తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Points Table: పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. పాయింట్ల పట్టిక, ప్లేఆఫ్స్ రేస్ ఎలా ఉన్నాయంటే!
- IPL 2024 Points Table Update: ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్… పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‍లో బుధవారం (మే 15) ఓటమి పాలైంది. కీలక దశలో ఫామ్ కోల్పోయింది. ఐపీఎల్ 2024 సీజన్‍లో 65వ మ్యాచ్ తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..
- IPL 2024 Points Table Update: ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్… పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‍లో బుధవారం (మే 15) ఓటమి పాలైంది. కీలక దశలో ఫామ్ కోల్పోయింది. ఐపీఎల్ 2024 సీజన్‍లో 65వ మ్యాచ్ తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..
(1 / 9)
ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో పాటు టాప్ ప్లేస్‍ను కూడా ఇప్పటికే ఖరారు చేసుంది. కోల్‍కతా ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 9 గెలిచి మూడు ఓడగా.. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో 19 పాయింట్లతో (నెట్‍రన్ రేట్ +1.428) ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍లో కొనసాగుతోంది. ఆ జట్టుకు మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది.
(2 / 9)
పంజాబ్‍తో ఓటమి తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగింది. అయితే, ఈ ప్లేస్ నిలబెట్టుకోవడం సందిగ్ధంగా మారింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడింది రాజస్థాన్. దీంతో 16 పాయింట్లతో (+0.273)లో పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా గత నాలుగు మ్యాచ్‍ల్లో వరుసగా ఓడి ఫామ్ కోల్పోయింది. రాజస్థాన్‍కు మరో లీగ్ మ్యాచ్ మిగిలిఉంది. (AP)
(3 / 9)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 7 గెలిచి 6 ఓడింది. 14 పాయింట్లతో (+0.528)తో ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మే 18న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‍లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది. (PTI)
(4 / 9)
ఈ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో 7 గెలిచి.. 5 ఓడింది. 14 పాయింట్లతో (+0.406) ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో ప్లేస్‍లో ఉంది. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‍లు గెలిస్తే.. రెండో ప్లేస్‍ను ఖరారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది.( AFP)
(5 / 9)
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‍లో తన పూర్తి 14 లీగ్ మ్యాచ్‍లను ఆడేసింది. 7 గెలిచి, 7 ఓడి 14 పాయింట్లతో (-0.377) ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా అత్యల్పమే.(AFP)
(6 / 9)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 7 ఓడింది. ప్రస్తుతం 12 పాయింట్లతో (+0.387) ఆరో ప్లేస్‍లో ఉంది. మే 18న చెన్నైతో మ్యాచ్‍లో భారీగా గెలిస్తే.. ఈ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. (PTI)
(7 / 9)
ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 7 ఓడి.. 12 పాయింట్లతో (-0.787)తో ఉంది. ఏడో స్థానంలో ఉంది. లీగ్ దశలో ఓ మ్యాచ్ మిగిలే ఉన్నా.. నెట్ రన్‍రేట్ తక్కువగా ఉండడం చాలా మైనస్‍గా మారింది. మిగిలిన మ్యాచ్‍లో అత్యంత భారీగా గెలిస్తే లక్నో టీమ్‍కు కాస్త ప్లేఆఫ్స్ ఆశలు ఉండొచ్చు. (ANI)
(8 / 9)
ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఔటయ్యాయి. గుజరాత్ 13 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, ఏడు ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. 11 పాయింట్లతో (-0.063)తో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, 8 ఓడింది. 10 పాయింట్లతో (-.347) టేబుల్‍లో 9వ ప్లేస్‍లో ఉంది. ఈ జట్లకు లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉంది.
(9 / 9)
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయింది. 13 మ్యాచ్‍ల్లో నాలుగు మాత్రమే గెలిచిన హార్దిక్ పాండ్యా సేన 9సార్లు ఓటమి పాలైంది. దీంతో 8 పాయింట్లే (-0.271) ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో ప్రస్తుతం ఉంది. లీగ్ దశలో ముంబై మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఇతర గ్యాలరీలు