Okra Water: ముప్పై ఏళ్లు దాటిన మగాళ్లు ఈ డ్రింక్ తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయట!-boost your health with the powerful benefits of okra water for men over 30 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Okra Water: ముప్పై ఏళ్లు దాటిన మగాళ్లు ఈ డ్రింక్ తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయట!

Okra Water: ముప్పై ఏళ్లు దాటిన మగాళ్లు ఈ డ్రింక్ తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయట!

Ramya Sri Marka HT Telugu
Dec 22, 2024 03:31 PM IST

Okra Water: మగాడి జీవితం ముప్పై ఏళ్ల తర్వాతే మొదలవుతుందని చాలా పాతకాలం నాటి మాట. ఇప్పుడు అదే ముప్పై ఏళ్ల తర్వాత ఆడ, మగ తేడా లేకుండా హెల్త్ కండీషన్లు దాదాపు వీక్ అయిపోతున్నాయి. ఇలాంటప్పుడు సహజ పద్ధతిలో దొరికే డ్రింక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. వాటిల్లో ఒకటి ఈ ఓక్రా వాటర్.

ముప్పై ఏళ్లు దాటిన మగాళ్లు ఈ డ్రింక్ తాగితే..
ముప్పై ఏళ్లు దాటిన మగాళ్లు ఈ డ్రింక్ తాగితే..

ఓక్రా వాటర్ అనేది మగాళ్లకు ఒక దివ్య ఔషదం లాంటిది. ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలను సమకూర్చే ఈ ఓక్రా వాటర్ తాగిన తర్వాత ఇదొక గేమ్ ఛేంజర్ అవడం ఖాయం. 30 నాటి తరువాత పురుషులు ఆరోగ్యంగా ఉండటానికి శరీరాన్ని బలపరచడం చాలా ముఖ్యం. ఓక్రానీరు, ప్రతిరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, ఎముకల బలాన్ని పెంచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది సహజమైన, ఆరోగ్యకరమైన మార్గం, దీనిని మీరు రోజువారీ ఆహారంలో చేర్చుకుని అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

యాంటీ డయాబెటిక్ గుణాలు:

ప్రస్తుత జనరేషన్ లో తరచుగా వింటున్న విషయం డయాబెటిక్. ముప్పై దాటిన మగాళ్లలో ఇదెక్కువగా కనిపిస్తుంది. అటువంటి వారికి కూడా ఈ ఓక్రా వాటర్ తాగడం వల్ల పరిష్కారం దొరుకుతుంది. ఇందులో ఉండే కరిగిపోయే ఫైబర్ పేగులలో ఉన్న షుగర్ శోషించకుండా చూసుకుంటుంది. ఫలితంగా రక్తంలో ఉండే షుగర్‌ను క్రమబద్దీకరిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు ఈ వాటర్ తాగిన తర్వాత లబ్ధి పొందారని స్టడీలు చెబుతున్నాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచగలిగే ఈ వాటర్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసర్లేదు. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఓక్రా వాటర్ తీసుకుంటే సరిపోతుంది.

అజీర్ణ సమస్యల నివారణ:

వయస్సు పెరుగుతున్న కొద్దీ కనిపించే అజీర్ణ సమస్యలు పొట్ట ఉబ్బరం, మలబద్దకం, అరుగుదల లేకపోవడం వంటివి. అలాంటి వారు ఓక్రా వాటర్ తీసుకోవడం వల్ల అందులో ఉండే మ్యూసిలేజ్ జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. సుఖవంతమైన మల విసర్జన కలిగి మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఇంకా దీని కారణంగా అరుగుదల లోపాలు కూడా తీరిపోతాయి. జీర్ణక్రియను పూర్తిగా మెరుగుపరిచి ఆరోగ్యవంతమైన జీవనవిధానానికి కారణమవుతుంది.

ఇమ్యూనిటీ పెంచే ఓక్రా వాటర్:

విటమిన్ C, ఫ్లావనోయిడ్స్ వంటి పౌష్టికాలు, ఆంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది ఈ ఓక్రా వాటర్. ఇవి మన శరీరంలో ప్రతిరక్షణ వ్యవస్థను బలోపేతం చేసి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా మన రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. 30 ఏళ్ళ తరువాత పురుషులలో, ప్రతి రోజు ఓక్రా నీటిని తాగడం ద్వారా వారి శరీరం సహజంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి వారు జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షణ పొందగలుగుతారు.

గుండె ఆరోగ్యానికి మంచిది:

గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా హై బ్లడ్ ప్రెజర్, గుండెపోటు ప్రమాదం లాంటి వాటి నుంచి ఓక్రా నీరు కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల LDL (బ్యాడ్ చోలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, హై-ఫైబర్ డైట్ గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని నిరూపించారు. అంతేకాకుండా, ఓక్రాలోని ఆంటీ ఆక్సిడెంట్స్ సిరల్లో అడ్డంకులు అడ్డుకుంటాయి. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ నుండి మనలను కాపాడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది:

వయస్సు పెరిగేకొద్దీ ఎవరిలోనైనా ఎముకల పటుత్వం తగ్గిపోతుంది. ఎముకల బలహీనతతో పాటుగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓక్రానీరు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K వంటి కీలక పోషకాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. ఈ పోషకాలను రెగ్యులర్‌గా తీసుకుంటే, పురుషులు ఎముకల బలాన్ని పెంచుకోవడంతో పాటు ఎముకల సంబంధిత వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

ఓక్రా వాటర్ (ఓక్రా నీటిని) తయారుచేసుకునే విధానం:

ఓక్రానీరు తయారు చేయడం చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ అవసరం లేకుండా మీరే రెడీ చేసుకోవచ్చు.

పదార్థాలు: 4-5 తాజా బెండకాయలు.

తయారీ విధానం:

1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఆ తర్వాత తుడిచి ఆరబెట్టండి.

2. ఆ తర్వాత, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయండి.

3. ఈ ముక్కలను నీటిలో రాత్రంతా నానపెట్టండి.

4. ఉదయం ఆ నీటి నుంచి బెండకాయ ముక్కలను తీసేయండి.

5. ఇప్పుడు, ఓక్రానీరు మీరు తాగడానికి సిద్ధంగా ఉంటుంది.

ఉత్తమ ఫలితాల కోసం, ఈ నీటిని భోజనానికి ముందు తీసుకోవడం మంచిది. మొదట చిన్న మోతాదులో ప్రారంభించి, తర్వాత దానిని అధిక పరిమాణానికి పెంచుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం