచ్చి సానుభూతి, సంతాపం తెలియ చేసినందుకు ధన్యవాదాలు" అని నిర్మాత ఎస్‌‌కెఎన్‌ తెలిపారు.

కాగా నిర్మాత ఎస్కే‌ఎన్ తండ్రి గాదే సూర్యప్రకాశ రావు అనారోగ్యంతో మరణించారు. ఇదిలా ఉంటే 'బేబీ', 'టాక్సీవాలా' వంటి విజయవంతమైన చిత్రాలతో ఎస్‌‌కెఎన్ అంద‌రికి సుప‌రిచితుడే. ఈ రెండు చిత్రాలను ఎస్‌‌కెఎన్‌ నిర్మించారు. ఇటీవల బేబీ సినిమా ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ సెన్షేషన్ (సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్మమ్మ సిరీస్ ఫేమ్) వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు కొబ్బరి మట్ట ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇందులో మరో ముఖ్య పాత్రలో విరాజ్ అశ్విన్ నటించిన విషయం తెలిసిందే.

గతేడాది జులై 13న విడుదలైన బేబి సినిమా ఎంతటి సక్సెస్ ఉందో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు తెలిసిందే. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబి మూవీ విడుదలైన పది రోజుల్లోనే సుమారు రూ. 66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసింది. ఈ సినిమాను నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు ఓ ఇంటర్వ్యూలో సాయి రాజేష్ తెలిపాడు. తమిళనాడులో సేలంలో ఇలాంటి సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. ఇక బేబి విజయం తర్వాత సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది మూవీ టీమ్.

బేబి సక్సెస్ మీట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ గురించి నిర్మాత ఎస్‌కెఎన్ ఎమోషనల్‌గా మాట్లాడాడు. అలాగే సినిమాపై, దర్శకుడు, నిర్మాత, హీరోహీరోయిన్లపై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ (పుష్ప 2) సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే టాక్ వచ్చింది.