తెలుగు న్యూస్ / ఫోటో /
CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి
CM Ravanth Reddy : తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
(1 / 5)
తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
(2 / 5)
క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
(3 / 5)
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమస్త అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు.
(4 / 5)
విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సమాజ నిర్మాణంలో ఆదర్శవంతులుగా, విద్యార్థినీ విద్యార్థులను ఒక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలబడ్డారని అన్నారు.
ఇతర గ్యాలరీలు