Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!-victory venkatesh to grace balakrishna unstoppable show aha ott daku maharaj sankrathiki vasthunnam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM IST Nelki Naresh Kumar
Dec 21, 2024, 07:46 PM , IST

Unstoppable With Nbk: ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ పోటీప‌డ‌బోతున్నారు. సంక్రాంతి కానుక‌గా బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్‌, వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. సంక్రాంతికి ముందే ఈ ఇద్ద‌రు హీరోలు ఒకే స్క్రీన్‌పై అభిమానుల ముందుకు రాబోతున్నారు.

బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు వెంక‌టేష్ గెస్ట్‌గా రానున్నాడు. వెంక‌టేష్‌తో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోకు వ‌స్తార‌ని స‌మాచారం. 

(1 / 5)

అన్‌స్టాప‌బుల్ షోలో  సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా సంగ‌తుల‌తో పాటు త‌న కెరీర్ గురించి వెంక‌టేష్ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల్ని బాల‌కృష్ణ‌తో పంచుకోబోతున్న‌ట్లు స‌మాచారం. 

(2 / 5)

వెంక‌టేష్ గెస్ట్‌గా వ‌స్తోన్న ఎపిసోడ్ తాలూకు షూటింగ్ డిసెంబ‌ర్ 22న జ‌రుగ‌నున్న‌ది. 

(3 / 5)

క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా జ‌న‌వ‌రి 14న రిలీజ్ కాబోతోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. 

(4 / 5)

బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 12న రిలీజ్ కాబోతోంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు