Deepika Padukone: పిల్లలను కనడంపై దీపికా పదుకొణె కామెంట్స్.. జవాన్ బ్యూటి ఏం చెప్పిందంటే?-deepika padukone reveals about became a mother and starting family with ranveer singh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone: పిల్లలను కనడంపై దీపికా పదుకొణె కామెంట్స్.. జవాన్ బ్యూటి ఏం చెప్పిందంటే?

Deepika Padukone: పిల్లలను కనడంపై దీపికా పదుకొణె కామెంట్స్.. జవాన్ బ్యూటి ఏం చెప్పిందంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 04, 2024 01:05 PM IST

Deepika Padukone About Become A Mother: జవాన్ బ్యూటి దీపికా పదుకొణెకు పిల్లలను కనడంపై ప్రశ్న ఎదురైంది. దానికి తనతోపాటు భర్త రణ్‌వీర్ సింగ్‌కు పిల్లలపై ఉన్న ప్రేమ గురించి చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

పిల్లలను కనడంపై దీపికా పదుకొణె కామెంట్స్.. జవాన్ బ్యూటి ఏం చెప్పిందంటే?
పిల్లలను కనడంపై దీపికా పదుకొణె కామెంట్స్.. జవాన్ బ్యూటి ఏం చెప్పిందంటే?

Deepika Padukone Ranveer Singh: హీరో రణ్ వీర్ సింగ్‌తో తాను కనబోయే పిల్లల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ తల్లిదండ్రులు తమను ఎలాంటి విలువలతో పెంచారో అలాగే తమకు పుట్టబోయే పిల్లలను సైతం పెంచాలి, పోషించాలని అనుకుంటున్నట్లు తెలిపింది బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె. తాజాగా వోగ్ సింగపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు ప్రకాశ్ పదుకొణె, ఉజ్జల పదుకొణె తన సోదరి అనీషా పదుకొణెను, తనను ఎలా పెంచారో వివరించింది.

అలాగే భర్త రణ్ వీర్‌తో తన సొంత కుటుంబాన్ని ప్రారంభించడం గురించి కూడా దీపికా పదుకొణె మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది దీపికా పదుకొణె. "నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తులైన నా అత్తలు, మామలు, కుటుంబ స్నేహితులు వంటివారిని కలిసినప్పుడు.. నేను కొంచెం కూడా మారలేదని ఎల్లప్పుడూ చెబుతారు. అది మన పెంపకం గురించి చాలా చెబుతుంది" అని దీపికా పదుకొణె తెలిపింది.

"ఈ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు, డబ్బుతో మోసపోవడం చాలా సులభం. కానీ ఇంట్లో నన్ను ఎవరూ సెలబ్రిటీలా ట్రీట్ చేయరు. నేను మొదట ఒక కుమార్తెను, ఒక సోదరిని. అది మారాలని నేను కోరుకోవడం లేదు. నా కుటుంబం నన్ను స్థిరంగా ఉంచుతుంది. రణ్ వీర్, నేను మా పిల్లలలో అదే విలువలను పెంపొందించాలని ఆశిస్తున్నాము" అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది.

"పదుకొణె తల్లి కావడం రణ్ వీర్ సింగ్‌కు ఇష్టమేనా" అని అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొణె సమాధానం ఇచ్చింది. "నాకు, రణ్ వీర్ సింగ్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. సొంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసం ఎదురు చూస్తున్నాం" అని దీపికా పదుకొణె తెలిపింది. అంటే త్వరలో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె జంట గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గత ఏడాది నవంబర్‌లో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బెల్జియం వెళ్లారు. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ గోలియోం కీ రాస్లీలా రామ్ లీలా సెట్స్‌లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో కూడా నటించారు.

త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'కల్కి 2898 ఏడీ' అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సరసన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఫైటర్ సినిమాలో దీపికా చేస్తోంది. ఈ ఫైటర్ మూవీ 2024 జనవరి 25న విడుదల కానుంది. ఇందులో చాలా ఘాటుగా దీపికా పదుకొణె కనిపించింది. ఇప్పటికే ఫైటర్ మూవీలోని పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

అంతేకాకుండా బాలీవుడ్ యాక్షన్ అండ్ కామెడీ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ దీపికా పదుకొణె నటిస్తోంది. ఈ యాక్షన్ సినిమాలో రణ్ వీర్ కూడా కనిపించనున్నాడు. సింగం ఫ్రాంచైజీలో తొలిసారిగా లేడి ఒరియెంటెడ్ సినిమాగా సింగం ఎగైన్ రానుంది. కాగా ఇటీవల షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ అందుకుంది ఈ బ్యూటి దీపికా పదుకొణె.