Barack Obama: 2024లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మెచ్చిన సినిమాలు ఇవే - రానా దగ్గుబాటి మూవీకి ఫస్ట్ ప్లేస్
Barack Obama: ఈ ఏడాది అమెరికా మాజీ ప్రెసిండెట్ బరాక్ ఒబామా మెచ్చిన సినిమాల్లో రానా దగ్గుబాటి ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2024లో ఒబామాకు నచ్చిన ఏకైక ఇండియన్ సినిమాఇదే కావడం గమనార్హం. ఈ మలయాళం సినిమాకు పాయల్ కపాడియా దర్శకత్వం వహించింది.
Barack Obama: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి డిస్ట్రిబ్యూట్ చేసిన ఇండియన్ మూవీ అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఫేవరేట్ మూవీస్‌లో లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2024 ఏడాదిలో తనకు బాగా నచ్చిన సినిమాల లిస్ట్‌ను ట్విట్టర్ వేదికగా బరాక్ ఒబామా ప్రకటించాడు. ఈ లిస్ట్‌లో ఇండియన్ మూవీ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకుంది.
స్పిరిట్ మీడియా...
పాయల్ కపాడియా దర్శకత్వంలో మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఇండియాలో రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా రిలీజ్ చేసింది. కేన్స్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ అవార్డులను గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ దక్కించుకుంది.
ఫస్ట్ ప్లేస్...
ఈ డ్రామా మూవీలో కని కుశృతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాతో పాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీతో పాటు పలు దేశాల్లో ఈ మూవీ రిలీజైంది. ఈ ఏడాది తనను బాటా ఆకట్టుకున్న సినిమాల్లో ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఒకటని బరాక్ ఒబామా చెప్పాడు.
హాలీవుడ్ సినిమాలు...
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్‌తో పాటు హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కన్‌క్లేవ్ కూడా ఆకట్టుకున్నదని బరాక్ ఒబామా అన్నాడు. ది పియానో లెసన్, ది ప్రామిస్‌డ్ ల్యాండ్, డ్యూన్ పార్ట్ 2, ది సీడ్ ఆఫ్ ది సాక్రేడ్ ఫిగ్ సినిమాలు తనను మెప్పించాయని బరాక్ ఒబామా ట్వీట్ చేశాడు. అలాగే అనోరా, షుగర్‌కేన్, దీదీ, ఏ కంప్లీట్ అన్‌నౌన్ సినిమాలు బాగా నచ్చాయని ట్వీట్‌లో ఒబామా అన్నాడు. ఒబామా ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆస్కార్ మిస్..
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీఆస్కార్ నామినేషన్స్‌లో నిలవకపోవడం విమర్శలకు దారితీసింది. బెస్ట్ పారిన్ లాంగ్వేజ్ మూవీస్ కోసం ఇండియాతో పాటు ఫ్రాన్స్ ఈ మూవీని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లపటా లేడీస్, ఫ్రాన్స్ నుంచి ఎమిలియా ఫెరేజ్ సినిమాలు ఆస్కార్ ఎంట్రీలో నిలిచాయి.
గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ కావడంతో కేన్స్‌లో అవార్డులు గెలిచిన ఈ మూవీని పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. ఇండియాలో మోస్తారు ఆదరణను దక్కించుకున్న ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ ఓవర్‌సీస్‌లో అదరగొడుతోంది. రెండు మిలియన్లకుపైగా వసూళ్లను రాబట్టింది.