Mahesh Babu: రాజమౌళి సినిమాకు 1000 కోట్ల బడ్జెట్.. ఒక్క రూపాయి తీసుకోని మహేశ్ బాబు.. ఎందుకంటే?-mahesh babu not taking remuneration for rajamouli ssmb29 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: రాజమౌళి సినిమాకు 1000 కోట్ల బడ్జెట్.. ఒక్క రూపాయి తీసుకోని మహేశ్ బాబు.. ఎందుకంటే?

Mahesh Babu: రాజమౌళి సినిమాకు 1000 కోట్ల బడ్జెట్.. ఒక్క రూపాయి తీసుకోని మహేశ్ బాబు.. ఎందుకంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 29, 2024 01:24 PM IST

Mahesh Babu Remuneration For SSMB 29: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ SSMB 29 సినిమాకు మహేశ్ బాబు ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోవట్లేదని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అందుకు గల కారణం ఏంటనే విషయంలోకి వెళితే..

రాజమౌళి సినిమాకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని మహేశ్ బాబు.. ఎందుకంటే?
రాజమౌళి సినిమాకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని మహేశ్ బాబు.. ఎందుకంటే?

Mahesh Babu Remuneration For Rajamouli Movie: ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదట నెగెటివ్ టాక్ అందుకుంది. అనంతరం ఈవెనింగ్ షోస్ పూర్తయ్యేసరికి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది సినిమా అస్సలు బాగోలేదంటే మరికొంతమంది ఫ్యామిలీ ఒరియెంటెడ్ మూవీ అని కితాబు ఇచ్చారు.

250 కోట్లకుపైగా

ఇక రెండు మూడు రోజులకు గుంటూరు కారం సినిమా బాగుందని, హిట్ టాక్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ మార్క్ స్టైల్‌లో లేదని, సాదాసీదాగా ఉందని చాలామంది ఆడియెన్స్ అసహనం వ్యక్తం చేశారు. కానీ, టాక్‌తో సంబంధం లేకుండా గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయింది. మహేశ్ బాబు మేనియాతో ఇప్పటికే రూ. 250 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.

హనుమాన్ పాత్రతో

ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న SSMB 29 మూవీపై ఆసక్తి నెలకొంది. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఓకే అయినప్పటి నుంచి క్రేజీ బజ్ క్రియేట్ అయింది. ఇది కాకుండా ఈ సినిమాను మోస్ట్ హిట్ హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నట్లు టాక్ రాగానే మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో హనుమాన్ పాత్రకు సంబంధించి కథ ఉంటుందని ఓ న్యూస్ కూడా లీక్ అయింది.

ఒక్క రూపాయి కూడా

ఇదిలా ఉంటే సాధారణంగా ఒక సినిమాకు మహేశ్ బాబు రూ. 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటాడు. అలాంటిది రాజమౌళి సినిమాకు ఇంకా ఎక్కువ పారితోషికం అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, అందుకు భిన్నంగా రాజమౌళి సినిమాకు మహేశ్ బాబు ఒక్క రూపాయి కూడా పారితోషికం అందుకోవట్లేదని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పారితోషికం కాకుండా

ఎస్ఎస్ఎంబీ 29 సినిమాకు మహేశ్ బాబు పారితోషికం తీసుకోవట్లేదట. కానీ, సినిమాకు వచ్చే లాభాల్లో వాటా తీసుకోనున్నాడని ఓ టాక్ జోరుగా నడుస్తోంది. మహేశ్ బాబు మాత్రమే కాకుండా రాజమౌళి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకోనున్నారట. ఇలా చూసుకుంటే పారితోషికం కంటే లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

వెయ్యి కోట్ల బడ్జెట్

ఈ విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. కాగా రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను సుమారుగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి అయిందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ అప్డేట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కోసం మహేశ్ బాబు జర్మనీ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రీ ప్రొడక్షన్ పనులు

ఇలా రోజుకో అప్డేట్‌తో ఎస్ఎస్ఎంబీ 29 మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీలో హీరోయన్స్ ఎవరనే విషయంపై చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Whats_app_banner