Tamanna Vijay Varma: తమన్నాతో విజయ్ వర్మ పెళ్లి.. హీరో రియాక్షన్ ఇదే.. వాళ్ల అమ్మ పేరు లాగుతూ!-vijay varma witty reaction on marriage with tamannaah question tamannaah vijay varma marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Varma Witty Reaction On Marriage With Tamannaah Question Tamannaah Vijay Varma Marriage

Tamanna Vijay Varma: తమన్నాతో విజయ్ వర్మ పెళ్లి.. హీరో రియాక్షన్ ఇదే.. వాళ్ల అమ్మ పేరు లాగుతూ!

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2024 11:00 AM IST

Vijay Varma Reply To Marriage With Tamannaah: సినీ ఇండస్ట్రీలో లవ్ ట్రాక్స్, ఫారెన్ వెకేషన్స్ బాలీవుడ్‍లో సర్వసాధారణం. అయితే సెలబ్రిటీలు ఎలాంటి రిలేషన్స్ లో ఉన్నా కొన్ని ప్రశ్నలకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. దాంతో వాళ్లు ఏం చేస్తారో ఊహించలేం. అలా తాజాగా విజయ్ వర్మ చేసిన పని వైరల్ అవుతోంది.

తమన్నాతో విజయ్ వర్మ పెళ్లి.. హీరో రియాక్షన్ ఇదే.. వాళ్ల అమ్మ పేరు లాగుతూ!
తమన్నాతో విజయ్ వర్మ పెళ్లి.. హీరో రియాక్షన్ ఇదే.. వాళ్ల అమ్మ పేరు లాగుతూ!

Tamannaah Vijay Varma Marriage: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). హ్యాపీడేస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటి 19 ఏళ్లుగా దక్షిణ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. ప్రస్తుతం సౌత్‌తోపాటు నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో కూడా తెగ బిజీగా ఉంది. ఇటీవలే జైలర్, భోళా శంకర్ మూవీస్‍తోపాటు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, ఆఖరీ సచ్ వెబ్ సిరీసులతో తెగ ట్రెండ్ అయింది.

ఇదిలా ఉంటే తమన్నా, యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma) ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న వీళ్లు ఒక్కటిగా కలిసి ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కారు. దాంతో వాళ్లు లవ్ చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు అయింది. అయితే తమన్నా, విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి వార్తలపై తమన్నా, విజయ్ వర్మలు కూడా తమదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ వస్తున్నారు.

తాజాగా మరోసారి విజయ్ వర్మ పెళ్లి ప్రశ్నలపై చమత్కారంగా స్పందించాడు. తాజాగా విజయ్ వర్మ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్‌లో యాస్క్ మి సెషన్ నిర్వహించాడు. ఇందులో ఓ వ్యక్తి "కబ్ షాదీ కర్రే" (పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు) అని అడిగాడు. దానికి విజయ్ వర్మ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. "ఇప్పటికే మా అమ్మను మా మేనకోడలు ప్రశ్నలు అడుగుతోంది. ఈ ప్రశ్నను నేను పదే పదే హైదరాబాద్‌లో కూడా విన్నాను" అని రెడ్ ఎమోజీతో ఆన్సర్ ఇచ్చాడు విజయ్ వర్మ.

ఇలా పెళ్లిపై సమాధానం చెప్పకుండా ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయని తెలివిగా తప్పించుకున్నాడు విజయ్ వర్మ. దీంతో అభిమానులకు మరోసారి ఆశ్చర్యార్థకమైన ఆన్సర్సే లభించాయి తప్పా తమన్నా, విజయ్ వర్మ పెళ్లిపై మాత్రం క్లారిటీ రాలేదు. "భాయ్ మీరు జిమ్‌కు వెళ్తారా?" అని మరొకరు అడిగితే.. "ఏదైన సినిమా కోసం అవసరం అయితే జిమ్‌కు వెళ్తాను. లేకుంటే నేను యోగా చేయడానికి ఇష్టపడతాను" అని రిప్లై ఇచ్చాడు విజయ్ వర్మ.

మరోసారి ఇలా తమన్నా విజయ్ వర్మ పెళ్లి వార్తలు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా హైదరాబాద్‌కు చెందిన విజయ్ వర్మ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యాడు. హిందీలో చాలా వరకు హిట్ సిరీసుల్లో నటించాడు. విజయ్ తమన్నా కలిసి లస్ట్ స్టోరీస్ 2లో ఘాటు రొమాన్స్ పండించారు. ప్రస్తుతం డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న సూర్య 43వ చిత్రంలో విజయ్ వర్మ కీలక పాత్ర చేస్తున్నాడు.

అలాగే ఉల్ జలూల్ ఇష్క్‌ సినిమాతో కూడా విజయ్ వర్మ బిజీగా ఉన్నాడు. మరోవైపు తమన్నా ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలతో పాటు ఓ హిందీ మూవీలో నటిస్తోంది. వాటిలో అరుణమని 2, వేద, స్త్రీ 2, భోలే చూడియన్, పోన్ ఒండ్రు కందెన చిత్రాలున్నాయి. ఇవే కాకుండా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ కామెడీ వెబ్ సిరీస్ చేస్తోంది తమన్నా. దీనికి డాక్టర్ అరోరా, తోడా అడ్జస్ట్ ప్లీజ్, సేపియా వంటి సిరీస్ డైరెక్టర్ చేసిన అర్చిత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

తమన్నాతో విజయ్ వర్మ పెళ్లి.. హీరో రియాక్షన్ ఇదే.. వాళ్ల అమ్మ పేరు లాగుతూ!
తమన్నాతో విజయ్ వర్మ పెళ్లి.. హీరో రియాక్షన్ ఇదే.. వాళ్ల అమ్మ పేరు లాగుతూ!
IPL_Entry_Point