Electric scooter : సెల్ఫీ కొట్టు- 24 క్యారెట్​ ఓలా ఎస్​1 ప్రో ‘సోనా’ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పట్టు!-ola s1 pro sona limited edition announced brings 24karat gold to electric scooter for lucky winners ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : సెల్ఫీ కొట్టు- 24 క్యారెట్​ ఓలా ఎస్​1 ప్రో ‘సోనా’ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పట్టు!

Electric scooter : సెల్ఫీ కొట్టు- 24 క్యారెట్​ ఓలా ఎస్​1 ప్రో ‘సోనా’ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పట్టు!

Sharath Chitturi HT Telugu
Dec 22, 2024 06:11 AM IST

Ola S1 Pro Sona : ఓలా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్​ని సంస్థ ప్రకటించింది. సెల్ఫీ తీసుకుని #OlaSonaContest పాల్గొనే వారికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ గివ్​-అవేగా ఇస్తోంది. పూర్తి వివరాలు..

ఓలా ఎస్​1 ప్రో సోనా ఎడిషన్​ ఇదే..
ఓలా ఎస్​1 ప్రో సోనా ఎడిషన్​ ఇదే..

దేశంలో లీడింగ్​ 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​ సరికొత్త ప్రకటన చేసింది. ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్​ని తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో 24 క్యారెట్ల ప్యూర్ ఎలిమెంట్స్​ ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓలా ఎస్1 ప్రో సోనా ఎడిషన్: ఏంటి?

సేల్స్​ పెంచుకునేందుకు నూతన మార్కెటింగ్​ క్యాంపైన్​ని ఓలా ఎలక్ట్రిక్​ రన్​ చేస్తోంది. ఇందులో భాగంగానే ఓలా ఎస్​1 ప్రో సోనా ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసింది. అంతేకాకుండా, సేవల నెట్​వర్క్​ని డిసెంబర్ 25, 2024 నాటికి 4000 ఔట్​లెట్స్​కి విస్తరించనున్నట్టు తెలిపింది.

ఓలా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్​తో పర్ల్ వైట్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. ఈ-స్కూటర్ డార్క్​ బ్రైట్​ నాపా లెదర్​లో జరీ థ్రెడ్ ఉపయోగించి గోల్డ్ థ్రెడ్ కుట్టడంతో ప్రీమియం సీటును పొందుతుంది.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్​లో మరింత పర్సనలైజ్​డ్​ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్​వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్​ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్​బోర్డ్​ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్​డ్​ చేసుకునేందుకు, మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఉన్నాయి.

"ఈ హాలిడే సీజన్​లో ఓలా ఎస్1 ప్రో సోనా ఎలక్ట్రిక్​ స్కూటర్​ని పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. ఇది సృజనాత్మకత, ప్రత్యేకతకు సంబంధించిన పరిపూర్ణ సమ్మేళనం. బీస్పోక్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో, ఎస్ 1ప్రో సోనా పండుగ, వేడుకకు నిజమైన చిహ్నం. మా లిమిటెడ్ ఎడిషన్ సోనా స్కూటర్​తో ఈ సీజన్​ని నిజంగా మరచిపోలేనిదిగా మార్చే అవకాశాన్ని మా కస్టమర్లకు అందించడానికి మేము గర్విస్తున్నాము," అని ఓలా ప్రతినిధి చెప్పారు.

ఇలా సొంతం చేసుకోవచ్చు..

క్యాంపైన్​లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్​ను గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. పాల్గొనేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక చిత్రం / సెల్ఫీని క్లిక్ చేయాలి. #OlaSonaContest అనే హ్యాష్​ట్యాగ్​తో ఓలా ఎలక్ట్రిక్​ను ట్యాగ్ చేయాలి. లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్​ని గెలుచుకునే అవకాశం పొందొచ్చు. డిసెంబర్ 25 న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం