How to Prepare For Exams : పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. సింపుల్ టిప్స్ ఇవిగో!-how to prepare to achieve good results in 10th class and intermediate exams ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  How To Prepare For Exams : పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. సింపుల్ టిప్స్ ఇవిగో!

How to Prepare For Exams : పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. సింపుల్ టిప్స్ ఇవిగో!

Dec 22, 2024, 12:35 PM IST Basani Shiva Kumar
Dec 22, 2024, 12:35 PM , IST

  • How to Prepare For Exams : తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల కాలం మొదలైంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకొని, ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటికి సమాధానాలు ఇవి.

How to Prepare For Exams : తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల కాలం మొదలైంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమయంలో ఒత్తడి తగ్గించుకొని, ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటికి సమాధానాలు ఇవి.

(1 / 6)

How to Prepare For Exams : తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల కాలం మొదలైంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమయంలో ఒత్తడి తగ్గించుకొని, ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటికి సమాధానాలు ఇవి.(istockphoto)

ఫలితాలపై ఆందోళన చెందకుండా ప్రయత్నంపైనే దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చే అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా చదివి అర్థం చేసుకున్నాకే సమాధానం రాయాలని చెబుతున్నారు.

(2 / 6)

ఫలితాలపై ఆందోళన చెందకుండా ప్రయత్నంపైనే దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చే అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా చదివి అర్థం చేసుకున్నాకే సమాధానం రాయాలని చెబుతున్నారు.(istockphoto)

రోజూ చదవటానికి నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. రివిజన్ చాలా ముఖ్యం. ఒత్తిడి, భయం ఉన్నప్పుడు పేరెంట్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. మానసిక ఆరోగ్యం కోసం సన్నిహితులతో కాసేపు గడపాలి.

(3 / 6)

రోజూ చదవటానికి నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. రివిజన్ చాలా ముఖ్యం. ఒత్తిడి, భయం ఉన్నప్పుడు పేరెంట్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. మానసిక ఆరోగ్యం కోసం సన్నిహితులతో కాసేపు గడపాలి.(istockphoto)

పరీక్షల ముందే అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏకధాటిగా చదవటం కంటే ప్రతి గంటకు 5-10 నిమిషాలు విరామం తీసుకోవటం మంచిది. ఎక్కువ టెస్టు పేపర్స్‌ సాధన చేస్తే విశ్వాసం పెరుగుతుంది. సందేహాలుంటే టీచర్లను అడిగి నివృత్తి చేసుకోవాలి. గ్రూప్ స్టడీతో సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.  సిలబస్‌లోని ముఖ్యాంశాలు, ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపుపై దృష్టిసారించాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.

(4 / 6)

పరీక్షల ముందే అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏకధాటిగా చదవటం కంటే ప్రతి గంటకు 5-10 నిమిషాలు విరామం తీసుకోవటం మంచిది. ఎక్కువ టెస్టు పేపర్స్‌ సాధన చేస్తే విశ్వాసం పెరుగుతుంది. సందేహాలుంటే టీచర్లను అడిగి నివృత్తి చేసుకోవాలి. గ్రూప్ స్టడీతో సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.  సిలబస్‌లోని ముఖ్యాంశాలు, ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపుపై దృష్టిసారించాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.(istockphoto)

పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. శక్తి, ఏకాగ్రత కోసం ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తినాలి. జంక్‌ ఫుడ్, అధిక మసాలాలు కలిగిన ఆహారానికి దూరంగా ఉండాలి. నీటిని సరిపడా తాగాలి.

(5 / 6)

పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. శక్తి, ఏకాగ్రత కోసం ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తినాలి. జంక్‌ ఫుడ్, అధిక మసాలాలు కలిగిన ఆహారానికి దూరంగా ఉండాలి. నీటిని సరిపడా తాగాలి.(istockphoto)

రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రలేమితో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మందగిస్తుంది. పరీక్షల సమయంలో వ్యాయామాలు చేయటం మంచిది. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. 

(6 / 6)

రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రలేమితో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మందగిస్తుంది. పరీక్షల సమయంలో వ్యాయామాలు చేయటం మంచిది. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. (istockphoto)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు