Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో జూనియర్ ఎన్టీఆర్, నాని.. లీకైన పాత్రల పేర్లు.. ఇదెక్కడి ట్విస్టు నాగ్ మామా!-jr ntr and nani prabhas kalki 2898 ad movie ntr as parasurama nani as krupacharya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jr Ntr And Nani Prabhas Kalki 2898 Ad Movie Ntr As Parasurama Nani As Krupacharya

Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో జూనియర్ ఎన్టీఆర్, నాని.. లీకైన పాత్రల పేర్లు.. ఇదెక్కడి ట్విస్టు నాగ్ మామా!

Sanjiv Kumar HT Telugu
Jan 31, 2024 12:33 PM IST

Jr NTR Nani In Kalki 2898 AD: కొన్ని వార్తలు వింటే అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం వస్తోంది. అలాంటిదే కల్కి 2898 మూవీ నటీనటుల వార్త. ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని నటిస్తున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ కల్కిలో జూనియర్ ఎన్టీఆర్, నాని.. లీకైన పాత్రల పేర్లు.. ఇదెక్కడి ట్విస్టు నాగ్ మామా!
ప్రభాస్ కల్కిలో జూనియర్ ఎన్టీఆర్, నాని.. లీకైన పాత్రల పేర్లు.. ఇదెక్కడి ట్విస్టు నాగ్ మామా!

Jr NTR Nani In Prabhas Movie: దర్శక దిగ్గజం రాజమౌళి చెక్కిన బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్. ఆ సినిమాల తర్వాత వరుసపెట్టి పాన్ ఇండియా మూవీసే చేశాడు ప్రభాస్. కానీ, అవి అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ వెంటనే చేసిన సినిమా సాహో. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబట్టింది. కానీ, టాక్ పరంగా నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.

బీభత్సంగా అంచనాలు

ఇక అనంతరం వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల రిజల్ట్ ఎలా ఉందో తెలిసిందే. గతేడాది విడుదలైన సలార్ మాత్రం ప్రభాస్ అభిమానులను సంతోషపెట్టింది. ఎన్నాళ్లకు డార్లింగ్ కటౌట్‌కు తగిన సినిమా వచ్చిందని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. దీని తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ దృష్టి అంతా కల్కి 2898 ఏడీపైనే ఉంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి చిత్రాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ నటిస్తున్నట్లు ప్రకటించారు.

కల్కి 2898 ఏడీ బడ్జెట్

కల్కి 2898 ఏడీ చిత్రాన్ని టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తుండగా సి. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణెతోపాటు సెక్సీ భామ దిశా పటానీ హీరోయిన్స్‌గా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. సుమారు రూ. 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

విజయ్-దుల్కర్ గెస్ట్ రోల్

కల్కి 2898 సినిమాలో అగ్ర తారలు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో కొందరు పాపులర్ హీరోలు గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కల్కిలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోలు అతిథి పాత్రల్లో మెరవనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి రూమర్స్ కాదని తాను నిజంగానే కల్కి 2898లో నటిస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ ప్రకటించినట్లు సమాచారం.

మూడు కాలాల్లో మూవీ

ఇప్పుడు కల్కి 2898 ఏడీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని నటిస్తున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కల్కి మూవీ సైన్స్ ఫిక్షన్ ఫిక్షన్ జోనర్‌కు సంబంధించిందని విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా భూత, వర్తమానం, భవిష్యత్ కాలాలకు సంబంధించిందని నెటిజన్స్ అనుకుంటున్నారు. అందుకే విజయ్, దుల్కర్‌తోపాటు ఎన్టీఆర్, నాని గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారని టాక్. కీలక పాత్రల్లో అలా వచ్చి ఇలా వెళ్తారంటూ జోరుగా చర్చ నడుస్తోంది.

తారక్, నాని పాత్రల పేర్లు

అంతేకాకుండా కల్కి 2898 ఏడీ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరశురాముడిగా, నాని కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది తెలిసి ఇదెక్కిడి ట్విస్ట్ నాగ్ మామా అని డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను అనుకుంటున్నారు నెటిజన్స్. ఇక అభిమానులతో ఇది నిజం కావాలని ఫుల్ ఎగ్జయింటింగ్‌తో ఉన్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం సిల్వర్ స్క్రీన్ ఒక రేంజ్‌లో షేక్ అవుతుందని మరికొందరి మాట. కాగా కల్కి 2898 ఏడీ మూవీ మే 9న విడుదల కానున్నట్లు సమాచారం.

WhatsApp channel