Tamanna Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాపై తమన్నా విమర్శలు.. పెద్ద తప్పు అంటూ!
Tamanna Comments On Vijay Movie: దక్షిణాది మిల్కీ సుందరి తమన్నా ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే, హైదరబాద్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్ ద్వారా హైలెట్ అవుతోంది. అయితే, తమిళ దళపతి విజయ్ సినిమాపై కామెంట్స్ చేసిన తమన్నా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
Tamanna Criticise Vijay Film: దక్షిణ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటి 19 ఏళ్లుగా దక్షిణ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. ప్రస్తుతం సౌత్‌తోపాటు నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో కూడా తెగ బిజీగా ఉంది. ఇటీవలే జైలర్, భోళా శంకర్ మూవీస్‍తోపాటు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, ఆఖరీ సచ్ వెబ్ సిరీసులతో నెట్టింట్లో బీభత్సంగా వైరల్ అయింది.
అలాగే, యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma)తో తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న వీళ్లు ఒక్కటిగా కలిసి ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కారు. దాంతో వాళ్లు లవ్ చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు కన్ఫర్మ్ అయింది. అయితే తమన్నా, విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నా వాటిపై ఈ ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇలా తమన్నా తరచుగా హైలెట్ అవతూనే ఉంది.
తాజాగా మరోసారి తమన్నా వార్తల్లో నిలిచింది. ఈసారి తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ సినిమాపై కామెంట్స్ చేసింది తమన్నా. దాంతో తమన్నా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, సాధారణంగా సినిమా విజయానికి ఎన్ని అంశాలు ఉంటాయో.. అలాగే ఫ్లాప్ అవ్వడానికి సవా లక్ష కారణాలు ఉంటాయి. సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ ఊహించలేం. ఏ సినిమాల ఎలా ఫ్లాప్ అవుతుందో చెప్పలేం. హిట్ అవుతుందో ఊహించలేం.
అలాగే, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సురా అనే మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరా పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్‌లో 50వ మూవీ కావడం మరింత ఆసక్తికర విషయం. ఈ సురా అనే సినిమాలో విజయ్‍కు జోడీగా తమన్నా హీరోయిన్‌గా నటించింది. మొదట్లో విజయ్ పక్కన నటించేందుకు అవకాశం వచ్చినందుకు తెగ సంబరపడిపోయిన తమన్నా ఈ మూవీ ఫ్లాప్ కావడంతో చాలా నిరాశచెందినట్లు తెలుస్తోంది.
విజయ్ మూవీ రిలీజ్‌కు ఇన్నేళ్ల తర్వాత సురాపై విమర్శలు గుప్పించింది తమన్నా. అదొక చిత్రమా అంటూ హేళన చేసి మాట్లాడింది తమ్ము. సురా సినిమాలో నటించి తాను పెద్ద తప్పు చేశానని ఇప్పుడు తెలిపింది తమన్నా భాటియా. సురా మూవీ వర్కౌట్ కాదన్న విషయాన్ని తాను ముందే గ్రహించినట్లు, అయినా అందులో నటించాల్సిన పరిస్థితి అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే, సురా సినిమా తనకు నచ్చినట్లు, కొన్ని సీన్స్ అస్సలు బాగోలేవని, సాంగ్స్ మాత్రం హిట్ అయ్యాయని, తాను చేసిన చెత్త సినిమాల్లో అదొకటని తమన్నా చెప్పినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.
ఇప్పుడు తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి విజయ్ అభిమానులు తమన్నా కామెంట్స్‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన తమన్నా తమిళంలో విజయ్‌తోపాటు అనేక అగ్ర హీరోలతో జోడీ కట్టి నటించింది. వారిలో సూర్య, అజిత్, ధనుష్, కార్తీ ఉన్నారు. ఇక ఇటీవల జైలర్ మూవీలో రజనీకాంత్‌తో నటించిన విషయం తెలిసిందే. ఇందులో మూవీ హీరోయిన్‌గా కేవలం ఒకే పాటలో మెరిసిన తమన్నాకు బాగానే పేరు వచ్చింది. కావాలాయ్యా అనే పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే.