Weekly Horoscope: ఈ వారం వారఫలాలు: ఈ వారం ఈ రాశుల వారి పనులు సకాలంలో పూర్తవుతాయి.. శుభవార్తలు వింటారు-weekly horoscope these rasis will get more benefits works will complete on time and listen to good news this week ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం వారఫలాలు: ఈ వారం ఈ రాశుల వారి పనులు సకాలంలో పూర్తవుతాయి.. శుభవార్తలు వింటారు

Weekly Horoscope: ఈ వారం వారఫలాలు: ఈ వారం ఈ రాశుల వారి పనులు సకాలంలో పూర్తవుతాయి.. శుభవార్తలు వింటారు

Peddinti Sravya HT Telugu
Dec 22, 2024 03:00 AM IST

Weekly Horoscope Telugu: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకూ ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

సెప్టెంబర్ నెల రాశి ఫలాలు
సెప్టెంబర్ నెల రాశి ఫలాలు

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 22.12.2024

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : ఆదివారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : ఉత్తర ఫాల్గుణి

మేష రాశి

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. చిన్ననాటి స్నేహితు లను కలుసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం ఉండవచ్చు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకా లంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవు తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఒప్పం దాలకు అనువైన సమయం. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి. ఆరోగ్యం నిలక డగా ఉంటుంది. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.

మిధున రాశి

గ్రహస్థితి ఆశాజనకంగా లేదు. ప్రతి విషయంలోనూ మిథునం శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపా రుల కొత్త ఒప్పందాల విషయంలో వేచిచూసే ధోరణితో ఉండటం మంచిది. వారాంతంలో శుభవార్త వింటారు. పరిస్థి తుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి

మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారు లకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్దలు రావొచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల అండదండలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

సింహ రాశి

నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచి పోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలె త్తవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. అనవసర మైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త కూడదు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. పిల్లల విషయంలో మంచి నిర్ణ యాలు తీసుకుంటారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

కన్య రాశి

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధు వర్గంతో సఖ్యత పెరుగుతుంది. . కోర్టు వ్యవహారాల్లో వృథా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. తీర్థయా త్రలు, విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగు తాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల రాశి

గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచనలు అమలుచేయ డంలో జాప్యం జరుగుతుంది. పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్ట పడాల్సిన సమయం. దానికి తగ్గ ఫలితం పొందుతారు. ఆదా యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటం కాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపో వచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయపాలన అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

రావలసిన డబ్బు అందుతుంది. రోజువారి లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటిం చడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కని పిస్తుంది. స్నేహితులు విభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవ హరించడం అవసరం. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. వారాంతంలో మంచి మార్పు వస్తుంది. గణపతి గుడికి వెళ్లండి.

ధనుస్సు రాశి

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నద మ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయా ణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకా శాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే రావ లసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కుటుంబసభ్యు లతో మనస్పర్థలు రావచ్చు. అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం,

మకర రాశి

మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కు లను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొం టారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యో గులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. వారం మధ్యలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవ రకు పరిష్కారం అవుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి

కుటుంబసభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో ఆభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల సల హాలు పాటించండి. వాహన మర్మతులు ముందుకురావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా.. చేతిలో ఉన్నవాటిపై దృష్టి సారించడం అవసరం. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల లబ్ది చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మీన రాశి

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొను గోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన ఉన్నది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner