Marvel Movie: స్పైడర్ మ్యాన్ యూనివర్స్‌లో ఆరవ మూవీ - క్రావెన్ ది హంటర్ రిలీజ్ ఎప్పుడంటే?
ఆరోన్ టేలర్ జాన్సన్ హీరోగా నటిస్తోన్న మార్వెల్ మూవీ క్రావెన్ ది హంటర్ జనవరి 1న ఇండియాలో రిలీజ్ అవుతోంది. స్పైడర్ మ్యాన్ యూనివర్స్‌లో రాబోతోన్న ఆరో మూవీగా తెరకెక్కుతోన్న క్రావెన్‌లో రసెల్ క్రో విలన్‌గా నటిస్తోన్నాడు.
మార్వెల్ కామిక్స్ నుంచి వస్తోన్న సూపర్ హీరో మూవీ క్రావెన్ ది హంటర్ మూవీ జనవరి 1న ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆరోన్ టేలర్ జాన్సన్ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. రసెల్ క్రో విలన్‌గా కనిపించబోతున్న ఈ మూవీలో చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
స్పైడర్ మ్యాన్ యూనివర్స్...
క్రావెన్ ది హంటర్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్‌లో రాబోతోన్న ఆరవ మూవీ కావడం గమనార్హం. దాదాపు 130 మిలియన్ డాటర్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు జేసీ చాందోర్ దర్శకత్వం వహించాడు. 2022లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల రిలీజ్ రెండేల్లు డిలే అయ్యింది.డిసెంబర్ 13న అమెరికాలో ఈ మూవీ రిలీజైంది.
మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో...
వరల్డ్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్న టేలర్ జాన్సన్ క్రావెన్ ది హంటర్ చాలా మేకోవర్ అయ్యాడు. తన ఫిట్‌లెన్ లెవెల్స్ పెంచుకుంటూ ఈ క్యారెక్టర్ కోసం ట్రాన్స్‌ఫర్మ్ కావాల్సివచ్చిందని టేలర్ జాన్సన్ అన్నాడు. క్రావెన్ రోల్ కోసం కఠినమైన వ్యాయామాలతో పాటు స్ట్రిక్ట్ డైట్ రోటీన్ ను ఫాలో కావాల్సివచ్చిందని అన్నాడు.
ఆరు నెలల్లోనే...
క్రావెన్ రోల్ కి ఉన్న ఫిజిక్ కోసం డేవిడ్ కింగ్స్ బరీ అనే ట్రైనర్, నెట్ స్మిత్ అనే న్యూట్రిషనిస్ట్ సాయం తీసుకున్నట్లు టేలర్ జాన్సన్ తెలిపాడు. కామిక్స్ లో చూస్తే, క్రావెన్ చాలా పెద్ద వాడిలా కనిపిస్తాడు. అందు వల్ల, ఆ పాత్రకు మజిల్స్ ఎక్కువగా పెంచాల్సి వచ్చింది. క్రావెన్ పాత్రకు తగ్గట్లుగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలంటే సంవత్సరాల టైమ్ పడుతుంది. కానీ పాత్ర బాగా కనెక్ట్ కావడంతో కేవలం ఆరు నెలలలోనే మేకర్ అయ్యాను!” అని టేలర్ జాన్సన్ చెప్పాడు.
తండ్రీ కొడుకుల ఎమోషన్...
క్రావెన్ ది హంటర్ మూవీకి యాక్షన్ అంశాలు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు. . యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు తండ్రీకొడుకుల ఎమోషన్ ఉంటుందని చెబుతోన్నారు. క్రావెన్ తండ్రి నికోలన్ క్రావినోఫ్ ఓ గ్యాంగ్‌స్టర్ (రస్సెల్ క్రోవ్). తండ్రి కారణంగా ప్రపంచాన్నే గడగడ వణికించే యోధుడిగా క్రావెన్ ఎందుకు మారాల్సివచ్చిందన్నదే ఈ మూవీ కథ.
జనవరి 1న
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లో, ఇండియా లో జనవరి 1వ తేదీన ‘క్రావెన్ ది హంటర్’ ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
టాపిక్