Romantic Comedy OTT: ఓటీటీలోకి మలయాళం రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ - మూడు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్
Romantic Comedy OTT: మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ తానారా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కాబోతోంది. దీప్తి సతి, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్‌తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
Romantic Comedy OTT: మలయాళం మూవీ తానారా థియేటర్లలో విడుదలైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో దీప్తి సతి, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ హరిదాస్ దర్శకత్వం వహించాడు.
మూడు ఓటీటీలలో...
తానారా మూవీ డిసెంబర్ 27న ఓటీటీలోకి రాబోతోంది. ఓవర్‌సీస్‌లో సింప్లీసౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజు నుంచి మనోరమా మ్యాక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇండియన్ ఆడియెన్స్ ముందుకు ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పాలిటిక్స్...
ఆగస్ట్ నెలలో థియేటర్లలో రిలీజైన తానారా మూవీ మలయాళం ఆడియెన్స్‌ను మెప్పించింది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా మన్ననల్ని అందుకున్నది. పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్ కామెడీ జోడించి దర్శకుడు హరిదాస్ తానారా సినిమాను రూపొందించారు.
ఎమ్మెల్యేతో పెళ్లి...
అంజలి (దీప్తి సతి) మాజీ హోమ్ మినిస్టర్ కూతురు. ఎమ్మెల్యే ఆదర్శ్‌తో ఆమె వివాహం జరుగుతుంది. ఆదర్శ్ జీవితంలో తాను కాకుండా మరో మహిళ ఉందని అంజలి అనుమానపడుతుంది. తనకు స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ ద్వారా ఆదర్శ్ చేస్తోన్న పనులపై సీక్రెట్‌గా ఎంక్వైరీ చేయిస్తుంటుంది అంజలి.
ఆదర్శ్ ఓ మహిళను కలవడానికి గెస్ట్‌హౌజ్‌కు వెళ్లాడని తెలిసి అక్కడికి వస్తుంది అంజలి. అదే టైమ్‌లో ఓ దొంగ రహస్యంగా గెస్ట్‌హౌజ్‌లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఆదర్శ్ లైఫ్‌లో ఉన్న మరో మహిళ ఎవరు? ఫామ్‌హౌజ్‌లోకి వచ్చిన దొంగను అంజలి, ఆదర్శ్ పట్టుకున్నారా? లేదా అన్నదే ఈ మూవీ కథ.
టాలీవుడ్‌లో వెబ్‌సిరీస్...
తానారా మూవీలో హీరోయిన్‌గా నటించిన దీప్తి సతి టాలీవుడ్‌తో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేసింది. మిస్ కేరళగా ఎంపికైన ఈ మ్యూటీ జాగ్వర్ మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. తీరువీర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సిన్‌లో లీడ్ రోల్‌లో కనిపించింది.
మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన దీప్తి సతి ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది.
దేవర మూవీలో విలన్...
మలయాళంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో తెలుగులో దసరా, దేవరతో పాటు మరికొన్ని సినిమాల్లో విలన్‌గా కనిపించాడు. మలయాళంలో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్న షైన్ టామ్ చాకో 2024లో ఏకంగా 14 సినిమాలు చేయడం గమనార్హం.