Annamayya Gun Fire : అన్నమయ్య జిల్లాలో పాత సామాన్ల వ్యాపారులపై కాల్పులు-ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Annamayya Gun Fire : అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లాలోని మాధవరంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Annamayya Gun Fire : అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాయచోటి మండలం మాధవరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో హనుమంతు అనే వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో వ్యక్తి రమణ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పాత సామాన్ల వ్యాపారులపై ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున వ్యాపారానికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు సడెన్ వచ్చి దాడి చేసిటన్లు బాధితుడు రమణ తెలిపారు. బుల్లెట్‌లు తగిలాయని, గాయాలతోనే ఇంటికి పరుగులు తీశామని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు తమను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. తమకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవన్నారు బాధితుడు రమణ చెప్పారు.
పోలీసుల దర్యాప్తు
మాధవరం కాల్పుల ఘటనపై బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. బుల్లెట్ గాయాలతో ఇంటికి వచ్చిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పటికే ఒకరు మృతి చెందారని, మరొకరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందన్నారు బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితులు ఇంటి సమీపంలోని వారిని విచారించారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తు్న్నామన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయన్నారు.
రాళ్లతో కొట్టి హత్య
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం మమ్మిడిగుండ్లపల్లెకు చెందిన సోమశేఖర్‌రెడ్డి (36) అనే వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా పరిధిలో సోమశేఖర్ రెడ్డిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరు సీఐ శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు...సోమశేఖర్‌రెడ్డిని 20 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు..చిత్తూరు జిల్లా బోయకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో తీసుకెళ్లారు. అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు. శుక్రవారం రాత్రి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు.
మృతుడి వద్ద దొరికిన సమాచారంతో అతడు మదనపల్లె మండలం మమ్మిడిగుండ్లపల్లెకి చెందిన సోమశేఖర్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. శవానికి అటవీలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు...దర్యాప్తు చేపట్టారు.త్వరలోనే హంతకులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. మృతుడి భార్య, పిల్లలు మృతి చెందిన కేసులో మదనపల్లె పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారని సమాచారం. కొడుకు సోమశేఖర్‌రెడ్డి ప్రవర్తన నచ్చని తండ్రి గంగులరెడ్డి ఈ హత్య చేయించినట్లు స్థానికంగా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం