Scooters For Wife : మీ భార్యకు కొత్త స్కూటీ గిఫ్ట్‌గా ఇవ్వాలని చూస్తే.. వీటిపై ఓ లుక్కేయండి-best scooters to gift for your wife honda activa 6g hero xoom and tvs scooty zest more details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Scooters For Wife : మీ భార్యకు కొత్త స్కూటీ గిఫ్ట్‌గా ఇవ్వాలని చూస్తే.. వీటిపై ఓ లుక్కేయండి

Scooters For Wife : మీ భార్యకు కొత్త స్కూటీ గిఫ్ట్‌గా ఇవ్వాలని చూస్తే.. వీటిపై ఓ లుక్కేయండి

Anand Sai HT Telugu
Dec 22, 2024 02:30 PM IST

Best Scooters : ఇటీవల మహిళలు స్కూటీలను ఎక్కువగా నడపడం కనిపిస్తుంది. ఇంట్లో చాలా పనులకు వారికి స్కూటర్ ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ భార్యకు స్కూటీ ఇవ్వాలని అనుకుంటే.. లిస్టులో కొన్ని ఉన్నాయి.. చూసేయండి..

హోండా యాక్టివా
హోండా యాక్టివా

మహిళలకు స్కూటీ ఉంటే ఇంట్లో చాలా పనులకు వాడుకుంటారు. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడం, మార్కెట్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. బైకులు పురుషులకు కంఫర్ట్‌‌గా ఉంటాయి. స్కూటీలకు మహిళలు డ్రైవింగ్ చేసేందుకు బాగుంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుతారు. రోజువారీ వినియోగానికి టూ వీలర్ అవసరం. మీరు కూడా మీ భార్యకు కొత్త స్కూటర్ కొనివ్వాలనుకుంటే.. మీ కోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి స్కూటర్ గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుందో చూద్దాం.. వారి వివరాలు తెలుసుకుందాం..

హోండా యాక్టివా

హోండా యాక్టివా చాలా ఫేమస్ స్కూటీ. హోండా యాక్టివా 6జీ ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.76,684 నుండి రూ.82,684 వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 7.84 PS హార్స్ పవర్, 8.90 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 109.51 cc పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. యాక్టివా 6జీ డీసెంట్ బ్లూ మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ, బ్లాక్, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి వివిధ కలర్ ఆప్షన్స్‌లో దొరుకుతుంది. ఇది పూర్తి అనలాగ్ కన్సోల్, ఏసీజీ స్టార్టర్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

హీరో జూమ్

హీరో జూమ్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.71,484 నుండి రూ.80,967 మధ్య ఉంటుంది. ఇది 110.9 cc పెట్రోల్ ఇంజన్‌తో 8.15 పీఎస్ హార్స్ పవర్, 8.70 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. హీరో జూమ్ స్కూటర్ పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌ ఉంటుంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ గురించి చూస్తే.. దీని ధర రూ.74,676 నుండి రూ.76,439 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇందులో 109.7 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 7.8 పీఎస్ హార్స్ పవర్, 8.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటీ జెస్ట్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్‌తో సహా వివిధ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఇది 103 కిలోల బరువు, 5 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్‌తో ఉంటుంది.

Whats_app_banner