Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్-sunrisers hyderabad have chance to seal top 2 spot in ipl 2024 points table due to rajasthan royals consecutive defeats ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2024 07:27 AM IST

Sunrisers Hyderabad IPL 2024: రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో ఓడిపోవటంతో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు మంచి ఛాన్స్ ముందుంది. టాప్-2లో ప్లేస్ దక్కించుకునేందుకు ఎస్‍ఆర్‌హెచ్‍కు అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి. ఆ సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్
Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్ (PTI)

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఆరంభం నుంచి అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ గత నాలుగు మ్యాచ్‍లుగా తడబడుతోంది. ఈ సీజన్‍లో తొలి తొమ్మిది మ్యాచ్‍ల్లో 8 గెలిచి ఒకటి ఓడిన రాజస్థాన్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో ఓడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్నా టాప్-2లో ప్లేస్‍ను సందేహం చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం (మే 15) జరిగిన పోరులో రాజస్థాన్ ఓడింది. రాజస్థాన్ వరుస ఓటములతో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. పాయింట్ల పట్టికలో టాప్‍-2 ప్లేస్‍ను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదెలా అంటే..

సన్‍రైజర్స్ రెండో ప్లేస్ దక్కించుకోవాలంటే..

సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‍లు ఆడి ఏడు గెలిచి, ఐదు ఓడింది. ఇంకా లీగ్ దశలో హైదరాబాద్ రెండు మ్యాచ్‍లు ఆడాల్సింది. గుజరాత్ టైటాన్స్‌తో నేడు (మే 16), పంజాబ్ కింగ్స్ జట్టుతో మే 19న హైదరాబాద్ తలపడనుంది. గుజరాత్‍తో నేటి మ్యాచ్ గెలిస్తే ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. పంజాబ్‍తో మ్యాచ్‍లోనూ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. అలాగే.. కోల్‍కతాతో మ్యాచ్‍లో రాజస్థాన్ ఓడినా.. గెలిచినా స్వల్పంగానే అయితే ఇది జరుగుతుంది.

ఓ మ్యాచ్ ఓడితే..

ఒకవేళ రెండు మ్యాచ్‍ల్లో ఒకటి మ్యాచ్ ఓడినా.. రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్‍లో పరాజయం పాలైతే సన్‍రైజర్స్ హైదరాబాద్ టాప్-2 అవకాశాలు మెండుగానే ఉంటాయి. అలా అయితే ఆ ఓటమి స్వల్ప తేడాతో వచ్చిన ఎస్‍ఆర్‌హెచ్‍కు ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం హైదరాబాద్ వద్ద 14 పాయింట్లు ఉండగా.. ఒక్క మ్యాచ్ గెలిచినా 16 అవుతాయి. అందులోనూ రాజస్థాన్ రాయల్స్ (0.27) కంటే ప్రస్తుతం హైదరాబాద్ (0.40) నెట్‍రన్ రేట్ మెరుగ్గా ఉంది.

రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. అయితే, వరుస పరాజయాలతో టాప్ 2 ప్లేస్‍కు ఎసరు తెచ్చుకుంది. 13 మ్యాచ్‍ల్లో 8 గెలిచిన ఆర్ఆర్ వద్ద ప్రస్తుతం 16 పాయింట్లు ఉన్నాయి. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టుకు మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. ఇప్పటికే టాప్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్న కోల్‍కతా నైట్‍రైడర్స్‌తో 19వ తేదీన ఆర్ఆర్ తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‍లో కోల్‍కతా చేతిలో రాజస్థాన్ ఓడినా.. స్వల్ప తేడాతో గెలిచినా.. హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచ్‍లు గెలిస్తే టాప్-2 ప్లేస్ చేరుతుంది. రెండు మ్యాచ్‍లు హోం గ్రౌండ్ ఉప్పల్‍లోనే ఆడనుండడం సన్‍రైజర్స్‌కు బాగా కలిసి వచ్చే అంశం.

ఇదీ సమీకరణం

  • సన్‍రైజర్స్ హైదరాబాద్ రెండో ప్లేస్ ఖరారు చేసుకోవాలంటే ఆ జట్టు గుజరాత్, పంజాబ్‍పై విజయం సాధించాలి, కోల్‍కతాపై రాజస్థాన్ ఓడాలి.. ఒకవేళ ఆర్ఆర్ గెలిచినా అది స్వల్ప తేడాతోనే అయి ఉండాలి.
  • లేకపోతే హైదరాబాద్.. గుజరాత్, పంజాబ్‍ మ్యాచ్‍ల్లో ఒకటి ఓడినా.. అది స్వల్పంగా ఉండాలి, అలాగే కోల్‍కతాతో మ్యాచ్‍ను రాజస్థాన్ ఎక్కువ తేడాతో ఓడాలి.

ఈ రెండు సమీకరణాల్లో ఒకటి జరిగితే సన్‍రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానాన్ని ఫిక్స్ చేసుకుంటుంది.

టాప్-2లో ఉంటే లాభమిదే..

పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరతాయి. అయితే, టాప్-2లో ఉన్న జట్లకు ప్లేఆఫ్స్‌లో ఓ మ్యాచ్ ఓడినా మరో అవకాశం ఉంటుంది. టాప్-2లో ఉండే జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు ప్లేస్‍ల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఆ మ్యాచ్‍లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లో అడుగుపెడుతుంది. ఓడిన జట్టుకు ఇంటికి వెళుతుంది. క్వాలిఫయర్-1 ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. గెలిస్తే ఫైనల్ చేరవచ్చు. ఇలా.. టాప్-2లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్స్‌లో రెండు అవకాశాలు ఉంటాయి. అందుకే ఇది చాలా కీలకంగా ఉంటుంది.