Pushpa 2 Movie: పుష్ప 2 చూసి యువత చెడిపోతారు - మూడున్నర గంటలు టైమ్ వేస్ట్ - సినిమాటోగ్రఫీ మంత్రి కామెంట్స్
Pushpa 2 Movie: పుష్ప 2 మూవీ చూసి మూడున్నర గంటలు టైమ్ వేస్ట్ చేసుకున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశాడు. పుష్ప 2 చూసి యువత చెడిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
Pushpa 2 Movie: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చూసి సమాజంలోని యువత చెడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశాడు. ఈ సినిమా చూసి మూడున్నర గంటలు టైమ్ వేస్ట్ చేసుకున్నట్లు తెలిపాడు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా అభిమాని మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్సిటల్‌లో చికిత్స పొందుతోన్నాడు.
తెలుగు సినిమాలు చూడను...
హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్‌తో అతడి కుటుంబాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం పరామర్శించారు. శ్రీతేజ్ వైద్య సహాయం కోసం తన కుమారుడు ప్రతీక్ పేరిట ఏర్పాటుచేసిన ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షల చెక్‌ను శ్రీతేజ్ తండ్రికి మంత్రి అందజేశాడు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “హిస్టరీ, దేవుళ్లు, రాజులతో పాటు తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు తప్ప ఇక నుంచి తెలుగు సినిమాలు సినిమాలు చూడదలుచుకోలేదు.మూడున్నర గంటలు టైమ్ వేస్ట్. పుష్ప 2 సినిమా చూసి యువత పాడైపోతారు” అని మంత్రి అన్నారు.
బెనిఫిట్ షోలు ఉండవు...
ఇక నుంచి తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు అనుమతులు ఇవ్వమని సినిమాటోగ్రఫీ మంత్రి అన్నాడు. టికెట్ రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని తెలిపాడు. రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. శ్రీతేజ్ వైద్యం కోసం ఎంత ఖర్చయిన తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి అన్నారు.
అల్లు అర్జున్ రావడంతోనే...
శ్రీతేజ్ కోలుకోవడానికి ఏడాది, రెండేళ్లు పట్టొచ్చని, మాటలు కూడా రావడం అనుమానమేనని డాక్టర్లు తనతో అన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్, రష్మిక మందన్న రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా థియేటర్ గేట్లు ఓపెన్ చేయడంతో జరిగిన తోపులాటలో రేవతి మృతి చెందిదని, శ్రీతేజ్ గాయపడ్డాడని మినిస్టర్ అన్నారు.పోలీసులు అనుమతి నిరాకరించిన అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని మినిస్టర్ తెలిపారు.
శనివారం అసెంబ్లీలో అల్లు అర్జున్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమని ఆరోపించారు. సినిమా వాళ్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతే సహించేది లేదని అన్నాడు.