Kalikiri Sainik School Jobs : కలికిరి సైనిక్ స్కూల్ లో 7 టీచింగ్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
Kalikiri Sainik School Jobs : అన్నమయ్య జిల్లా కలికిరి సైనిక్ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగ నోటిఫికేషవ్ విడుదలైంది. మొత్తం 7 పోస్టులను భర్తీ నున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 తోదీలాగా అప్లికేషన్లు ఆఫ్ లైన్ మోచ్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను పరిశీలించి ఎంపిక చేస్తారు.
Kalikiri Sainik School Jobs : అన్నమయ్య జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 10, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను విద్యార్హతలు, రాత పరీక్ష, వర్క్ ఎక్స్ పీరియన్స్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఖాళీల వివరాలు
- స్కూల్ మెడికల్ ఆఫీసర్-01
- పీజీటీ (కంప్యూటర్ సైన్స్) - 01
- పీజీటీ(మ్యాథ్స్)-01
- టీజీటీ (సోషల్ సైన్స్)- 01
- పీటీఐ కమ్ మ్యా్ట్రన్ -01
- కౌన్సెలర్- 01
- హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01
నెలకు వేతనాలు
మెడికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.73,491, పీజీటీ పోస్టులకు రూ.62,356, టీజీటీ, పీజీటీ, కౌన్సెలర్ పోస్టులకు రూ.58,819, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు రూ.38,252 నెల జీతంగా అందిస్తారు.
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, బీఈ, బీటెక్, ఎంసీఏ/ఎంబీఏ, బీఏ, బీఎడ్, ఎంఏ, బీపీఈడీ, ఎంఏ/ ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, టెట్/ సీటెట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయస్సు
మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 50 ఏళ్లు, పీజీటీ పోస్టులకు 21- 40 ఏళ్లు, టీజీటీ, పీటీఐ పోస్టులకు 21- 35 ఏళ్లు, కౌన్సెలర్ పోస్టుకు 26-45 ఏళ్లు, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 21-50 ఏళ్లు వయస్సు మించకూడదు.
ఫీజులు
- జనరల్/ ఓబీసీ ఎన్‌సీఎల్ అభ్యర్థులకు- రూ.500
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు -రూ.250.
దరఖాస్తు విధానం:
(1) అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కలికిరి సైనిక్ పాఠశాల వెబ్‌సైట్ https://sskal.ac.in/careers లో అందుబాటులో ఉన్న దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలి.
(2) అప్లికేషన్ లో వివరాలు పూర్తి చేసి అభ్యర్థి సంతకం, ఇటీవల ఫొటో జతపర్చాలి.
(3) రూ. 30 విలువైన పోస్టల్ స్టాంపులను అతికించిన సొంత అడ్రస్ రాసిన ఒక కవరును దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
(4) జనరల్/ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 250 డిమాండ్ డ్రాఫ్ట్‌ను ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరి పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలికిరి బ్రాంచ్ (కోడ్: 016427)లో చెల్లించి, దరఖాస్తుతో పాటు పంపాలి.
(5) దరఖాస్తు ఫారమ్ నింపి, డిమాండ్ డ్రాఫ్ట్, స్వీయ చిరునామా ఉన్న కవరు, స్వీయ ధ్రువీకరన సర్టిఫికెట్ల కాపీలను రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ ద్వారా “ది ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ పిన్: 517234” కు పంపాలి. దరఖాస్తులను 10 జనవరి 2025 లోపు పంపాలి.
(6).దరఖాస్తు చేసుకున్న పోస్ట్ పేరును కవర్ పై రాయండి.
1. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ముఖ్యమైన అర్హతల ఆధారంగా పరిశీలించి ఎంపిక చేస్తారు. వారి అర్హత, అనుభవానికి మద్దతుగా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు పంపాలి.
2. ఎంపిక ప్రక్రియకు హాజరు కావడానికి TA/DA అనుమితించారు.
3. ఈ ఖాళీలను ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తారు. ఈ తర్వాత పాఠశాలలో రెగ్యులర్ ఉద్యోగం పొందేందుకు అర్హత ఉండదు.
4. ఎంపికైన అభ్యర్థులు రెసిడెన్షియల్ స్కూల్‌లో పనిచేయాల్సి ఉందుంది.
5. దరఖాస్తుదారులు తమ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలి.
6. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేటప్పుడు వారి ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు (దరఖాస్తులో పేర్కొన్న అర్హతలు/అనుభవానికి మద్దతుగా) తీసుకురావాలి.
7. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 10 జనవరి 2025. పోస్టల్ జాప్యాలకు పాఠశాల పరిపాలన బాధ్యత వహించదు.