Car accident : ఎనిమిది సార్లు పల్టీ కొట్టిన కారు- కూల్‌గా దిగి ‘టీ’ అడిగిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
Rajasthan car accident viral video : రాజస్థాన్‌లో ఓ కారు ఎనిమిది సార్లు పల్టీ కొట్టి, చివరికి ఓ వెహికిల్ షోరూం గేట్‌ని ఢీకొట్టింది. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత, కారులోని ప్రయాణికులు.. షోరూం లోపలికి వెళ్లి ‘టీ’ కావాలని అడిగారు!
రాజస్థాన్‌లో జరిగిన ఓ కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కరు 8సార్లు పల్టీ కొట్టింది! ఆ తర్వాత, లోపలున్న ప్రయాణికులు కూల్‌గా కారు దిగి, 'టీ' తాగాలని అనుకున్నారు!
ఇదీ జరిగింది..
నాగౌర్ జిల్లాలోని ఓ హైవేపై శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మీడియా కథనాల ప్రకారం ప్రమాదం సమయంలో ఎస్‌యూవీలో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. హైవేపై వేగంగా వెళ్తున్నప్పుడు, డ్రైవర్ టర్న్ తీసుకుంటుండగా వెహికిల్ అదుపుతప్పి బోల్తా పడింది. క్షణాల్లో కారు ఎనిమిదిసార్లు పల్టీలు కొట్టింది. చివరికి అక్కడే ఉన్న ఒక కారు షోరూం ఎదుట ఆగింది. చుట్టూ శిథిలాలు చెల్లాచెదురుగా పడివున్న స్థితిలో వాహనం మిగిలిపోయింది.
ప్రమాదం తీవ్రత ఉన్నప్పటికీ ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. షోరూం ముందు తలకిందులుగా ఉన్న కారును అక్కడి దృశ్యాలు చూపిస్తున్నాయి. ఇది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చెబుతోంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి..
కూల్‌గా దిగి 'టీ' అడిగారు..!
వాహనం పల్టీలు కొడుతుండగానే డ్రైవర్ కిందకి దూకేయగలిగాడు. కారు ఆగిన తర్వాత మిగిలిన నలుగురు ప్రయాణికులు బయటకు వచ్చారు.
ఆ తర్వాత.. వారందరు కారు షోరూంలోకి వెళ్లి ‘టీ’ కావాలని అడిగారు!
"ఎవరికీ గాయాలు కాలేదు. ఒక్క స్క్రాచ్ కూడా లేదు. లోపలికి వెళ్లగానే టీ కావాలని అడిగారు,' అని షోరూంకు చెందిన సిబ్బంది తెలిపారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు తేలికగా స్పందించడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది.
నాగౌర్ నుంచి బికనీర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రమాదానికి అతివేగం ప్రధాన కారణం అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
సజీవదహనం..
ఇదే రాజస్థాన్‌లో కొన్ని రోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైపూర్‌లోని అజ్మీర్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు వద్ద ఓ ట్రక్, కెమికల్స్ ఉన్న ట్యాంకర్ని ఢీకొనడంతో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో మరో 36 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ పక్కనే ఉన్న పైపు ఫ్యాక్టరీ, పెట్రోల్ బంకుతో సహా ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయని, మరో 20 సీఎన్జీ కార్లు, ఒక స్లీపర్ బస్సు సహా 40 వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం